ప్రధాన మెనూను తెరువు

గణపేశ్వరం

భారతదేశంలోని గ్రామం

గణపేశ్వరం, కృష్ణా జిల్లా, నాగాయలంక మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 120., ఎస్.టి.డి. కోడ్ = 08671.

గణపేశ్వరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,093
 - పురుషులు 2,787
 - స్త్రీలు 2,306
 - గృహాల సంఖ్య 1,405
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671.

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో పర్రచివర, టి.కొత్తపాలెం, కమ్మనమొలు , నాగాయలంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, కోడూరు, రేపల్లె, మోపిదేవి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 76 కి.మీ

గ్రామములోని విద్యాసౌకర్యాలుసవరించు

ప్రభుత్వ పాఠశాల, ప్రగతి విద్యానికేతన్, ప్రతిబా విద్యానికేతన్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, సి.బి.సి.ఎన్.సి ప్ర్రాదమికోన్నత పాఠశాల,

గ్రామములో మౌలిక వసతులుసవరించు

త్రాగునీటి సౌకర్యాలుసవరించు

గణపేశ్వరం పంచాయతీ పరిధిలోని గణపేశ్వరం, దిండి గ్రామాలలో రు. 50 లక్షల ఖర్చుతో, ప్రభుత్వం రెండు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటుచేసింది. గణపేశ్వరం గ్రామాంలో 60,000 లీటర్ల సామర్ధ్యంగల ఒక ఒవర్ హెడ్ నీటి ట్యాంకును ఏర్పాటుచేసారు. ఇక్కడ మంచినీటి చెరువుద్వారా ఈ పథకం నిర్వహించవలనని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామంలో ఈ పథకం కొంత కాలం పనిచేసింది. ఇప్పుడు నిర్వహణ లోపం వలన ఈ పథకం పనిచేయకపోవడంతో, గ్రామానికి మంచినీటి సౌకర్యం లేకుండా పోయింది.

విద్యుత్తు సౌకర్యంసవరించు

నాగాయలంక మండలంలోని మత్స్యకార గ్రామాలలో విద్యుత్తు సమస్యను పరిష్కరించేటందుకు, ఈ గ్రామంలో కొత్తగా రు. కోటి రూపాయల వ్యయంతో, ఒక 33/11 కె.వి. ఉపకేంద్రం నిర్మాణం పూర్తి అయినది. 2015.ఫిబ్రవరి-12వ తేదీన ప్రారంభించారు. ఈ కేంద్రం వలన, ఈ గ్రామంతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలయిన తలగడదీవి, పర్రచివర, దిండి, పుల్లయ్యగారి దిబ్బ, దీనదయాళపురం, సొర్లగొంది, నాలి, బర్రంకుల గ్రామాలలో విద్యుత్తు సమస్య తొలగుపోవును. ఈ గ్రామంలో నిర్మించిన ఈ విద్యుత్తు ఉపకేంద్రం, మండలంలో నాల్గవ కేంద్రం.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ దాసి జీవరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ దుర్గా గణపేశ్వరస్వామివారి ఆలయంసవరించు

కాకతీయ గణపతిదేవుడి పేరుమీద ఆయన బావమరిది జాయపసేనాని నిర్మించిన ఆలయమిది.[2] దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి, తలగడదీవి, టి.కొత్తపాలెం గ్రామాలలో, 100 ఎకరాల మాన్యం భూమి ఉంది. జిల్లాలో, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయం ఇది. ఈ ఆలయ ప్రాంగణంలో, చేబ్రోలు నాయకుడు, ఈ ఆలయ నిర్మాత, కాకతీయ గజసైన్యాధ్యక్షుడు, అయిన జాయపసేనాని విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఈయన తలగడదీవి ప్రాంతాన్ని ఏలిన అయ్యవంశరాజు పిన్నచోడి కుమారుడు. నృత్యరత్నావళీ గ్రంథకర్తగా, ఆరితేరిన యుద్ధవీరునిగా, మహాశిల్పిగా వాసికెక్కిన ఈయన శిల్పాన్ని, ఈయన నృత్యరత్నావళి వ్రాయు భంగిమలో ఈ శిల్పాన్ని 2016, మే-4వతేదీనాడు ఏర్పాటుచేసారు. ఈ ఆలయ ప్రాంగణంలోని ఉపాలయంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏర్పాటుచేసేటందుకు, బర్రెంకుల గ్రామానికి చెందిన దాత శ్రీ గోపాలం వేంకటేశ్వరరావు, రెండున్నర లక్షల రూపాయల వ్యయంతో ఒక నూతన ధ్వజస్తంభాని సమర్పించారు. ఈ జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016, ఏప్రిల్-30వతేదీ శనివారంనాడు, ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ నూతన ధ్వజస్తంభాన్నీ మరియు నూతన నవగ్రహ మండపాన్నీ, 2016, మే-4వ తేదీ బుధవారంనాడు వైభవంగా ప్రతిష్ఠించారు.

గ్రామములోని ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు,

గ్రామములోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5,093 - పురుషుల సంఖ్య 2,787 - స్త్రీల సంఖ్య 2,306 - గృహాల సంఖ్య 1,405

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5217.[3] ఇందులో పురుషుల సంఖ్య 2641, స్త్రీల సంఖ్య 2576, గ్రామంలో నివాసగృహాలు 1405 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2140 హెక్టారులు.

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో పర్రచివర, టి.కొత్తపాలెం, కమ్మనమొలు, నాగాయలంక గ్రామాలు ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Ganapeswaram". Retrieved 27 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. హల్ట్ష్, ఇ, సంపాదకుడు. (1979). ఎపిగ్రాఫియా ఇండికా. 3. న్యూ ఢిల్లీ: డైరెక్టర్ జనరల్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. pp. 126, 127.
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు


"https://te.wikipedia.org/w/index.php?title=గణపేశ్వరం&oldid=2744300" నుండి వెలికితీశారు