గుండు సుధారాణి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు. 2015లో ఆవిడ తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది . సుధారాణి బీసీ సామజిక వర్గానికి చెందిన మహిళా. సుధారాణి కుటుంబానికి వరంగల్ జిల్లాలో నగల వ్యాపారం, పెట్రోల్ పంపులు, భూ వ్యాపారాలు ఉన్నాయి.[1]ఆమె ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నది. 2021, మే 7న వరంగల్లు మహానగర పాలక సంస్థ మేయ‌ర్‌గా గుండు సుధారాణి ఎన్నికయింది.[2][3]ఆమె 01 జూన్ 2021న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయ‌ర్‌గా బాధ్యతల చేపట్టింది.[4]

గుండు సుధారాణి
గుండు సుధారాణి

శ్రీమతి గుండు సుధారాణి


వరంగల్ మేయర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-07-28) 1964 జూలై 28 (వయసు 60)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ  కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం

భారత్ రాష్ట్ర సమితి (2015-2024)

జీవిత భాగస్వామి గుండు ప్రభాకర్
వృత్తి రాజకీయాలు
మతం హిందూ

గుండు సుధారాణి 2024 ఏప్రిల్ 25న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[5][6]

నేపధ్యము

మార్చు

1964, జూలై 28 న జన్మించింది.[7] 2014 పార్లమెంటు సమావేశాలలో ఈవిడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజ్యసభలో గళమెత్తినది.[8]

విద్యాభ్యాసము

మార్చు

మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ లో ఎం. ఎ చేసింది[7].

రాజకీయాలు

మార్చు
  • 2002 నుంచి 2004 వరకు టీటీడీ బోర్డు సభ్యురాలు
  • 2005 నుండి 2010 వరకు వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించింది. 2010 లో తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైనది.
  • 2002 నుండి 2004 వరకు తిరుమల తిరుపతి దేవస్థానములు పాలకమండలి సభ్యురాలుగా ఎన్నుకోబడినది [7]
  • 2017 - తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌[9]
  • ఆమె 2021లో గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) 29వ డివిజన్ టీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ అందజేశారు.[10]

సమాజ సేవ

మార్చు

కేంద్ర ప్రభుత్వము ప్రవేశపట్టిన సంసద్ ఆదర్శ్ గ్రామ్‌ యోజన పధకం క్రింద వరంగల్ గ్రామీణ జిల్లా, ఆత్మకూరు మండలం లోని నీరుకుళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకున్నది.[11]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-02. Retrieved 2015-10-31.
  2. Namasthe Telangana (7 May 2021). "గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్‌గా గుండు సుధారాణి". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  3. ఈనాడు, వార్తలు (7 May 2021). "ఖమ్మం, వరంగల్‌ మేయర్లు ఖరారు". www.eenadu.net. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  4. Namasthe Telangana (1 June 2021). "ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి". Namasthe Telangana. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  5. EENADU (26 April 2024). "కాంగ్రెస్‌లో చేరిన వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  6. Hindustantimes Telugu (26 April 2024). "కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ మేయర్​ సుధారాణి". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024. {{cite news}}: zero width space character in |title= at position 32 (help)
  7. 7.0 7.1 7.2 "Biographical Sketch Member of Parliament Rajya Sabha". Archived from the original on 27 మార్చి 2019. Retrieved 9 March 2014.
  8. "Pepper spray leaves Lok Sabha and nation in tears - News". Mid-day.com. Retrieved 2014-03-24.
  9. Sakshi (29 May 2017). "8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  10. Sakshi (19 April 2021). "గ్రేటర్‌ ఫైట్‌: ఎవరు బరిలో నిలిచారో తెలుసా?". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  11. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-10-31.

బయటి లంకెలు

మార్చు