కృష్ణగిరి (తమిళనాడు)

(క్రిష్ణగిరి (తమిళనాడు) నుండి దారిమార్పు చెందింది)

కృష్ణగిరి, భారతదేశం తమిళనాడు రాష్ట్రం లోని ఒక నగరం.ఇది 2004లో ఏర్పడిన కృష్ణగిరి జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.ఈ పట్టణం కృష్ణదేవరాయ కొండల దిగువన ఉంది. పట్టణం పూర్తిగా కొండ రాళ్లతో చుట్టబడి ఉంది. ఇది చెన్నై నుండి 250 కిమీ దూరంలో, ధర్మపురి నుండి 45 కిమీ దూరంలో, బెంగళూరు నుండి 90 కిమీ దూరంలో ఉంది. మామిడిని ప్రధాన పంటగా పండించడం వల్ల కృష్ణగిరిని "భారతదేశ మామిడి పంట రాజధాని" అని పిలుస్తారు. ఇక్కడ భూమి చాలా సారవంతమైంది. నీటివసతి సమృద్ధిగా అందుబాటులో ఉంది. ఇది పంటలను పండించడానికి అనుకూలంగా ఉంటుంది. కృష్ణగిరి ముఖ్యమైన వ్యాపార, నివాస అభివృద్ధి ప్రదేశం. కృష్ణగిరి ఆనకట్టను 1967లో నిర్మించారు.ఆర్కాట్ మక్కన్ పెడా సంప్రదాయ తీపి తినుభండారాలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నగర శివార్లలో నీటిపై తేలియాడే కుటీరాలు, పార్క్ ఉన్నాయి.

Krishnagiri
City
Remains of the ancient fort on the Krishnadevaraya Hill
Remains of the ancient fort on the Krishnadevaraya Hill
Krishnagiri is located in Tamil Nadu
Krishnagiri
Krishnagiri
Krishnagiri (Tamil Nadu)
Coordinates: 12°31′36″N 78°12′54″E / 12.526600°N 78.215000°E / 12.526600; 78.215000
Country India
StateTamil Nadu
DistrictKrishnagiri
Named forRuled under Krishnadevarayar
Government
 • TypeSpecial Grade Municipality
 • BodyKrishnagiri Municipality
 • Member of Parliament (Lok Sabha)A. Chellakumar
 • Member of Legislative AssemblyK. Ashok Kumar
Elevation
525 మీ (1,722 అ.)
జనాభా
 (2011)
 • Total1,99,657
Languages
 • OfficialTamil
Time zoneUTC+05:30 (IST)
PIN
635001,635002,635115,635101,635120
Telephone code4343
Vehicle registrationTN-24

చరిత్ర

మార్చు

కృష్ణగిరి ప్రాంత చరిత్రకు పూర్వ ప్రాముఖ్యత ఉంది. పురాతన శిలాయుగం, నియోలిథిక్ మధ్యరాతియుగాలలో మానవజాతి నివాసాల ఉనికిని పురావస్తు మూలాలు నిర్ధారించాయి.ఈ జిల్లాలో కనిపించే సింధు లోయ నాగరికత, ఇనుప యుగ వివిధ రాతి చిత్రాలు, రాతిశిల్పాలు ఈ జిల్లా చారిత్రక ప్రాముఖ్యతను సమర్ధించాయి.

కృష్ణగిరి ప్రాంతం ప్రాచీన కొంగునాడు, చేర దేశంలో ఒక భాగం. చారిత్రాత్మకంగా ఇది చేరా పాలకులచే పాలించబడింది. తరువాత ఈ ప్రాంతం చోళులు, పల్లవులు, గంగులు, నులంబలు, హొయసలలు, విజయ నగర, బీజాపూర్ చక్రవర్తులు, మైసూర్ వడయార్లు, మదురై నాయకుల ఆధీనంలోకి వచ్చింది. కృష్ణగిరి ప్రాంతం "తమిళనాడు గేట్‌వే"గా వ్యవరిస్తారు. దక్షిణ ప్రాంతానికి సామ్రాజ్యవాదం, దోపిడీ ఉద్దేశాలతో చేసే ఆక్రమణదారుల నుండి దాడులను రక్షించటానికి ఇది రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కృష్ణగిరి కోట మొదటి ప్రధానమైన రక్షణప్రదేశంగా మారింది. విజయనగర చక్రవర్తులచే కృష్ణగిరి కొండపై నిర్మించిన అద్భుతమైన కోట ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది.

మైసూర్ యుద్ధం I సమయంలో, కావేరిపట్టిణం వద్ద హైదర్ అలీ సైన్యంపై దాడి చేయడానికి ఆంగ్లసైన్యం కృష్ణగిరి ప్రాంతం గుండా వెళ్ళాయి.ఇక్కడ ఆంగ్లసైన్యం ఓడిపోయింది.మైసూర్ యుద్ధం II లో "శ్రీరంగపట్టణం ఒడంబడిక" తర్వాత సేలం, బరాహ్ మహల్ మొత్తం ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అప్పగించారు. సా.శ.1792 లో, అలెగ్జాండర్ రీడ్ ఈ ప్రాంతానికి మొదటి జిల్లా కలెక్టర్ అయ్యాడు.అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ దౌత్యం కింద, కృష్ణగిరి బారామహల్ ప్రధాన కార్యాలయంగా మారింది.

సా.శ. 1794లో కృష్ణగిరిలో ఒక టంకశాల స్థాపించబడింది. బంగారం, వెండి, రాగి పాత నాణేలు ఇక్కడ లభించాయి. కృష్ణగిరి ప్రాంతానికి చెందిన అనేక మంది సైనికులు ప్రపంచయుద్ధంలో పాల్గొని మరణించారు. గతంలో ధర్మపురి జిల్లాలో భాగంగా ఉన్న కృష్ణగిరి విద్య, ఆర్థిక, పర్యాటక రంగాలలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిఉన్నందున, సంభావ్య వృద్ధికి ప్రత్యేక జిల్లాను సృష్టించాల్సిన అవసరం గమనించి, ప్రభుత్వం కృష్ణగిరిని 30వ జిల్లాగా ఏర్పాటు చేసింది. కృష్ణగిరి జిల్లా ధర్మపురి జిల్లా నుండి 2004 ఫిబ్రవరి 9న ఐదు తాలూకాలు, పది పంచాయితీ సమితులతో విభజించారు. [1]

జనాభా గణాంకాలు

మార్చు
మతాల ప్రకారం జనాభా
మత వివరం శాతం (%)
హిందూ
  
71.37%
ముస్లిం
  
24.7%
క్రిష్టియన్లు
  
3.77%
జైనులు
  
0.07%
సిక్కులు
  
0.05%
ఇతరులు
  
0.04%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కృష్ణగిరిలో 1,99,657 మంది జనాభా ఉన్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 1,015 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ [2]మొత్తం జనాభాలో 7,748 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వారిలో 4,059 మంది పురుషులు కాగా,3,689 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలుకు చెందినవారు 10.64% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలుకు చెందినవారు 18% మంది ఉన్నారు.

పట్టణ సగటు అక్షరాస్యత 76.79%, దీనిని జాతీయ సగటు 72.99% పొల్చగా నామమాత్రం తక్కువగా ఉంది.[2] పట్టణంలో మొత్తం 16386 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 24,559 మంది కార్మికులు ఉన్నారు.

వీరిలో 187 మంది రైతులు,99 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 640 మంది గృహ పరిశ్రమల వారు, 22,230 మంది ఇతర కార్మికులు, 1,403 సన్నకారు కార్మికులు, 10 సన్నకారు రైతులు, 42 మంది సన్నకారు వ్యవసాయ కార్మికులు, 20 మంది ఇతర కార్మికులు ఉన్నారు. [3]

మతాల ప్రకారం జనాభా

మార్చు

2011 మత గణన ప్రకారం, కృష్ణగిరి (ఎం)లో 71.37% హిందువులు, 24.7% ముస్లింలు, 3.77% క్రైస్తవులు 0.05%, సిక్కులు, 0.07%, జైనులు, 0.03% ఇతర మతాలను అనుసరించేవారు, ఏ మతాన్ని అనుసరించడం లేదా సూచించని వారు 0.01% ఉన్నారు. [4] కృష్ణగిరిలో తమిళం ఎక్కువగా మాట్లాడే భాష. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు దగ్గరగా ఉన్నందున ఇక్కడ తెలుగు, కన్నడ భాషలు కూడా మాట్లాడతారు.

కృష్ణగిరి ఆనకట్ట

మార్చు
 

హోసూర్, బెంగుళూరు, ధర్మపురి, వాణియంబాడి, అంబూర్, చెన్నై నుండి ఎక్కువ మంది సందర్శకులు వస్తారు. కృష్ణగిరి ఆనకట్ట 1958లో అప్పటి ముఖ్యమంత్రి కామరాజర్ పాలనలో నిర్మించారు. ఇది పట్టణానికి సమీపంలో ఉంది. సమీపంలో, సయ్యద్ బాషా కొండలలో పాలకుడు టిప్పు సుల్తాన్ కోట ఉంది. సమీపంలోని కొండలు, పర్వతాలతో పాటు వ్యవసాయ గృహాలకు నడక ద్వారా సాధ్యపడుతుంది. ప్రధాన బస్సుకేంద్రం నుండి 8 కి.మీ.దూరంలో పిల్లల ఆడుకునే ఉద్యానవనం ఉంది.ఇందులో నీటిపై ప్రయాణించే కుటీరంలో విహార సౌకర్య వసతి ఉంది. కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో అనేక రకాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. రామాపురం సమీపంలో 500 సంవత్సరాల పైబడిన పురాతన రామాలయం ఉంది. ఇది చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.


కృష్ణగిరి మ్యూజియం

మార్చు
 

ఈ జిల్లాలోని మ్యూజియం సాంప్రదాయ సంస్కృతి, కళ, వాస్తుశిల్పం, వారసత్వ, చారిత్రక నేపథ్యానికి ప్రసిద్ధి చెందింది, ప్రత్యేకించి తమిళనాడు, కృష్ణగిరి జిల్లా సాంప్రదాయ, వారసత్వం, సంస్కృతి కళలను వ్యాప్తి చేయడానికి ప్రత్యమ్నాయంగా ఒక వరం. ఈ మ్యూజియం సా.శ. 1993 నుండి నిర్వహించబడుతోంది. కృష్ణగిరిలోని గాంధీ సాలైలో ఉంది. ఇక్కడ చారిత్రక కట్టడాలు భద్రపరచబడి, ప్రదర్శించబడతాయి. ఇది పర్యాటక ప్రదేశం, విద్యా కేంద్రం. ఈ మ్యూజియం స్మారక చిహ్నాలను సేకరించి, వర్గీకరించి, వాటి చారిత్రక విలువపై పరిశోధనలు చేసేందుకు వాటిని భద్రపరుస్తుంది.

రవాణా

మార్చు

కృష్ణగిరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మధ్య ఎఎచ్ 7 (ఆసియా రహదారి 7) ద్వారా బాగా అనుసంధానించబడిన పట్టణీకరణ నగరం. కృష్ణగిరి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు కృష్ణగిరి- చెన్నై ఎన్ఎచ్ 48, తిండివనం -కృష్ణగిరి ఎన్ఎచ్ 77, కృష్ణగిరి- మదనపల్లి ఎన్ఎచ్ 42, శ్రీనగర్ - కన్యాకుమారి మీదుగా కృష్ణగిరి ఎన్ఎచ్ 44 వంటి అనేక జాతీయ రహదారుల ద్వారా అనుసంధానం ఉంది. కృష్ణగిరి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు రాష్ట్రాలను కలుపుతుంది .పట్టణం శివార్లలోని కొత్త బస్ స్టాండ్ చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరిలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలకు ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ రవాణా వాహనాల ద్వారా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్లు ధర్మపురి (45కిమీ), ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం, (35కిమీ), జోలార్‌పేట్ (60కిమీ), రాయకోట (30కిమీ) దూరంలో ఉన్నాయి. సమీప వాణిజ్య విమానాశ్రయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (91కిమీ) , సేలం విమానాశ్రయం (110కిమీ) దూరంలో ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Top at the Roll of Honour". Krishnagiri Collectorate. Krishnagiri, India. 9 February 2004. Archived from the original on 25 December 2010. Retrieved 21 జనవరి 2023.
  2. 2.0 2.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  3. "Census Info 2011 Final population totals – Krishnagiri". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  4. "Population By Religious Community – Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.

వెలుపలి లంకెలు

మార్చు