ఘరానా మొగుడు
ఘరానా మొగుడు, 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా[1] ముఖ్యపాత్రలు పోషించారు. 10 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా ఈ సినిమాకు గుర్తింపు ఉంది. ఇందులో డిస్కోశాంతి, చిరంజీవిలపై చిత్రించిన "బంగారు కోడిపెట్ట" పాట బాగా హిట్టయిన చిరంజీవి డాన్స్ పాటలలో ఒకటి. కన్నడంలో విజయవంతమైన "అనురాగ అరళితు" అనే సినిమాకు ఈ సినిమా తెలుగు పునర్నిర్మాణం.
ఘరానా మొగుడు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | కె. దేవీవరప్రసాదు |
కథ | పి. వాసు |
తారాగణం | చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాధ్, రావుగోపాలరావు , కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రమాప్రభ, శుభ, ఆహుతీ ప్రసాద్, సాక్షి రంగారావు, చలపతిరావు, పి.ఎల్. నారాయణ, ఈశ్వరరావు, డిస్కో శాంతి (బంగారు కోడిపెట్ట) |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నేపథ్య గానం | ఎస్.పి., నాగూర్ బాబు, చిత్ర |
నృత్యాలు | తార, ప్రభు, సుచిత్ర |
గీతరచన | భువనచంద్ర, కీరవాణి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | విన్సెంట్, అజయ్ విన్సెంట్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | దేవి ఫిలిం ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చువిశాఖపట్టణం పోర్టులో పని చేస్తున్న రాజు (చిరంజీవి) తోటి ఉద్యోగులకి సహాయపడుతూ అందరి మెప్పు పొందుతుంటాడు. తన తల్లి (శుభ) కి పక్షవాతం రావటంతో హైదరాబాదుకి తిరిగివచ్చి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన పారిశ్రామికవేత్త అయిన బాపినీడు (రావు గోపాలరావు) ని రాజు రక్షిస్తాడు. అతని మంచితనాన్ని మెచ్చిన బాపినీడు తన సంస్థలోని ఒక ఉద్యోగానికి సిఫారసు పత్రాన్ని రాజుకి ఇస్తాడు. పొగరుబోతు అయిన బాపినీడు కుమార్తె ఉమాదేవి (నగ్మా) వ్యక్తిత్వం రాజుకి మొదటి నుండి నచ్చదు. సంస్థలో ఉద్యోగుల వద్ద మంచి పేరును సంపాదించిన రాజు వారికి నాయకత్వం వహిస్తూ ఉండటం ఉమాదేవికి నచ్చదు. అతనిని పెళ్ళి చేస్కొని అతని నోరు మూయించాలి అని ఎత్తు వేస్తుంది. కాని పెళ్ళి తర్వాత రాజు ఉమాదేవికి మరింత పెద్ద సమస్యగా మారతాడు. తన సెక్రటరీ అయిన భవాని (వాణీ విశ్వనాథ్) తో రాజు చనువుని ఉమాదేవి అపార్థం చేస్కొంటుంది. తన కొడుకుతో సంబంధాన్ని నిరాకరించిన ఉమాదేవిని అంతం చేయాలన్న రంగనాయకులు (కైకాల సత్యనారాయణ) ఎత్తుని చిత్తు చేస్తూ రాజు తన భార్యని రక్షించుకోవటంతో ఉమాదేవి రాజులోని మంచితనాన్ని గుర్తిస్తుంది.
సంభాషణలు
మార్చు- మేడం గారు కాసేపు డం డం లాడించారు.
విశేషాలు
మార్చు- మలయాళంలో ఈ చిత్రం హే హీరోగా అనువదించబడింది.
- ముందుకు వంగి, ఎడమ చేయిని వెనక్కి మడచి, కుడి చేయితో మాత్రం నమస్కారం పెట్టే చిరంజీవి శైలి ఈ చిత్రంలో గమ్మత్తుగా ఉంటుంది.
- ఈ చిత్రం తమిళంలో మన్నన్ (యువరాజు) గా పునర్నిర్మించబడింది. రజినీ కాంత్ నాయకుడు. నగ్మా పాత్రని విజయశాంతి, వాణీ విశ్వనాథ్ పాత్రని కుష్బూ పోషించారు.
- ఈ చిత్రంలోని "బంగారు కోడి పెట్ట" పాటని మగధీరలో రీ-మిక్స్ చేయించారు.
పాటలు
మార్చు- బంగారు కోడిపెట్ట , రచన: భువన చంద్ర, గానం.. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- కిటుకులు తెలిసిన , రచన: భువన చంద్ర,గానం. మనో, చిత్ర
- హే పిల్లా హలో పిల్లా, రచన: భువన చంద్ర, గానం. కె ఎస్ చిత్ర , మనో
- కప్పుకో దుప్పటి , రచన :కీరవాణి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
- ఏందిబే ఎట్టాగ ఉంది , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- పండు పండు పండు , రచన: భువన చంద్ర గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.