జి.ఎం.సి.బాలయోగి

రాజకీయ నాయకుడు
(గంటి మోహనచంద్ర బాలయోగి నుండి దారిమార్పు చెందింది)

గంటి మోహనచంద్ర బాలయోగి, (1951 అక్టోబర్ 1-2002 మార్చి 3) ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. [1]

గంటి మోహనచంద్ర బాలయోగి
G. M. C. Balayogi in New Delhi, India, 2001.jpg
జి.ఎం.సి.బాలయోగి
జననంజి.ఎం.సి.బాలయోగి
1951-10-01
తూర్పు గోదావరి జిల్లా యెదురులంక
మరణం2002-03-03
కృష్ణా జిల్లా కువ్వడలంక
మరణ కారణంహెలికాప్టరు ప్రమాదం
పదవి పేరుపార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలం1998-03-24 : 2022-03-03 లోక్‌సభ స్పీకర్
భార్య / భర్తవిజయకుమారి
పిల్లలుముగ్గురు కుమార్తెలు , గంటి హ‌రీష్ మాధుర్‌
తండ్రిగన్నయ్య
తల్లిసత్యమ్మ

జననంసవరించు

బాలయోగి 1945, అక్టోబరు 1 న తూర్పు గోదావరి జిల్లా లంక గ్రామంలో గంటి యెదురుగన్నయ్య, సత్యమ్మ దంపతులకు ఒక దళిత రైతు కుటుంబంలో జన్మించాడు. [1] ఇతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహం చేసుకున్నాడు.ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.

మరణంసవరించు

 
వేమగిరి (తూ.గో.జిల్లా)లో జి.ఎం.సి.బాలయోగి విగ్రహం

2002,మార్చి 3న భీమవరం నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపం వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం సమీపంలోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదంలో బాలయోగి మరణించాడు.[1]

నిర్వహించిన పదవులుసవరించు

  • 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లాపరిషత్ అధ్యక్షుడు
  • 1991లో - 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1996 - 1998 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
  • 1998 - 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1998 - మార్చి 24 - 2002, మార్చి 3 లోక్‌సభ స్పీకర్
  • 1999 - 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
అంతకు ముందువారు
పి.ఎ.సంగ్మా
భారత లోకసభ స్పీకర్లు
1998–2002 |with16=
తరువాత వారు
మనోహర్ జోషి

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Former Speakers -GMC Balayogi". Retrieved 2021-07-21.

ఇతర లింకులుసవరించు