గండికోటరహస్యం 1969 మే 1 న విడుదల.డీ.వి.ఎస్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయం చేయగా, జయలలిత, దేవిక, రాజనాల ముఖ్యపాత్రలు పోషించారు.1958 లో తమిళంలో వచ్చిన "నదోడి మన్నన్"చిత్రానికి రీమేక్. హిందీలో "భగవత్" పేరుతో డబ్బింగ్ చేయబడింది. ఈ చిత్రానికి సంగీతం టీ. వి. రాజు సమకూర్చారు.

గండికోట రహస్యం
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయం,
జయలలిత,
రాజనాల,
దేవిక,
మిక్కిలినేని,
ప్రభాకర రెడ్డి,
రాజబాబు,
రమాప్రభ,
జగ్గారావు,
త్యాగరాజు
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

గండికోట రాజ్యానికి యువరాజు జయంతుడు (ఎన్టీ రామారావు). పెదనాన్న కుమారుడు ప్రతాప్ (రాజనాల)యువరాజును విషయలోలుని కావించి రాజ్యపాలనా వ్యవహారాలు తెలియనీయకుండా చేసి ఎప్పటికైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పథకం వేస్తుంటాడు. ఇందుకు సైన్యాధిపతి (ప్రభాకర రెడ్డి)కూడా సహాయం చేస్తుంటాడు. యువరాజు తల్లి, భార్య (దేవిక)రాజ్య పరిస్థితిని చూసి బాధ పడుతూ ఉంటారు. యువరాజుకి పట్టాభిషేకం చేసి రాజ్య భారాన్ని అప్పజెపితేనైనా దారిలోకి వస్తాడేమోనని అందుకు ఏర్పాట్లు చేస్తారు. పట్టాభిషేకానికి ధనసహాయం పేరుతో ప్రతాప్ యువరాజు ఆమోదముద్ర తీసుకుని ప్రజలను పన్నుల కోసం పీడించడం మొదలుపెడతాడు. సామాన్యుడైన రాజా (మరో ఎన్టీ రామారావు )ప్రజల భాదలను చూసి సహించలేక అధికారుల మీద తిరగబడతాడు. వారు తనని బంధించబోతే తప్పించుకుని పారిపోయి రాజుకు ప్రజల పరిస్థితి నివేదించడానికి అంతఃపురంలో ప్రవేశించి రాజుకు పరిస్థితులను వివరించి రాజాభిమానాన్ని చూరగొంటాడు. రాజు తన తప్పును తెలుసుకుని ఇక ప్రజలను ఏ లోటూ రాకుండా చూసుకుంటానని మాట ఇస్తాడు.

పట్టాభిషేకం మరో రోజు ఉందనగా యువరాజు, రాజా ఇద్దరూ కలిసి భోంచేస్తుండగా ప్రతాప్ రాజుమీద విషప్రయోగం జరిపిస్తాడు. ఆ విషం సేవించడం వల్ల రాజు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. మహామంత్రి రాజాకి రాజ్యం ప్రతాప్ చేతిలో పడితే ఎంత అల్లకల్లోలమవుతుందో వివరించి యువరాజు స్థానంలో అతన్ని పట్టాభిషేకం చేసుకోమంటాడు. గత్యంతరం లేక రాజా అందుకు అంగీకరిస్తాడు. పట్టాభిషేకానికి రాజా కావాలనే ఆలస్యంగా వస్తాడు. ఈ లోపునే యువరాజు మీద అనేక అభాండాలు వేసి ప్రతాప్ సింహాసనాన్ని అధిష్టించాలని చూస్తాడు. కానీ రాజా చివరి సమయంలో వచ్చి రాజ్యాధికారం చేపడతాడు. పరిపాలనలో మార్పులు చేస్తాడు. ఒకవైపు యువరాజా వారిని రహస్యంగా ఉంచి వైద్యం జరిపిస్తుంటాడు. కొద్దిరోజులకి ప్రతాప్ కి రాజా మీద అనుమానం వచ్చి రహస్యాన్ని కనుక్కుంటాడు. కానీ యువరాజును రాజా ప్రేయసి కాపాడుతుంది కానీ సైన్యాధిపతి చేతిలో చిక్కి బంధీ అవుతాడు. చివరికి ఇద్దరు కథానాయకులు కలిసి ప్రతినాయకులను అంతమొందించి రాజ్యం చేరుకోవడంతో కథ ముగుస్తుంది.

పాటలు

మార్చు
క్రమ సంఖ్య పాట రచయిత సంగీతం గాయకులు
1. కన్నెలోయి కన్నెలు కవ్వించే కనుసన్నలు కాముని పున్నమి వెన్నెలు సి నారాయణ రెడ్డి టి.వి.రాజు ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
2. నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా - నిరుపేద కలువ వేచెనని మరచిపోదువా సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
3. మరదలు పిల్లా ఎగిరి పడకు గడసరి పిల్లా ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల
4. పాడనా మనసు పాడనిపాట, ఆడనా పదములాడని ఆట సి.నారాయణరెడ్డి టి.వి.రాజు పి.సుశీల
5. తగలుకుంటే వదలడేంది ముసలి మామా ఏడ దాపరించాడు కొసరాజు రాఘవయ్య చౌదరి టి.వి.రాజు ఎల్. ఆర్. ఈశ్వరి పిఠాపురం
6. తెలిసింది తెలిసింది అబ్బాయిగారు తెల్లారిపోయింది నీ కోడె పొగరు సి. నారాయణ రెడ్డి. టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
7. నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి తళతళ నా ముంగట సి నారాయణ రెడ్డి టి.వి.రాజు పి.సుశీల
8. వయ్యారి వయ్యారి అందాల బొమ్మ వచ్చిందోయి ఓ అయ్యారే వయ్యారి కొసరాజు రాఘవయ్య చౌదరి టి.వి.రాజు పి.సుశీలబృందం
9. యెంత చక్కని వాడు యెన్ని నేర్చిన వాడు నన్ను నిలువగ నీడు సి నారాయణ రెడ్డి టి.వి.రాజు పి.సుశీల

వనరులు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.