కోరీ అండర్సన్
కోరీ జేమ్స్ ఆండర్సన్ (జననం 1990, డిసెంబరు 13) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు ఆల్ రౌండర్‌గా రాణించాడు. ఐపిఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, న్యూజీలాండ్ ఫస్ట్ క్లాస్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఆడాడు. 2020లో న్యూజీలాండ్ జట్టు నుండి రిటైర్ అయిన తర్వాత, 2022లో యుఎస్ఏ క్రికెట్ టీమ్‌కి ఆడాలని తన ఉద్దేశాన్ని ప్రకటించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కోరీ జేమ్స్ ఆండర్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1990 డిసెంబరు 13|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 261) | 2013 అక్టోబరు 9 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2016 ఫిబ్రవరి 20 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 181) | 2013 జూన్ 16 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2017 జూన్ 9 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 56) | 2012 డిసెంబరు 21 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2018 నవంబరు 2 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2010/11 | కాంటర్బరీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2018/19 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2016 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | లాహోర్ కలందర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2020 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | బార్బడాస్ Tridents | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | San Francisco Unicorns | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2020 డిసెంబరు 6 |
2014, జనవరి 1న, ఆండర్సన్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అప్పటి వేగవంతమైన సెంచరీని సాధించడం ద్వారా గుర్తింను పొందాడు. వెస్టిండీస్‌తో కేవలం 36 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడు. షాహిద్ అఫ్రిది మునుపటి 37 బంతుల్లో రికార్డును బద్దలు కొట్టాడు. అండర్సన్ 47 బంతుల్లో 14 సిక్స్‌లు, 6 ఫోర్లతో 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.[1] వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లోనే సెంచరీ చేసిన ఎబి డివిలియర్స్ 2015లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
అంతర్జాతీయ కెరీర్
మార్చువన్డే కెరీర్
మార్చుఅండర్సన్ 2012-13 దక్షిణాఫ్రికా పర్యటనకు టీ20, వన్డే జట్టులో స్థానం పొందిన తర్వాత 2012, డిసెంబరు 21న దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో న్యూజీలాండ్ తరపున అరంగేట్రం చేశాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం న్యూజీలాండ్ వన్డే జట్టులో చేర్చబడ్డాడు. 2013, జూన్ 16న కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.
టెస్ట్ కెరీర్
మార్చు2013, జూలై 9న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. బ్యాట్‌తో 1 & 8 పరుగులు చేశాడు. 19 ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. అండర్సన్ తన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి టెస్టు సెంచరీ కొట్టాడు. 173 బంతుల్లో 116 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు.[2]
2018 మేలో, న్యూజీలాండ్ క్రికెట్ ద్వారా 2018–19 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌ను పొందిన ఇరవై మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Corey Anderson smashes ODI world record bringing up century against West Indies in 36 balls". ABC Grandstand. Australian Broadcasting Corporation. 1 January 2014. Retrieved 1 January 2014.
- ↑ "STATISTICS / STATSGURU / CJ ANDERSON / TEST MATCHES". ESPNcricinfo.
- ↑ "Todd Astle bags his first New Zealand contract". ESPNcricinfo. Retrieved 15 May 2018.