గురవాయిపాలెం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
గురవాయిపాలెం, కృష్ణా జిల్లా, కలిదిండి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
గురవాయిపాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°30′38″N 81°18′41″E / 16.510558°N 81.311418°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కలిదిండి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ నిక్కు పూర్ణ చంద్రరావుగారు |
పిన్ కోడ్ | 521344 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
చరిత్ర
మార్చుగురవాయిపాలెం కలిదిండి మండలాన్ని ఆనుకుని ఉన్న ఒక గ్రామం.దీనినే గుర్వాయిపాలెం అనికూడా పిలుస్తారు. కలిదిండిని పరిపాలించే రాజులు గుర్రాలను ఇక్కడ కట్టేవారు. మొదట "గుర్రాలపాలెం"గా పిలవబడి కాలక్రమేణా "గురవాయిపాలెం"గా మారింది.
ఇక్కడ ప్రధాన కులాలు గౌడ, ముదిరాజ్. ఈ గ్రామంలో 99% వెనుకబడిన కులాలవారు ఉన్నారు. వెనుకబడిన కులాలవారు ఉన్నప్పటికీ ఈ గ్రామంలో "వెనుకబాటుతనం" లేదు. ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం ఉంటే దాదాపు అన్ని వర్గాలవారిని పిలవడం ద్వారా సామాజిక సామరస్యాన్ని పాటిస్తారు. అందరూ వచ్చి వడ్డన కార్యక్రమాలు, మిగతా పనులలో తమవంతు సహాయం చేస్తారు.
గ్రామ భౌగోళికం
మార్చుఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుకలిదిండి, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ.దూరంలో ఉంది.
దేవాలయాలు
మార్చుఊర్లో నాలుగు హిందూ ఆలయాలున్నాయి.
- రామాలయం: ఇది ఊరి మధ్యలో ఉంటుంది
- ఆంజనేయుని గుడి : కలిదిండి-భీమవరం రోడ్డు ప్రక్కనే ఉంటుంది.
- పెద్దింట్లమ్మ గుడి ఇది ఊరు శివారున ఉంటుంది
- రామాలయం ఇది హరిజనవాడలో ఉంటుంది.
క్రైస్తవ మందిరాలు 5 ఉన్నాయి. ముస్లింలు లేరు కనుక మసీదు లేదు. ఇక్కడ రాజు, కమ్మ, బ్రాహ్మణ, కాపు వంటి అగ్రవర్ణాలు లేవు.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో 7వ తరగతి వరకు చదువుకొనుటకు ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంది. ప్రైవేటు పాఠశాల సదుపాయాలు గతంలో ఉండేవి కానీ ఆర్థికంగా అందరూ తక్కువగా ఉండుట, విద్యాపరమైన అవగాహన తక్కువగా ఉండుట వల్ల వాటిని మూసివేసారు. పై చదువులకు పక్కనే ఉన్న కలిదిండి, కైకలూరు, భీమవరం, విజయవాడలకు వెళతారు. ఇక్కడివారు సాధారణంగా 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ వరకు చదివి పోలీసు కానిస్టేబుల్, హోమ్ గార్డు వంటి ఉద్యోగాల కొరకు ఎక్కువ కృషిచేస్తారు.
అత్యున్నత విద్యార్హత: ఈ ఊరిలో రాగం పుల్లాజీగారి పెద్ద అబ్బాయి (శ్రీనివాసరావు, పిహెచ్‌డి[ఎలక్ట్రానిక్స్], జపాన్, పెద్దకోడలు (ప్రియాంక, పిహెచ్‌డి[ఫిజిక్స్]లక్నో) ఇద్దరూ పిహెచ్‌డి (PhD) పూర్తిచేశారు.ఇంకా కొంతమంది రవికుమార్ రాగం (ఎంఫిల్, అనువాదశాస్త్రం, హెచ్‌సియు), కలిదిండి రాజేష్ (ఎంఎస్‌సి, కెమిస్ట్రీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం, పోసిన శ్రీనివాస్ (ఎంఎస్‌సి, కెమిస్ట్రీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం, పోసిన వెంకటేశ్వరరావు (ఎంఎస్‌సి, గణితశాస్త్రం, ఆంధ్రా విశ్వవిద్యాలయం) పూర్తిచేసి వివిధ నగరాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.వీరేకాక ఇంకా కొంతమంది యువకులు ఎంసిఎ, బిటెక్, పాలిటెక్నిక్ వివిధ సాంకేతిక, వృత్తి కోర్సులను అభ్యసిస్తూ గ్రామంలోనివారికి ఉన్నతవిద్య పట్ల ఆసక్తి పెరిగేలా ప్రోత్సాహిస్తున్నారు.
2014లో విడుదలయిన ఎసై పరీక్షలలో గ్రామానికి చెందిన కలిదిండి రాజేష్, బత్తిన నాగబాబు ఉత్తీర్ణులై, ఎంపికయ్యారు. ఇది గుర్వాయిపాలెం గ్రామానికి చాలా ప్రతిష్టాత్మకమైనది అని పెద్దలు, విద్యావంతులు భావిస్తున్నారు.
గ్రామ సర్పంచ్
మార్చు2013 జూలై 31లో జరిగిన గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికలలో నిక్కు పూర్ణచంద్రరాజు 494 ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించారు. గత కొన్ని సంవత్సరాలుగా గౌడ వర్గానికి చెందినవారే గ్రామాన్ని పరిపాలించడం జరుగుతోంది, అది రానురానూ వారసత్వ రాజకీయాలకు దారితీస్తున్న తరుణంలో, పంచాయితీశాఖలో విస్తృత అనుభవం కలిగిన నిక్కు పూర్ణచంద్రరాజు పోటీచేసి స్థానిక ప్రత్యర్థి పోసిన త్రినాథ్ బాబుపై విజయం సాధించారు.