గేమ్‌ ఛేంజర్‌ 2023లో తెలుగులో విడుదలైన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్.ఎస్. థమన్‌ సంగీతం అందించాడు. రామ్ చరణ్, కియారా అద్వాణి, ఎస్.జె.సూర్య, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 2023 మార్చి 27న ఖరారు చేశారు.[2]

గేమ్ ఛేంజర్
దర్శకత్వంఎస్. శంకర్
రచనఎస్‌.యు.వెంకటేశన్‌
ఫర్షద్‌ సామ్‌జీ
వివేక్
మాటలుసాయిమాధవ్ బుర్రా
స్క్రీన్ ప్లేఎస్. శంకర్
కథకార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతదిల్ రాజు
శిరీష్
తారాగణంరామ్ చరణ్
కియారా అద్వాణి
ఛాయాగ్రహణంతీరు
కూర్పుషమీర్ మొహమ్మెద్
సంగీతంఎస్.ఎస్. థమన్‌
నిర్మాణ
సంస్థ
శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌
విడుదల తేదీs
10 జనవరి 2025 (2025-01-10)(థియేటర్)
7 ఫిబ్రవరి 2025 (2025-02-07)( అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషలుతెలుగు[1]
తమిళ్
బడ్జెట్170 కోట్లు

గేమ్ చేంజర్ టీజర్‌ను నవంబరు 9న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో  విడుదల చేశారు.[3] ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో 2025 జ‌న‌వ‌రి 10న విడుదల చేశారు.

గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

రామ్ నందన్ (రామ్ చరణ్) కాలేజీలో తను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అడ్వాణీ) తను ప్రేమించిన దీపిక (కియారా అడ్వాణీ) కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఆమె సూచన మేరకు ఐఏఎస్ అధికారిగా అవుతాడు. రామ్ నందన్ ఆ తరువాత విశాఖపట్నం కలెక్టర్‌గా నియమితుడై భాద్యతలు తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి మోపిదేవి సత్యమూర్తి (శ్రీకాంత్‌) కుమారుడు మంత్రి బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య)తో గ్యాంగ్‌తో విభేదాలు ఏర్పడుతాయి. ఈ క్రమంలో మంత్రి బొబ్బిలి మోపిదేవితో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు ? తనకు అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారిని తన అధికారంతో మంత్రి మోపిదేవి ఏం చేశాడు.? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

సంగీతం

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి[8]"అనంత శ్రీరామ్దలేర్ మెహంది, సునిధీ చౌహాన్4:20
2."రా మచ్చా"అనంత శ్రీరామ్నకాష్ అజీజ్, రేవంత్4:43
3."నా నా హైరానా[9]"రామజోగయ్య శాస్త్రికార్తీక్ , శ్రేయా ఘోషల్4:41

మూలాలు

మార్చు
  1. "Vijay bowled over by Vamshi Paidipally's story, Shahid Kapoor's Jersey one of the best Hindi films: Dil Raju gives updates". The Indian Express. 24 January 2022. Archived from the original on 10 May 2022. Retrieved 25 January 2022. We are shooting Shankar's film originally in Telugu and planning to dub it in Tamil and Hindi
  2. "గేమ్‌ఛేంజర్‌గా రామ్‌చరణ్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న టైటిల్‌ వీడియో". 27 March 2023. Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.
  3. Sakshi (9 November 2024). "వాడు మంచోడే కానీ కోపమొస్తే 'గేమ్ ఛేంజర్' టీజర్‌". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  4. "ఇట్స్‌ అఫీషియల్.. ఓటీటీలోకి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?". TV9 Telugu. 4 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  5. "రివ్యూ: గేమ్‌ ఛేంజర్‌.. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబో ఎలా ఉంది?". 10 January 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  6. Chitrajyothy (31 July 2024). "'గేమ్ చేంజ‌ర్‌'.. జాబిల‌మ్మ లుక్ వ‌చ్చేసింది". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  7. "#RC15: రామ్ చరణ్ సినిమాలో విలన్ గా కనిపించనున్న మలయాళం స్టార్ నటుడు". 29 August 2021. Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
  8. Chitrajyothy (27 March 2024). "జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జ‌ర‌గండి జ‌ర‌గండి పాటొచ్చింది". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  9. Eenadu (29 November 2024). "ప్రియమైన హైరానా... మొదలాయే నీ వలనా". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.

బయటి లింకులు

మార్చు