గోరంట్ల మాధవ్

(గోరంట్ల మాధవ్‌ నుండి దారిమార్పు చెందింది)

కురుబ గోరంట్ల మాధవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున హిందూపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.[2]

కురుబ గోరంట్ల మాధవ్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
24 మే 2019
ముందు నిమ్మల కిష్టప్ప
నియోజకవర్గం హిందూపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-06-01) 1969 జూన్ 1 (వయసు 55)
రుద్రవరం, కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి సవిత
సంతానం 3
నివాసం హిందూపూర్ అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

గోరంట్ల మాధవ్‌ రాజకీయాల్లోకి రాకముందు కదిరి సర్కిల్ ఇన్స్పెక్టర్‌ గా, అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పని చేశాడు. అనంతపురం జిల్లాలోని త్రైత‌సిద్ధాంతం ఆశ్ర‌మం విష‌యంలో లోక్‌స‌భ మాజీ స‌భ్యుడు, జే సీ దివాకర్ రెడ్డి పోలీసుల‌ను ఉద్దేశించి అస‌భ్య ప‌ద‌జాలంతో వారిని దూషించి, తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఘ‌ట‌న గోరంట్ల మాధ‌వ్‌ను తీవ్ర ఆగ్రహం చెంది విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, మీసం మెలేసి విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌ను దుర్భాష‌లాడితే నాలుక చీరేస్తానంటూ గోరంట్ల మాధవ్‌ హెచ్చరించడంతో ఆయన వార్తల్లోకి ఎక్కాడు. ఆయన 2018లో పోలీస్ ఉద్యోగానికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4]

గోరంట్ల మాధవ్‌ 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున హిందూపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప పై 140,748 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[5]

మూలాలు

మార్చు
  1. Lok Sabha. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 4 July 2021.
  2. The Times of India (24 May 2019). "Hindupur Election Result 2019: Kuruva Gorantla Madhav won | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2020. Retrieved 4 July 2021.
  3. The Hindu (30 December 2018). "Kadiri Urban CI quits, to join politics" (in Indian English). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  4. Sakshi (26 January 2019). "వైఎస్సార్‌సీపీలో చేరిన సీఐ గోరంట్ల మాధవ్‌". Sakshi. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  5. Sakshi (2019). "Hindupur Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.