చంద్రాల

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం లోని గ్రామం

చంద్రాల (ఆంగ్లం: Chandrala), కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 330., ఎస్.టి.డి.కోడ్ = 08674.

చంద్రాల
—  రెవిన్యూ గ్రామం  —
చంద్రాల is located in Andhra Pradesh
చంద్రాల
చంద్రాల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°14′N 81°18′E / 16.23°N 81.30°E / 16.23; 81.30
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,519
 - పురుషులు 772
 - స్త్రీలు 747
 - గృహాల సంఖ్య 469
పిన్ కోడ్ 521330
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

చంద్రాల గుడివాడ నుండి 10 కిలోమీటర్ల దూరములో ఉన్న చిన్న గ్రామం. [1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

ముదినేపల్లి, గుడివాడ, పెదపారుపూడి, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, ముదినేపల్లి నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 53 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- గ్రామంలోని ఈ పాఠశాలలో, ఆధునిక మరుగుదొడ్లను నిర్మించుచున్నారు. ప్రఖ్యాత భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సంస్థ వారు, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలలలో ఈ మరుగుదొడ్లను నిర్మించుచున్నారు. మలమూత్ర విసర్జనలకు విడివిడిగా నిర్మాణం చేసారు. ఆటోమాటిక్ నీటి ఫ్లషింగ్ పరికరాలు, చేతులు కడిగేందుకు హ్యాండ్ వాషింగ్ పరికరాలు ఏర్పాటుచేస్తున్నారు. మూత్రం నేలలో ఇంకిపోయేటట్లుగా ఒరలను నిర్మించుచున్నారు. [3]

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంసవరించు

గ్రామంలో శ్రీ తుండేశ్వరస్వామి వ్యవసాయ సహకార పరపతి సంఘం పేరుతో, 80 సంవత్సరాల క్రితం, ఈ సంఘాన్ని ఏర్పాటుచేసారు. ఈ సంఘానికి 1980 లో ఒక శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో, 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన భవన నిర్మాణానికి గత సంవత్సరం శంకుస్థాపన నిర్వహించారు. ఈ భవన నిర్మాణానికి ప్రస్తుత సంఘం అధ్యక్షులు శ్రీ అడుసుమిల్లి శ్రీనివాస్, వారి సోదరులు వెంకటరమణ, మారుతీ శ్రీనివాస్, సంయుక్తంగా రెండు లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ భవనానికి వారి తండ్రి, మాజీ పాల సొసైటీ అధ్యక్షులు కీ.శే.అడుసుమిల్లి బాలవిశ్వేశ్వరరావు పి.యే.సి.ఎస్ భవనం గా నామకరణం చేసేందుకు నిర్ణయించారు. ఈ భవనాన్ని, 10 టన్నులు నిలువచేసేందుకు ఒక గోదాము, కార్యాలయ గది, అధ్యక్షుని గది, సమావేశ మందిరం, మరుగుదొడ్ల సౌకర్యం వగైరాలతో నిర్మించుచున్నారు. [5]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

చెరువులుసవరించు

గ్రామంలోని మూడు చెరువులలో, గత రెండు సంవత్సరాలుగా నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా పూడికతీత కార్యక్రమం చేపట్టినారు. 16 ఎకరాలలో విస్తరించియున్న మిగిలిన ఒక మంచినీటి చెరువులో పూడికతీత పనులను ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో చేర్చి, 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఇప్పుడు ప్రారంభించారు. [4]

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ తుండేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంసవరించు

ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా, 5 రోజులపాటు నిర్వహించిన ఆలయ షష్టమ వార్షికోత్సవాలు, 2014, ఏప్రిల్-11 తో వైభవంగా ముగిసినవి. ఈ సందర్భంగా మూలమూర్తులకు చందన అలంకారం, మహా పూర్ణాహుతి, శాంతికళ్యాణం, విష్ణుసహస్రనామ పారాయణం, శాతుమరై, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. రాత్రికి స్వామివారి గరుడవాహన తిరువీధి ఉత్సవాన్ని కన్నులపండువగా జరిపినారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామంలోని ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

చంద్రాల గ్రామంలోని ప్రధాన కులాలు గౌడ, బ్రాహ్మణ, మాల, కాపు, కమ్మ, మాదిగ.

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1640.[2] ఇందులో పురుషుల సంఖ్య 813, స్త్రీల సంఖ్య 827, గ్రామంలో నివాసగృహాలు 463 ఉన్నాయి.

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1519.[3] ఇందులో పురుషుల సంఖ్య 772, స్త్రీల సంఖ్య 747, గ్రామంలో నివాసగృహాలు 469 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "చంద్రాల". Retrieved 2 July 2016.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&[permanent dead link] district_code=16

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2014;ఏప్రిల్-13; 16వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, జూన్-3; 30వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, జూన్-5; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, జులై-13; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రాల&oldid=3291991" నుండి వెలికితీశారు