కోరికలే గుర్రాలైతే

కోరికలే గుర్రాలైతే సినిమా దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో వెలువడిన కుటుంబకథా చిత్రం.

కోరికలే గుర్రాలైతే
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మాగంటి మురళీమోహన్ ,
ప్రభ,
ఫటాఫట్ జయలక్ష్మి,
చంద్ర మోహన్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీలలితా ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

సంక్షిప్త కథ

మార్చు

జయలక్ష్మి మధ్యతరగతి కుటుంబం పిల్ల. కాలేజీలో చదువుకుంటూ వుంటుంది. పెళ్ళి అంటూ చేసుకుంటే ఏ కలెక్టరునో, లేక ఇంపాలా కార్లు, ఐదారు మేడలు, తరగని ఆస్తి వున్నవాడినో చేసుకోవాలని కలలు కంటూ వుంటుంది. ఆమె అక్క సోడాలు అమ్ముకునే వాడిని పెళ్ళి చేసుకుంటుంది. మూర్తి పానీయపు వ్యాపారంలో బాగా డబ్బు సంపాదిస్తాడు. జయలక్ష్మికి ఎలాగైనా పెళ్ళి చేయాలని మూర్తి దంపతులు అనుకుంటారు. మూర్తి స్నేహితుడు ముఖర్జీని ప్రధాన పాత్రధారిగా ఎన్నుకుని ఒక నాటకం ఆడతారు. ఆ నాటకం నిజమని నమ్మిన జయ ముఖర్జీని పెళ్ళి చేసుకుంటుంది. ముఖర్జీ చాలా సంపన్నుడని భావించిన జయ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు స్టేటస్ కోసం వేలకు వేలు అప్పు చేస్తుంది. చివరకు ముఖర్జీ పేదవాడని తెలిసి విడాకులు ఇస్తుంది. కథ చివరిలో జయ, ముఖర్జీ ఇద్దరూ కలవడంతో సుఖాంతమవుతుంది[1].

సాంకేతికవర్గం

మార్చు
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు
 • నిర్మాత: జి.జగదీశ్ చంద్ర ప్రసాద్
 • సంగీతం: సత్యం
 • ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
 • పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్యచౌదరి, దాసం గోపాలకృష్ణ

నటీనటులు

మార్చు
 • మురళీమోహన్
 • చంద్రమోహన్
 • మోహన్ బాబు
 • కాంతారావు
 • ప్రభ
 • రమాప్రభ
 • ఫటాఫట్ జయలక్ష్మి
 • నిర్మలమ్మ

పాటలు

మార్చు
 1. ఏమి వేషం ఏమి రూపం ఆహా కధా నాయకీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత - రచన: కొసరాజు
 2. కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే అదుపే లేని మనసు - పి.సుశీల - రచన: ఆత్రేయ
 3. కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే మనిషికి మతిపోతుంది -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
 4. మనసే మన ఆకాశం మనమే రవి చంద్రులం - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
 5. రే రే రేక్కాయలో ఆ రే రే రేక్కాయలో.. సందెకాడ సిన్నోడు - ఎస్.జానకి బృందం - రచన: దాసం గోపాలకృష్ణ
 6. సలామలేకుం రాణి నీ గులాం నౌతాను ముత్యాల పల్లకిలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె

మూలాలు

మార్చు
 1. వెంకట్రావు (17 January 1979). "చిత్రసమీక్ష - కోరికలే గుర్రాలైతే". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంపుటి 282. Retrieved 8 December 2017.[permanent dead link]

బయటిలింకులు

మార్చు