గుడ్ లక్ సఖీ
గుడ్ లక్ సఖీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించిన ఈ చిత్రానికి నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 28 జనవరి 2022న విడుదల కానుంది.[1]
గుడ్ లక్ సఖీ | |
---|---|
దర్శకత్వం | నగేశ్ కుకునూర్ |
రచన | నగేశ్ కుకునూర్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | చిరంతాన్ దాస్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ |
పంపిణీదార్లు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 28 జనవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమాను అక్టోబర్ 2019న ప్రారంభించారు.[2] ఈ సినిమా ట్రైలర్ ను 15 ఆగస్ట్ 2020న విడుదల చేశారు.[3] ఈ సినిమాను 3 జూన్ 2021న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు , కానీ కోవిడ్ రెండో వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.[4]
నటీనటులు
మార్చు- కీర్తి సురేష్
- ఆది పినిశెట్టి - గోలీ రాజు [5]
- జగపతిబాబు
- రాహుల్ రామకృష్ణ
- రమాప్రభ
సాంకేతిక నిపుణులు
మార్చు- దర్శకత్వం: నగేశ్ కుకునూర్ [6]
- నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్యా వర్మ
- రచన: నగేశ్ కుకునూర్
- సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రాఫర్: చిరంతాన్ దాస్
- ఎడిటింగ్:శ్రీకర్ ప్రసాద్
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (21 January 2022). "'గుడ్‌లక్ సఖి' రిలీజ్ డేట్ వచ్చేసింది". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.
- ↑ Sakshi (28 October 2019). "'గుడ్‌లక్ సఖి' అంటున్న కీర్తి సురేశ్". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
- ↑ The Hindu (15 August 2020). "Nagesh Kukunoor, Keerthy Suresh film is a sports rom com". The Hindu (in Indian English). Archived from the original on 2 జనవరి 2021. Retrieved 27 June 2021.
- ↑ Andhrajyothy (26 June 2021). "ఫ్యాన్స్ కోసం". andhrajyothy. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
- ↑ Sakshi (6 September 2020). "బై బై గోలీరాజు". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
- ↑ Telangana Today (29 April 2019). "Nagesh Kukunoor to make Telugu debut". archive.telanganatoday.com. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.