ఘంటసాల సీతారామ శర్మ

డాక్టరు ఘంటసాల సీతారామ శర్మస్వాతంత్ర్యసమరయోధుడు.సమాజంలో పలుకు బడికలిగి, సంక్షేమంగా సాగుతున్నట్టి తన వైద్య వృత్తిని త్యాగం చేసి, భార్యపిల్లలకు వేరే ఆధారములేకపోయినా సంకోచించక 1920 లో మహాత్మా గాంధీగారి చ్చిన స్వతంత్ర సమరయోధన పిలుపుతో సత్యా గ్రహోద్యమములలో పాల్గొని జైలు కెళ్లి దెబ్బలు తిని ఆర్థికంగా శారీరకంగా తీరని లోటుకు గురైన వారిలో డాక్టరు ఘంటసాల సీతారామ శర్మ గారు ఒకరు. డాక్టరు శర్మగారి కృషి వారి జీవత విశేషాలు బెజవాడలో వారిసమకాలీకులు సన్నిహిత మిత్రు లు, చరిత్ర కారులైన దిగవల్లి వేంకటశివరావుగారు (1898-1992) స్వతంత్రోద్యమరోజులలోని విశేషాలు తన డైరీ లోను, నోట్సుల గాను వ్రాసి పెట్టియుంచారు.

కుటుంబంసవరించు

డాక్టరు ఘంటసాల సీతారామ శర్మగారి జన్మస్థలం కృష్ణాజిల్లాలోని ఘంటసాల.తండ్రి ఘంటసాల పేర్రాజు.ఈయన జన్మదినం కచ్చితంగా తెలియకునను, పుట్టుక 1893-94 మధ్యకాలం అనితెలియుచున్నది.వీరిని బందరు నివాసి అయిన చినబ్రహ్మయ్య పంతులు చిన్నతనముననే దత్తుకు తీసికున్నారు.అర్ధికంగా ఉన్నకుటుంబమైనప్పటికి, కొన్ని కోర్టులావాదేవిలు ఉన్నట్లు తెలుస్తున్నది.ఈయన వివాహం, తనమేనమామ, ఆరుగొలను నివాసి అయిన గోపాలకృష్ణయ్య కుమార్తె దుర్గాంబతో వివాహం జరిగింది.కుటుంబ ఆర్థికవ్యవహారాల్ను సీతారామ శర్మగారిమామగారే నిర్వహించేవారు.

విద్యాభ్యాసంసవరించు

శర్మగారు బందరు హిందూ స్కూలులో 3వ ఫారంనుండి 5 ఫారం చది వారు. అప్పుడు ఆంధ్రపత్రిక సంస్థా పకులు కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారి మేనల్లడైన డాక్టరు శివలెంక మల్లికార్జున రావు (శివలెంక శంభు ప్రసాద్ గారి అన్నగారు) మరియూ రాజమండ్రీ వాస్తవ్యులైన బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, వారికి వైద్యకళాశాలలో సహవిద్యార్థి. శర్మగారికి విద్యాపకులుగా బందరు హిందూస్కూలు లోచెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు తెలుగు పండిదులునుడేవారు. 1907 లోబీపిన్ చంద్రపాల్ బందరు వచ్చి వందేమాతరం ప్రచారోపన్యాసం చేశారు. శర్మ గారు మల్లికార్జున రావుగారు ఆ ప్రసంగం వల్ల ప్రేరణగోన్నారు. ఈమని లక్ష్మణశాస్త్రి గారు శివాజీ వేషంవేసుకు చేసిన హిందీ ప్రసంగాలు వీరిని ముగ్ధులను చేశాయి. శర్మగారు S S L C క్లాసు గుంటూరులోని క్రిస్టియన్ కాలేజీ స్కూలలో చదివారు. ఆ రోజులలో నవంబరు 14 వ తారీఖు 1911 లో గుంటూరు కాలేజీ విద్యార్థులు శతావధానం ఏర్పాటు చేసి నప్పుడు 17 ఏండ్లప్రాయుడైన వేలూరి శివరామ శాస్త్రి గారు మొదటిసారిగా చరిత్రాత్మకమైన శతావధానం చేశారు. దీనిని గూర్చి శర్మాగారు చెప్పుతూవుండేవారు. శివరామ శాస్త్రి గారు శర్మగారితో యావజ్జీవము మిత్రులుగానున్నారు. శివరామ శాస్త్రిగారి అన్న గారు వేలూరి యజ్ఞన్నారాయణ శాస్త్రి గారు కూడా వారికి మిత్రులైనారు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు ఎప్పుడు బెజవాడవచ్చినా శర్మా గారింట్లోనే బస చేశేవారు. 1912 నుండి 1916 వరకు శర్మగారు కలకత్తాలో డా. మల్లిక్ స్థాపించిన నేషనల్ మెడికల్ కాలేజీలో చదివి 1916 లో L.C.P.S అను వైద్య పట్టా పుచ్చుకున్నారు. వైద్య కళాశాలలో వారితో పాటు చదివిన వారిలో రాజమండ్రీ వాస్తవ్యులు గొప్ప స్వతంత్రసమరయోదుడైన త్యాగి డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారొకరు. శర్మగారు 1917 లో కలకత్తా లోని శంభునాధ్ మెమోర్యిల్ హస్పిటల్ లో ఆనరరీ సర్జన్ గా చేశారు. ఆకాలంలో రాజమండ్రివాస్తువ్యుడైన కాంగ్రెస్సు జనరల్ సెక్రటరీ చేసిన న్యాపతి సుబ్బారావు గారి బంధువు బారు రాజారావు గారు ( ఎ ఐ సి సికి పర్మనెంటు అండర్ సెక్రటరీగా చేశిన వారు స్వతంత్రఉద్యమంలో వీరు ధూలియ జైలులో నిర్బంధిప బడ్డారు) రాజారావు గారు కలకత్తాలో బి.ఎ చదువుతూ రామకృష్ణ పరమహంస భక్తుడైయుండి రామకృష్ణ మఠం కార్యకాలాపాల్లో పాల్గోనేవాడు. ఆయన శర్మగారి స్నేహితుడై నాడు ఆయనతో పాటు శర్మాగారు గూడా రామకృష్ణ మఠం ఆదర్శాలతో ప్రేరణ పొందినవాడై సంఘసేవ చేయాలనే ఆశయాలు కలిగినవాడైనారు. అంతేకాక ఆరోజులలో బెంగాలీ ప్రముఖల స్వతంత్రసమరయోధన ప్రసంగాలవల్ల గూడా శర్మగారు స్వతంత్ర పోరాటంలో ఆసక్తి కలిగినవాడైనారు. నీలరతన్ సర్కార్, శ్యామసుందర్ చక్రవర్తి మొదలగు గొప్ప వక్తల ప్రసంగాలు శర్మగారి భావనలపై చరగని ముద్రవేశాయి. 1917 లో వై ద్య చదువు పూర్తి చేసుకుని శర్మగారు 1918 లో బెజవాడ వచ్చి వైద్య వృత్తి ప్రారంభించారు. వైద్యులుగా శర్మగారు బెజవాడలో రెండవ వారు. వారికిన్నా ముందు బెజవాడలో గూడూరు వెంకట రమణా రావు అనే ఒకే ఒక డాక్టరు గారుండేవారు. వారికి మెయిన్ రోడ్డులో మెడికల్ షాపు వుండేది.

బెజవాడ మునిసిపల్ రాజకీయాలుసవరించు

1922 కు ముందు బెజవాడలో మునిసిపల్ కౌన్సిల్ జస్టిస్ పార్టీ వారు అధీనంలో ఉండేది. వారు సకాలంలో ఎన్నికలు పెట్ట కుండా వారి పార్టీ వారే అధ్యక్షలుగా వారిలో వారు నడపుతూ వచ్చారు. మోచర్ల రామచంద్రరావు గారు దినవహి హనుమంతరావుగారు అధ్యక్షులుగా పరంపరంగా చేస్తూ వచ్చారు. అందుకు నిరసనగా ప్రముఖ న్యాయవాది పలుకుబడిగల కాంగ్రెస్సు నేత అయిన అయ్యదేవర కాళేశ్వరరావుగారు మరియూ అద్దేపల్లి గురునాధ రామశేషయ్య గారు తీవ్ర ఆందోళన చేసి మునిసిపల్ టాక్సులు కట్టవద్దని పురముఖలను ప్రజలను రెచ్చ కొట్టడంతో వారిద్దరిమీద కేసులు పెట్టి జైలుకు పంపిచిన పిదప 1922 వ సంవత్సరంలో జస్టిస్ పార్టీ వారు స్తిమిత పడి ఎన్నికలు జరిపించారు. ఈ ఎన్నికలు లలో డా శర్మగారు మునిసిపల్ రాజకీయాల రంగంలోకి దిగారు. అప్పటికే వారికి కాంగ్రెస్సు నాయకుడుగా, డాక్డరుగా, చాల పేరు గలవారు. దీని ఫలితంగా ఇంతవరకూవరుసగా 12 నుండి సంవత్సరాలనుంచీ మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షుడుగా పోటీలేకుండా వస్తున్నజిస్టిస్ పార్టీకి చెందిన దినవహి హనుమంతరావుగారు ఈసారి ఎలక్షన్లో డాక్టరు శర్మగారి రంగ ప్రవేశంతో ఓడిపోయారు విజేత కాంగ్రెస్ పార్టీ వారు డాక్టరు ధన్వాడ రామచంద్రరావు M.A., M.D గారిని అధ్యక్షులుగా ఎన్నిక చేసుకున్నారు. 1931 అక్టోబరు 18 శర్మగారు వెలురు జైలునుండి విటుదలై వచ్చిన తరువాత మునిసిపల్ కౌన్సిల్ ఎలక్షనుకు ఎన్నికలు కమిషన్ వారు అభ్యతరం చేశారు శర్మగారుకు తగినంత రెసిడెంషయల్ కాలం అర్హత తక్కునగానున్నదని వారు ఎలక్షన్లో పోటి చేయకూడదని. ఆకేసులో శివరావుగారి వీరి తరఫున వాదించారు. శర్మగారు జేలులో నున్న కాలం లెఖ్ఖలోకి తీసుకోపోటం అన్యాయమని. వీరి వాదన అంగీకరించబడి శర్మగారు ఎలక్షన్లో పోటిచేసి వరుసగా మూడుసార్లు కౌన్సిల్ సభులుగా ఎన్నికైనారు. 1947 లో బెజవాడ మునిసిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్సు పార్టీ అధిష్టానం నిలబెట్టబోయే అభ్యర్థి (మరిపిళ్ల చిట్టి) బెజవాడ పరిస్థితులు తెలిసినవారు గాదని, మునిసిపల్ సంక్షెమ పనులు వారు జరిపింప లేరని నమ్మి న డా శర్మ గారు ఆ ఆభ్యర్ధికి పోటీగా తనే పోటీ చేయుటకు నిశ్చయించి తన మిత్రుడు న్యాయవాది దిగవల్లి శివరావు గారి సహాయంతో తన మానిఫెస్టోని తయారు చేసి 11/09/1947 న విడుదల చేశారు ( జతచేసియున్నది) అప్పడు కాంగ్రెస్సుఅధిష్టానంవారికి భూకంపంలాంటిది కలిగి ఆతి కష్టంమీద డా శర్మగారితో సంధిచేసుకున్నారు.

కాంగ్రెస్సు నాయకత్వం, స్వతంత్రోద్యమ కృషిసవరించు

1920 సెప్టెంబరు నేలలో కలకత్తాకాంగ్రెస్సు సభకు వెళుతూ మహాత్మాగాంధీ గారు బెజవాడలో దిగి మునిసిపల్ రహదారి బంగళాలో సభచేశారు. సి రాజగోపాలాచారిగారు కూడా నున్నారు. ఆసభతో ప్రభావితులైన ప్రముఖులు తమ తమ వృత్తులు విసర్జించి గాంధీగారి మార్గం చేపట్టారు అయ్యదేవర కాళేశ్వరరావుగారు శాసనసభ అభ్యర్థిత్వాన్ని వదిలివేశారు, గులాం మొహిద్దీన్ గారు తము చేసే ఫస్టుక్లాసు మేజిస్ట్రేటు పదవికి రాజీ నామాచేశారు. శర్మగారు కూడా అప్పటినుచే స్వతంత్రోద్యమాలలో ప్రవేశించారు. 11/11/1924 తారీఖునాడు నోరీ వెంకటేశ్వర్లుగారు సంకలనం చేసిన కొరడా పత్రికను అప్పట్లో సింగరాజు సుబ్బారావుగారి బంగళాలో అద్దెకుంటున్న డా శర్మ గారింట్లో ఉద్ఘాటన జరిగింది. మార్చి 12 వతారీఖు 1930 లో ఆంధ్రప్రొవిన్సియల్ కాంగ్రెస్సు కమిటీ మీటింగు గుంటూరులో జరిగింది. డా శర్మ గారు వెళ్ళి హాజరైనారు. 11/04/1930 తారీఖునాడు ఉప్పుసత్యాగ్రాహికుల మొదటి విడతగా గంపలగూడెం కుమార రాజాగారి అధ్యక్షతన బెజవాడనుండి బందరు దగ్గరు చిన్నపురానికి బయలుదేరారు. వారితోపాటు డా ఘంటసాల సీతారామశర్మగారు కూడానున్నారు. 4/04/1930 తారీఖునాడు డా. వెలిదండ్ల హనుమంతరావుగారి అధ్యక్షతన రెండవవిడత బెజవాడనుండి పాదగమనంతో రైల్వేస్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి రైలులో మచలీపట్ణానికి వెళ్లారు. అందులో కూడా డా శర్మగారున్నారు. ఆ రాత్రి బందరులో డా. పట్టాభిశీతారామయ్యగారింట బస చేసి మర్నాడు ప్రొద్దున్న ముగ్గురు డాక్టర్లూ ( హనుమంతరావుగారు, సీతారామయ్యగారు, శర్మగారు) కలసి 15-04-1930 తారీఖున బందరు దగ్గర చిన్నపురం చేరుకున్నారు. మొదటగా బయలుదేరిన కుమార రాజాగారు చిన్నపురంలో చేసి న ఉప్పు జమచేసుకుని బందరు పట్టుకుచ్చి బందరు బజారులలో అమ్మకం చేశారు. సత్యాగ్రహ సమర ఉగ్రతంగా జరిగే రోజల్లో శివరావు గారు వ్రాసిన అనేక కర పత్రములు పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్సుకమిటీ వారి ప్రచురణల క్రింద కాంగెస్సు కార్యకర్తలకు బోధనానుకూలముగా ముద్రించబడేవి. వారు వ్రాసిన “భారతీయుల దారిద్య్రము” అను వ్యాసము సహకారము అనే పత్రికలో ను, 10/03/1930 తారీఖున వారి పుస్తకము “సత్యాగ్రహ చరిత్ర” ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్ లో ముద్రించబడింది. ఈపుస్తక ఆవిష్కరణం పడమర కృష్ణాజిల్లా వారి రణభేరీతో “శుక్ల సంవత్సరము ఫాల్గుణ శు బుధవారము నాడు సత్యాగ్రహ సమర సుభముహూర్తమున దిగవల్లి వేంకట శివరావు రచించిన సత్యాగ్రహ చరిత్ర డా//ఘంటసాల సీతారామ శర్మ, చెరుకుపల్లి వెంకటప్పయ్య, మంచాల సుబ్బారావుగార్ల చే ప్రకటింపబడినది” అని ఉద్ఘోటించబడింది. మెదటి బ్యాచ్ లో ఉప్పుచేసిన వా రికి అప్పటికే జైలులో నిర్భందిచ బడిన వారైన కుమారాజా గారిని శర్మగారిని జైలునించి తీసుకుచ్చి కోర్టులో హాజరు పరచారు. సత్యాగ్రహం ఉద్యమంలో పోలీసు వారిచే అరెస్టు కాబడిన చాల మంది ప్రముఖ కాంగ్రెస్సు నాయకులను కోర్టులో హాజరు పరచిన ప్పుడు దిగవల్లి శివరావరు గారు కోర్టు వారి అనుమతితో అమికస్ క్యూరి [ అంటే ప్రత్యర్థి తరఫు వకీలు, defendant lawyer ]గా వుండేవారు ఆ విషయం 1930 సెప్టెంబరు 12 వ తారీఖునాడు శివరావుగారి మీద రాజద్రోహం కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి గారిచ్చివ వాగ్మూలాన్ని బట్టి తెలుస్తున్నది. డా ఘంటసాల సీతారామశర్మగారు 1930 మే మధ్యలో పలు గ్రామాలకు పర్యటనచేసి కాంగ్రెస్సు తరఫున సాంఘిక రాజకీయ ఆర్థిక దుస్థితికి దారితీస్తున్న బ్రిటిష పరిపాలను ఎత్తి చూపించుటకు శివరావుగారు చేసిన ప్రశ్నావళి పూర్తిచేయించి తీసుకుచ్చి యిచ్చారు. అంతలో ఉప్పు సత్యాగ్రహకార్యకలాపాలకి డా శర్మ గారికి కూడా 18 నెలల ఖటిన ఖారా గార శిక్ష విధించబడి వారును రాజమండ్రీ జైలులో నిర్భందిచ బడ్డారు. 15/06/1930 తారీఖునాడు డా శర్మ, వేలూరి యజ్ఞన్నారాయణ, డా వెలిదండ్ల హనుమంతరావు, బ్రహ్మాండం నరసిహాం, గోనుగుంట్ల సుబ్రహమణ్యగుప్త, నూకల వీర రాఘవయ్య, వీర మల్లయ్య మొదలగు వారలు మొత్తం 40 మందిని రాజమండ్రీ సెంట్రల్ జైలునుండి వెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించు ముందు రోజు రాత్రి మర్నాడు పొద్దున్నే జైలు గేటు దగ్గర ఆ జైలుఅధికారైన బ్రిటిష పోలీసు సార్జంటు అకారణంగా దౌర్జన్యంగాలాఠీతో కొట్టాడు. కాలితో తన్నాడు. వారి మంచనీళ్ల లోటాలు, కళ్లజోడ్లనూ కారణం లేకుండా విరక్కొటి పారేశాడు, వారందరును (మొత్తం 40 మందిని) 16/06/1930 సి ఆర్ పికి అప్పచెప్పి పొద్దున్నే వారిని రాజమండ్రీ జైలునుండి పాసింజరు రైలులో ప్రయాణాంచేయించి వెల్లూరు జైలుకు తరలించారు. దారిలో బెజవాడ రైలు స్టేషన్ లో పౌరులూ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు దిగవల్లి శివరావుగారు కూడా రైలు స్టేషన్ కు వారలను చూడ్డానికి వెళ్లారు. పోలీసు వారి బందోబస్తీ నిఘాలో రైలు బండిలో ఖైదీలు గానున్న చాల మంది శివరావుగారితో పోలీసు వారు చూడకుండా చిన్న చిన్న సందేశాలిచ్చారు. అందులో డా శర్మగారు పెన్సిలోతో వ్రాసిన చిన్న లేఖలో శివరావుగారికి పోలీసువారు రాజమండ్రీ జైలు గేటుదగ్గర ఆ క్రితం రోజు రాత్రి ఎలా కొట్టిందీ వ్రాసి దానిని ప్రచురించవద్దని కోరారు. బాగా దెబ్బలు తిన్న వారిలో బ్రహ్మాండం నరసింహాం వెలిదండ్ల హనుమంతరావు గారు. ఆ జైలు సంఘటన కృష్ణా పత్రికలో డిసెంబరు 12 వ తారీఖ 1930 నాడు బొబ్బిలి పాట వరుసలో గురజాడ రాఘవ శర్మ రచించిన పాట ప్రచురించారు ( దాని ప్రతి చివరిలో జత పరిచాము) ఆ పాటలో కూడా బాగా దెబ్బతిన్నవారిలో ప్రముఖంగా వెలిదండ్ల హనుమంతరావు గారని చెప్పబడింది. గాంధీ ఇర్విన్ రాజీ వప్పందం ప్రకారం 12/03/1931 తారీఖున డా శర్మ, నల్లూరి పాపయ్య. చౌదరీ, వేలురి యజ్ఞన్నారాయణ మొదలగు వారిని వెల్లూరు జైలు నుండి విడుద లచేశారు. వారు దారిలో మద్రాసులో కొన్నిరోజులుండి వారు 4/03/1931 తారీఖున బెజవాడ చేరుకున్నప్పు డు శివరావు ప్రభృతులు రైలు స్టేషన్ కు వెళ్లి స్వాగతం చెప్పారు కృష్ణా పడమర జిల్లా కాంగ్రెస్ కమిటీ మీటింగు మార్చి1931న 10/03/1931న ముదునూరులో జరిగిన సత్యాగ్రహ సన్మాన సభకు డా శర్మ, మతం బాలసుబ్రమణ్యం వెళ్ళారు. 1936 లో డా శర్మ దిగవల్లి శివరావు వెంకటప్పయ్యా కలసి ఆచార్య రంగాగారి ఆహ్వానం మీద నిడుబ్రోలు వెళ్లారు. ఆరోజులలో రంగా అనబడే గోగినేని రంగనాయకులు గారు కాంగ్రెస్సు అగ్రనాయకులలో ఒకరు వీరు రైతాంగానికి మూల స్దంభం లాంటి వారు.

సంఘసేవ, కార్మికపుర సంస్తాపన. లేబర్ లీడర్ గా హరిజన సేవా సంఘం సెక్రటరీ గా చేసిన కృషిసవరించు

శర్మగారు రామకృష్ణా మఠం వారి ఆశయాలు అమలు చేశేవారు. ఉరిలో ఎక్కడైనా అగ్ని విప్పత్తులు గలిగితే దగ్గరలో నున్న నీళ్లను బక్కేట్లలో స్వయంగా తీసుకెళ్లి మంటలార్ప ప్రయత్నం చేసేవారు. మంటలు రగలుకుంటుంటే ఊరికే చూస్తూ వుండే వారికి ఒక ఆదర్శంగా తను నీళ్ళు పట్టికెళ్ళి చేసి చూపించేవారు. చేయమని ప్రోత్సహించేవరు. ఫైర్ స్టేషన్లు, ఫైర్ఇంజన్లంటే తెలియని గడ్డు రోజలవి. ఎండా కాలంలో బెజవాడలో 42 డిగ్రీలు సి ఉష్ణోగ్రతతో ఎండ తీవ్రత నిప్పులు కురిపిస్తుండేది, అగ్నివిప్పత్తులు తరుచూ జరుగుతూనుండేవి. బెజవాడనిఅగ్నివాడ అనచ్చు. కేవలం మానవ శక్తిసామర్ధ్యంతో నీరు పోయటం వల్లనే అగ్ని మాపకం చేయల్సివచ్చేది. లేక పోతే పూర్ణాహుతి అపార ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తూనుండేవి. పాకలు గుడిసేలలో నుండిన పాటక జనం అపార తరచు అట్టి బాధకు గురైయ్యేవారు. అగ్ని భాదితులకు శర్మగారు స్వయంగా అన్నదానం చేశేవారు. వారు కొంతకాలం వుండటానికి వసతి గృహం చూపించేవారు. బెజవాడలో సిగంసెట్టి నారాయణసెట్టి గారు నడిపే అన్నదాన సమాజాని శర్మగారు చాల ప్రోత్సహించి సహాయం చేశేవారు వైద్యుడుగా వారు బీదవారింటికి వైద్యం చేయటానికి వెళ్లినప్పు డు వారు చూసిన దీన స్థితులు చెప్పుతూ సానుభుతితో నుండే వారు బీదలు పడే కష్టాలు ఇబ్బందులును అర్ధంచేసుకుని చేయగలిగినంత సహాయం చేశేవారు. 1922 మునిసిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్సు పార్టీ అభ్యర్థి డా ధన్వాడ రామచంద్ర రావు గారుఅధ్యక్షుడుగా వచ్చిన తరువాత శర్మగారు మునిసిపల్ కౌన్సిల్లో అధిక పలుకబడి యుండేది. ఆసమయంలో శర్మగారు ప్రేరణపై మునిసిపాలిటీవారిచే ప్రజాయుక్తమగు గొప్ప పనులు చేయించ గలిగారు వారి కృషివల్లనే బెజవాడలో కార్మికపురం స్కీమునోకదానిని తయారు చేయించి ఒక చదరపు మైలు విస్తీర్ణంలో బెజవాడలో ఏలూరు రోడ్డు నుండి రవీస్ కాల్వ గట్టుదాకా లేబర్ కాలనీ డెవలప్ చేశారు ఆ కార్మిక పురంలో కార్మికులైన కమ్మర, కుమ్మర, వడ్రంగి, తాపీ గుర్రబ్బండి, మొదలగు కార్మికులు, పని వారలకు 99 ఏండ్ల లీజ్ పద్ధతి మీద స్తళములివ్వబడినవి రోడ్లు మంచినీటి సదుపాయములు కలుగచేశారు. డాక్టరు శర్మగారు ఆవిధంగా కార్మికసంఘ సంస్కర్తగా కార్మికజన ప్రియుడుగా ప్రసిధ్ధి చెంది మునిసి పల్ కౌన్సిల్ ఎలక్షన్ల ల్లో నిలబడి తీవ్ర పోటీకి తట్టుకుని కౌన్సిలర్ గా వరుసగా మూడు తడవలు ఎన్నికై నారు. శర్మగారు లేబర్ లీడర్ గా ప్రసిధ్ధి చెందారు. బెజవాడలో హరిజన సేవాసంఘం నకు కార్యదర్శిగా చేశారు. హరిజన సేవాసంఘంవారి తరఫున శర్మ గారు హరిజన హాస్టలు చాల చాకచక్యంతో నడిపేవారు. ఆరోజులలో బెజవాడలో హరిజన నాయకుడైన కూర్మయ్య గారు శర్మ గారిని గురువులుగా పుజించేవారు. శర్మగారంటే బెజవాడలో నే కాక యావద్కృష్ణాజల్లా మొత్తంలో హరిజన గిరజన సముదాయలన్నీ చాల గౌర్వాభిమానంతో చూసేవారు. ఆరోజలులో శర్మగారికి ఈ పనుల్లో బంగారు, దుర్గయ్య అను ఇద్దరు లేబర్ లీడర్లు నమ్మిన బంట్లూగానుండేవారు.

మిత్ర త్రయం, ఇష్టా గోష్టి. సమావేశాలుసవరించు

1933 జూలైలో కృష్ణా పుష్కరం కమిటీలో డా శర్మగారు సభ్యలుగానున్నారు . 1937 లో వారి మిత్రులతో కలసి డా చాగంటి కారులో పామర్రు, గుణదల, కనుమర్తి గ్రామాలకు కాంగ్రెస్సు కార్యకర్తలను కలవటానికి వెళ్లారు. 1938 లో డా శర్మగారు చెళ్ల పిళ్ళ శాస్త్రిగారికి గొప్ప సన్మానం జరిపించారు. బెజవాడలో డా శర్మగారిల్లు సాయంత్రానికల్లా ఒకసాహిత్య సమావేశంగా మారేది. డా శర్మగారు, దిగవల్లి వెంకట శివరావు, చెరుకుపల్లి వెంకటప్పయ్య వీరు ముగ్గురు అనివార్యంగా రోజు సాయంత్రం కలసి ఇష్టగోష్ఠి కై సమావేశమయ్యేవారు . వేలూరి శివరామ శాస్త్రి గారు వీరి ముగ్గురను త్రిమూర్తలనే వారు. 1925 దాకా శర్మగారు గవర్నరు పేటలో నున్న సింగరాజు సుబ్బారావు గారి పెద్ద తోటఇంట్లో అద్దెకుండే వారు ఆతరువాత శర్మగారు ఆగస్టు 1925 లో సొంత ఇంటిలోకి మారారు అప్పట్ణుచీ ఆ సమావేశ సభ అక్కడ జరిగేది. వీరి సభలో పురప్రముఖులు రాజకీయ వేత్తలు, కళాకారులుకూడా తరుచు వచ్చేవారు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రిగారు బెజవాడలోవున్నప్పుడుల్లా వీరి సభ ఇంకా పెద్దదిగా ఇతర సాహిత్యవేత్తలు కవులుతో నిండిపోయేది. శాస్త్రిగారున్నప్పుడొకసారి కవి శేఖరుడైన త్రిపురనేని రామస్వామి చౌదరిగారుకూడా వీరి సభకు వచ్చి వారు రచించిన కవిత్వం చదివి వినిపించారు. 1938 లో బెజవాడలో ప్రముఖ న్యాయవాదైన పాటిబండ అప్పారావు గారు వీరి ముగ్గు రు మితృలు మీత ఒక పద్యము రచించారు.చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు డా శర్మ గారికి న్రాసిన ఉత్తరం జత పరచటమైనది.

మరణంసవరించు

దురదృష్టవ్వశాత్తూ స్వతంత్రముచ్చిన 3 ఏండ్లలోనే వారు14/04/1950 తేదిన (stroke తో) అస్వస్తుతులై శారీరకంగా నిర్భందులైయ్యారు. తరువాత కొద్దికాలాని కే 1953 జూలై 17 వతారీఖున మరణం సంభవించింది.

మూలాలుసవరించు