నిజాంపట్నం

ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలం లోని గ్రామం, మండలకేంద్రం


నిజాంపట్నం, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం మండలం లోని గ్రామం, ఇది ఒక ప్రాచీన ఓడరేవు. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం.ఇది సమీప పట్టణమైన రేపల్లె నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.

నిజాంపట్నం
పటం
నిజాంపట్నం is located in ఆంధ్రప్రదేశ్
నిజాంపట్నం
నిజాంపట్నం
అక్షాంశ రేఖాంశాలు: 15°54′N 80°40′E / 15.900°N 80.667°E / 15.900; 80.667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంనిజాంపట్నం
విస్తీర్ణం
22.76 కి.మీ2 (8.79 చ. మై)
జనాభా
 (2011)
20,982
 • జనసాంద్రత920/కి.మీ2 (2,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు10,623
 • స్త్రీలు10,359
 • లింగ నిష్పత్తి975
 • నివాసాలు5,734
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522314
2011 జనగణన కోడ్590482

చరిత్ర

మార్చు

నిజాంపట్నం ఒక ప్రాచీన ఓడ రేవు. పూర్వం దీనిని పెద్దపల్లి అని పిలిచేవారు. డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమండలం తీరంలో తమ మొదటి ఫ్యాక్టరీని 1606లో ఇక్కడ నెలకొల్పినది. ఇక్కడ లినెన్ బట్ట తయారుచేసేవారు. డచ్చివారి ఫ్యాక్టరీ 1669లో మూతపడినది. దక్షిణ భారతదేశములో మొదటి బ్రిటిషు వర్తక స్థావరము 1611లో ఇక్కడ నెలకొల్పారు. 1621లో బ్రీటిషు వారు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. నిజాం దీన్ని ఉత్తర సర్కారులలో భాగముగా ఫ్రెంచి వారికి రాసిచ్చాడు కాని 1759లో సలాబత్ జంగ్ బ్రిటిషు వారి దత్తముచేశాడు.

ప్రస్తుతం నిజాంపట్నం మండలం రేపల్లె శాసనసభ నియోజకవర్గంలో కొనసాగుతోంది. కిందటి (2004) సార్వత్రిక ఎన్నికలలో ఈ మండలం కూచినపూడి నియోజకవర్గంలో ఉండటం జరిగింది. ఆ తరువాతి పునర్వ్యవస్తీకరణ సంఘం ఈ మండలాన్ని రేపల్లె నియోజకవర్గం లోకి మార్చడం జరిగింది.

సమీప గ్రామాలు

మార్చు

ఈ గ్రామానికి సమీపంలో పెదపులుగు వారి పాలెం, ఆముదాలపల్లి, ఖాజీపాలెం, పెదమట్లపూడి గ్రామాలు ఉన్నాయి.

జనన గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5734 ఇళ్లతో, 20982 జనాభాతో 2276 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10623, ఆడవారి సంఖ్య 10359. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1418 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 623. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590482[1].పిన్ కోడ్: 522314.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,638. ఇందులో పురుషుల సంఖ్య సంఖ్య 10,583, స్త్రీల సంఖ్య 10,055, గ్రామంలో నివాస గృహాలు 5,114 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2276 హెక్టారులు.

గ్రామ పంచాయతీ

మార్చు
  • ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో, మోపిదేవి విజయనిర్మల సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా నాళం సురేష్ ఎన్నికైనాడు.

ప్రభుత్వ సంస్థలు

మార్చు
  • నిజాంపట్నంలో 2014, నవంబరు-25న, నూతనంగా నిర్మించిన కోస్ట్ గార్డ్ స్టేషనును ప్రారంభించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్, వైస్ అడ్మిరల్ అనురాగ్ జి. తప్తియాల్, దీనిని ప్రారంభించారు. భారతదేశం మొత్తం మీద ఇలాంటి స్టేషన్లు 42 ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాదిరిగానే కోస్త్ గార్డ్ గూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తుందనీ, ఏ అవసరమున్నా ప్రజలు వీరి సేవలు వినియోగించుకోగలరనీ, ఈ సందర్భంగా ఆయన తెలియజేసినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయo

మార్చు

చోళరాజుల కాలంలో తిమ్మ భూపాలుడు నేటి నిజాంపట్నాన్ని పరిపాలించేవాడు. ఆ సమయంలో, ఆవు చెవిలోనుండి శివలింగం ఉద్భవించడంతో, ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. అతి పురాతనమైన ఈ ఆలయ పునర్నిర్మాణానికి, 2013 డిసెంబరు 7 శనివారం ఉదయం శంకుస్థాపన జరిగింది. ఈ అలయ పునర్నిర్మాణానికి గ్రామస్థులు రు. 8 లక్షలు విరాళాలు సమకూర్చగా, ప్రభుత్వం రు. 16 లక్షలు మంజూరు చేసింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠకై, 2015, డిసెంబరు-23వ తేదీ గురువారం ఉదయం 11-15 గంటలకు శంకుస్థాపన నిర్వహించారు. నిజాంపట్నానికి చెందిన కీ.శే.పీతా కృష్ణమూర్తి, కాంతమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు శ్రీ సీతారామరాజు, కోడలు శ్రీమతి వెంకటేశ్వరమ్మ ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

శ్రీ మొగదారమ్మ" అమ్మవారి ఆలయం

మార్చు

నిజాంపట్నం గ్రామంలో మత్స్యకారులు మొగదారమ్మ అమ్మవారిని తమ ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు. ఈ అమ్మవారి వార్షిక సంబరాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పౌర్ణమికి ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో అమ్మవారికి వార్షిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

మార్చు

నిజాంపట్నం మండల కేంద్రంలోని జల్సా బాజారులో వేంచేసియున్న శ్రీ అంకమ్మ తల్లి కొలువులు, 2015, మే నెల-8,9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. చివరిరోజైన 10వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను గ్రామవీధులలో ఊరేగించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు.

శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం

మార్చు

గ్రామంలోని యల్లావుల వారి ఇలవేలుపు శ్రీ నాగార్పమ్మ తల్లి సంబరాలు, కొలుపులు, 2015, మే నెల-12వ తేదీ మంగళవారంనుండి, 15వ తేదీ శుక్రవారం వరకు, వైభవంగా నిర్వహించారు.

శ్రీ గుడారంకమ్మ అమ్మవారి ఆలయం

మార్చు

గ్రామములోని నర్రావారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి మూడురోజులు నిర్వహించే, వార్షిక సంబరాలలో భాగంగా, 2015, మే-30వ తేదీ శనివారంనాడు, అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. 31వతేదీ ఆదివారంనాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సుదూరప్రాంతాలనుండి భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మూడవ రోజూ, చివరి రోజైన సోమవారంనాడు గూడా భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారంతో అమ్మవారి సంబరాలు ముగింపుకు వచ్చినవి.

శ్రీ నన్నూరమ్మ తల్లి దేవర ఆలయం

మార్చు

దొంతిబోయినవారి ఇలవేలుపు అయిన ఈ ఆలయంలోని అమ్మవారి వార్షిక కొలుపులు, 2015, జూన్-5వ తేదీ శుక్రవారం నుండి 7వ తేదీ ఆదివారం వరకు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, 5వ తెదీ శుక్రవారంనాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, గ్రామోత్సవం నిర్వహించారు. 7వ తేదీ ఆదివారం భక్తులు, మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీ నిజపురి పాండురంగవిఠలేశ్వరస్వామివారి దేవస్థానం

మార్చు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

మార్చు

శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

మార్చు

హనుమజ్జయంతి సందర్భంగా, 2017, మే-22వతేదీ సోమవారంనాడు, అలంకరించిన వాహనంపై శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయస్వామివారి ఉత్సవ విగ్రహాలతో, మేళతాళాలతో, గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు టెంకాయలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.

శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయం

మార్చు

గ్రామములో సంతబజారులో, ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 22, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను, ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల/కళాశాల

మార్చు

నిజంపట్నం గ్రామంలో రు. 9.5 కోట్ల అంచనా వ్యయంతో, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఒక గురుకుల పాఠశాల/కళాశాల, నిర్మాణం పూర్తి అయినది. రెండు నెలల క్రితం ప్రారంభించారు. నాలుగురోజుల క్రితం ఈ పాఠశాలను పల్లపట్ల నుండి ఇక్కడకు మార్చారు. ఇక్కడ ప్రస్తుతం 600 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

మార్చు
  1. ఈ పాఠశాలలో రు. 4 లక్షల వ్యయంతో నిర్మించనున్న కళావేదిక నిర్మాణానికి, 2014, డిసెంబరు-6వ తేదీన శంకుస్థాపన నిర్వహించారు. దాత శ్రీ ఇంద్రగుపా, తన తండ్రి తూనుగుంట్ల రామచంద్రరావు ఙాపకార్ధం ఈ కళవేదికకు విరాళం అందజేసినారు.
  2. ఈ పాఠశాలలో చదువుచున్న పందరబోయిన సువర్ణకుమారి అను క్రీడాకారిణి, 2015, సెప్టెంబరు-7వ తేదీనాడు, చెరుకుపల్లిలో నిర్వహించిన ఎంపిక పోటీలలో ఈమె తన ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించుటకు ఎంపికైనది. అక్టోబరు/2015 లో వినుకొండలో నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి జిల్లా జట్టుకు ఎంపిక చేసిన 14 మంది క్రీడాకారులలో ఈమె ఒకరు.
  3. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న నర్రా శ్రీకృష్ణ అను విద్యార్థి రూపొందించిన "కిసాన్ రక్షక్" అను ప్రాజెక్టును అక్టోబరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి విఙాన ప్రదర్శనలో ప్రదర్శించగా, అది జాతీయస్థాయి విఙాన ప్రదర్శనకు ఎంపికైనది. 2015, డిసెంబరు-6,7 తేదీలలో న్యూఢిల్లీలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో దీనిని ప్రదర్శించెదరు. రైతులు ఆరుగాలం శ్రమించి పొలాలలో పండించిన పంట, కళ్ళాలలో తడవకుండా ఎలా కాపాడుకోవాలో తెలియజేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం.

బి.సి.బాలికల వసతిగృహం

మార్చు

నిజాంపట్నంలో రు. 68 లక్షల వ్యయంతో బి.సి.బాలికల వసతిగృహం నిర్మించారు.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి.

భూమి వినియోగం

మార్చు

నిజాంపట్నంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 348 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 63 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 344 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1519 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 269 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1250 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

నిజాంపట్నంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1250 హెక్టార్లు

ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామ ప్రముఖులు

మార్చు

తాతా పోతురాజు

మార్చు

1965 లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో వీరు తన తెగువ, ధైర్యసాహసాలు ప్రదర్శించి, తన రైఫిల్ తో పాక్ యుద్ధ విమానం "శాబర్ జెట్"ను కూల్చివేసి ఇతర సైనికులకు ఆదర్శంగా నిలిచారు. ఈ ఉత్సాహంతో మన సైనికులు మరో 40 పాక్ యుద్ధవిమానాలను కూల్చివేసినారు. నాటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్, వీరికి "వీర చక్ర" పురస్కారంతో గౌరవించి, ఆ స్టేజిపైననే వీరిని తెలుగులో ప్రత్యేకంగా అభినందించారు. అప్పుడే అక్కడ నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వీరితో కరచాలనం చేసి సాదరంగా అభినందించడం విశేషం. భారత్-పాక్ 1965 యుద్ధ విజయం లభించి 50 సంవతరాలు అయిన సందర్భంగా, 2015, ఆగస్టు-28వ తేదీనుండి సెప్టెంబరు-22వ తేదీవరకు, భారత ప్రభుత్వం స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటున్న నేపథ్యంలో, 2015, సెప్టెంబరు-22వ తెదీనాడు వీరిని తెనాలి పట్టణంలో ఘనంగా సన్మానించారు. అదే రోజున వీరి జీవిత విశేషాలను, యుద్ధంలో ఆయన చేసిన సాహసాలనూ ఉదాహరణలతో వివరించిన, తెలుగు జాతి కీర్తి పతాక - వీరచక్ర - తాతా పోతురాజు అను పుస్తకాన్ని గూడా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని, "తెనాలి ప్రచురణలు" అను సంస్థవారు ముద్రించారు.

మోపిదేవి వెంకట రమణారావు

మార్చు

2004, 2009 శాసనసభ ఎన్నికలలో కూచినపూడి, రేపల్లె నుండి పోటి చేసి గెలిచిన మోపిదేవి వెంకట రమణారావు గారు ఈ గ్రామ వాస్తవ్యులే. వారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సాంకేతిక విద్య, న్యాయ శాఖా మాత్యులుగా పనిచేసారు.

విశ్వనాధపల్లి వెంకటేశ్వరరావు

మార్చు

ఈ గ్రామానికి చెందిన ఆక్వా రైతు విశ్వనాధపల్లి వెంకటేశ్వరరావుకు జాతీయస్థాయిలో ఉత్తమ టైగర్ ఆక్వా సాగు పురస్కారం అందుకున్నారు. వీరికి ఒకేసారి రెండు పురస్కారాలు లభించడం ప్రశంసనీయం.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".