గంగోత్రి (సినిమా)

గంగోత్రి 2003లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు చిత్రం. ఇది కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ సినీరంగ ప్రవేశం చేసాడు. సినీనటి ఆర్తీ అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్, సుమన్, సీత, ప్రగతి, తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమా 54 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.[1]

గంగోత్రి
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
కథచిన్ని కృష్ణ
నిర్మాతఅల్లు అరవింద్,
సి. అశ్వినీదత్,
కె.సత్యసాయిబాబా,
కె. రాఘవేంద్రరావు
తారాగణంఅల్లు అర్జున్, అదితి అగర్వాల్, ప్రకాశ్ రాజ్
ఛాయాగ్రహణంఛోటా కె.నాయుడు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
యునైటెడ్ ప్రొడ్యూసర్స్
విడుదల తేదీ
2003 మార్చి 28 (2003-03-28)
భాషతెలుగు

కథ మార్చు

నీలకంఠం నాయుడు అనే ఫ్యాక్షనిస్టు దగ్గర పనిచేస్తుంటాడు నరసింహం. అతడు నీలకంఠానికి కుడిభుజం లాంటి వాడు. అతని కోసం ప్రాణాలైనా అర్పించగల నమ్మకస్తుడు. పెళ్ళైన చాలా ఏళ్ళకి నీలకంఠంకి ఒక కూతురు పుడుతుంది. ఆమెకి గంగోత్రి అని పేరు పెడతారు.

తారాగణం మార్చు

  • సింహాద్రిగా అల్లు అర్జున్
  • గంగోత్రిగా అదితి అగర్వాల్
  • నీలకంఠం నాయుడుగా ప్రకాష్ రాజ్
  • నరసింహగా సుమన్
  • సీత
  • తులసిగా ప్రగతి
  • తనికెళ్ళ భరణి
  • తెలంగాణా శకుంతల
  • బ్రహ్మానందం
  • సునీల్
  • మాస్టర్ తేజ సజ్జా
  • బేబి కావ్య కల్యాణరామ్

పాటలు మార్చు

ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. చరణ్, డి. ఐశ్వర్య, మనో, స్మిత, సునీత, ఎం.ఎం.కీరవాణి, శ్రీవర్ధిని, మాళవిక, కౌసల్య, కల్పన, గంగ పాటలు పాడారు.

  • ఒకతోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు పూసింది , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి చరణ్ , మాళవిక
  • నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .మాళవిక
  • గంగా .. నిజంగా , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి చరణ్ , సునీత
  • వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట [2] , రచన: చంద్రబోస్, గానం. కౌసల్య, డీ.ఐశ్వర్య
  • రైలు బండి , రచన: చంద్రబోస్, గానం.ఎస్ పి చరణ్, శ్రీవర్ధిని
  • మావయ్యది మొగల్తూరు , రచన: చంద్రబోస్, గానం.మనో, స్మిత
  • జీవన వాహిని , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎం ఎం కీరవాణి , గంగ, కల్పన.

పురస్కారములు మార్చు

మూలాలు మార్చు

  1. "Telugu Cinema Function - Gangotri - 100 days". www.idlebrain.com. Retrieved 2023-03-30.
  2. Sakshi (17 July 2021). "'వ‌ల్లంకి పిట్టా' బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.