గౌడ కులములో ముఖ్యముగా రెండు రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా

    1. పాలించిన వారు (కౌండిన్యులు) మరియు
    2. కల్లు గీత వారు.

కౌండిన్యులు (గౌడులు) క్రీ.శ.12వ శతాబ్దము నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారత దేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. వారిలో చెప్పుకోదగిన వాడు కన్నడ దేశాన్ని పాలించిన కెంపె గౌడ. ఈయన 1513-1569 మధ్య కాలంలో జీవించాడు. భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగుళూరు (1537లో) ఈయన స్థాపించినదే. కెంపె గౌడ వంశీకులు 18వ శతాబ్దము వరకు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ప్రాంతాలను పాలించారు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=గౌడ&oldid=2614137" నుండి వెలికితీశారు