గజ్వేల్

సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ మండలంలోని పట్టణం
(గజ్వేల్‌ నుండి దారిమార్పు చెందింది)
  ?గజ్వేల్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°51′06″N 78°40′58″E / 17.8517°N 78.6828°E / 17.8517; 78.6828
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 21.70 కి.మీ² (8 చ.మై)[1]
జిల్లా (లు) సిద్ధిపేట జిల్లా
జనాభా
జనసాంద్రత
24,961[2] (2011 నాటికి)
• 1,150/కి.మీ² (2,978/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం గజ్వేల్ పురపాలకసంఘం


గజ్వేల్, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకు, గజ్వేల్ మండలానికి చెందిన గ్రామం.[3] 2012లో గజ్వేల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[4] గజ్వేల్ అసలు పేరు గజవెల్లువ. రాజుల కాలంలో ఏనుగులతో గజ్వేల్ కు నీరు తీసుకువచ్చేవారని ప్రతీతి.

పట్టణంలోని మహతి ఆడిటోరియం

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]

విద్యుత్ వ్యవస్థ

మార్చు

తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ, వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుంది.

రవాణా వ్యవస్థ

మార్చు

పట్టణంగుండా జాతీయ రహదారి రాజీవ్ రహదారి వెళ్తున్నందున 24 గంటల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఈ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు అందుబాటులోకి రాబోతుంది

పారిశుద్ధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కన వేయడం నిషిద్ధం.

నీటి సరఫరా

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

గ్రామ జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా - 24, 961; పురుషులు - 12, 497; స్త్రీలు - 12, 464.[2]

ప్రభుత్వం, రాజకీయాలు

మార్చు

తెలంగాణ వచ్చిన తర్వాత గజ్వేల్ పట్టణం శరవేగంగా అభివృద్ధి జరగడం మనం చూస్తున్నాము.గజ్వేల్ పట్టణ నియోజకవర్గాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థ (GADA) చైర్మన్ హనుమంతరావు పలు అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారు.ముఖ్యంగా ఎడ్యుకేషనల్ హబ్, ప్రభుత్వ ఆసుపత్రి, ఆడిటోరియం, క్లాక్ టవర్, పాలిటెక్నిక్ కళాశాల, ఔటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, బస్టాండు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.గజ్వేల్ పట్టణ ప్రజల చిరకాల స్వప్నం రైల్వే లైన్ (మనోహరబాద్ నుండి పెద్దపల్లి) అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులు "విలేజ్ విహారి" అను యూట్యూబ్ ఛానల్ వారు "మన గజ్వేల్" అను శీర్షికతో చూపించారు.

మూలాలు

మార్చు
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. 2.0 2.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 44. Retrieved 11 June 2016.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "Basic Information of Municipality, Gajwel Municipality". gajwelmunicipality.telangana.gov.in. Retrieved 16 April 2021.
  5. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-17.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గజ్వేల్&oldid=4350081" నుండి వెలికితీశారు