చర్చ:ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022

తాజా వ్యాఖ్య: పునర్వ్యవస్థీకరణ - 2022 జిల్లాల ఆర్కేవ్ లింకులు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

విలీనం అవసరం లేదు.ఈ రెండూ వ్యాసాలు వేరు వేరు మార్చు

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వ్యాసం, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వ్యాసం ఇవి రెండూ వేరు వేరు వ్యాసాలు. ఇది ఇంకా విస్తరించాల్సి ఉంది.దీనిని తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ వ్యాసం లాగా విస్తరించవలసి ఉంది, కొన్ని వ్యాసాలు పూర్తి వివరాలు, సమాచారం సేకరించి పొందుపర్చటానికి, పూర్తి వ్యాసంగా మారటానికి సమయం పట్టింది.ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది.వ్యాస సృష్టికర్త అదే పనిలో ఉన్నాడు. కావున విలీనం అవసరం లేదు. యర్రా రామారావు (చర్చ) 02:45, 9 జూన్ 2022 (UTC)Reply

@యర్రా రామారావు గారు, మీరు లక్ష్య వ్యాసపు చర్చాపేజీలో స్పందించినందున, మరల అటువంటి స్పందన వ్యాఖ్య ఇక్కడ అవసరంలేదు. {{విలీనము అక్కడ}} లాంటి మూసలవాడకం చర్చను ఒకచోట కేంద్రీకరించడమేనని గమనించండి. అర్జున (చర్చ) 03:55, 18 జూన్ 2022 (UTC)Reply

చరిత్ర విభాగం మెరుగుచేయటం మార్చు

@యర్రా రామారావు గారు, మీరు విస్తరించదలచిన చరిత్ర విభాగం మెరుగుగా వుండడానికి నా సూచనలు.

  1. పునర్వ్యవస్థీకరణలో జిల్లా తరువాత స్థాయిలో రెవిన్యూ విభాగాలు, మండలాలు మాత్రమే ప్రభావితమయ్యాయి. కావున చరిత్రలో వాటివరకే సమాచారాన్ని పరిమితం చేయడం మంచిది. రెవిన్యూ గ్రామాలు, నిర్జనగ్రామాల సంఖ్యలు అవసరంలేదు. వాటి గురించి మీరు సంగ్రహ సమాచారం చేర్చాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ మండలాలు మెరుగైన వ్యాసం.
  2. కొత్త జిల్లాల సమాచారమంతా జిల్లా వ్యాసాలలో వాడిన సంబంధిత వార్తల మూలంలో వుంది. దానికొక ప్రత్యేక నిలువవరుస అవసరంలేదు.
  3. జిల్లాల వారీగా ఈ వివరాలు చేరుస్తున్నప్పుడు ఒకే పట్టికగా కంటే జిల్లాకొక పట్టిక మెరుగు.
  4. రెవిన్యూ డివిజన్ వివరాలు తప్పించి, జిల్లాలు మార్పు జరిగిన మండలాల చాలా సమాచారం వికీడేటా ద్వారా చాలావరకు పొందవచ్చు. వికీడేటా క్వెరీ నడిపి చూడండి.

పరిశీలించండి. అర్జున (చర్చ) 04:15, 18 జూన్ 2022 (UTC)Reply

వికీడేటా ద్వారా సమాచారం పొందవచ్చు కాబట్టి, ఇక్కడ రాయనక్కేర్లేదు అనడం సరి కాదు. ఎందుకంటే.. ఇప్పుడు గ్రామ సమాచారం కోసం వికీపీడియాకు వచ్చే పాఠకుడు, వికీడేటాకు వెళ్ళాలా? ఈలోపు క్వెరీలు రాయడం నేర్చుకుని క్వెరీలు రాసి సమాచారం తెచ్చుకోవాలా? చాలా అసంబద్ధంగా ఉంది.
వివిధ జిల్లాల పేజీల్లో సమాచారం ఉందిగదా అని పట్టికలో పెట్టనక్కరలేదనడం సరిగ్గా లేదు. పట్టికల పర్పసే వేరు. డేటాను ఒకే చోట చూపించడమే ఈ పట్టిక ఉద్దేశంగా కూడా కనిపిస్తోంది. అలా ఉండడంలో తప్పేం లేదు. పట్టికంటే అలాగే ఉండాలి. ఈ పట్టికలో ఉన్న నిలువు వరుసలను తీసెయ్యాల్సిన అవసరమేమీ నాకు కనబడ్డం లేదు.
అర్జున గారూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వ్యాసాల్లో ఇటీవల మీరు చేస్తున్న మార్పుల్లో చరిత్రను తుడిచేస్తున్నారు. ఉదాహరణకు పాత జిల్లాల్లోని సమాచారాన్ని తీసేసి కొత్త సమాచారం చేర్చడం. పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్త జిల్లాల్లో ఏయే మండలాలు ఉన్నాయో రాయాలి, నిజమే. కానీ పాత జిల్లాలో ఏయే మండలాలు ఉండేవి అనే సమాచారాన్ని తీసెయ్య కూడదు గదా. చరిత్ర తుడిచెయ్యకూడదని గతంలో మీరే చెప్పారు. కానీ, సరిగ్గా అదే పని చేస్తున్నట్లు బహుశా మీరు గమనించుకోలేదనుకుంటాను. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:42, 18 జూన్ 2022 (UTC)Reply
చదువరి గారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:03, 21 జూన్ 2022 (UTC)Reply
@Chaduvariగారు, నా వ్యాఖ్యలు మీరు సరిగా అర్ధం చేసుకున్నట్లు లేదు. వ్యాఖ్యలో సంధిగ్ధత వుంటే చర్చద్వారా దానిని తొలగించుకోవచ్చు. అంతేగాని, మీరే ఇతరత్రా ఊహించుకుని దాని ప్రకారం ప్రతిస్పందించంటం చర్చలు మెరుగుగా జరగడానికి తోడ్పడదు. నేను వికీడేటా క్వెరీని ఉదహరించింది, పట్టికలు తయారు చేయడానికి అవసరమైన సమాచారం వికీడేటా ద్వారా పొందవచ్చు అని తెలపడానికి. దానిగురించి ఏమైనా సహకారం కావలిసివస్తే అడుగుతారని. అంతేకాని నేను రాయనక్కరలేదు అని అన్నానని తెలపటం మీ ఊహ మాత్రమే.
వికీపాఠకులకు అనువుగా ఉండటానికి పట్టిక స్వరూపం మెరుగు చేయడానికి నేను చేసిన సూచనలు తగిన వివరణతో వున్నాయి. ఆ వివరణలు అర్ధం చేసుకోవటంలో ఏమైనా సందేహాలుంటే చర్చించవచ్చు కాని పట్టిక అంటే అలాగే వుండాలి అని గుడ్డిగా సమర్ధించవద్దు. వ్యాసానికి,పట్టికకు ఒకటే పరిపూర్ణం రూపం అనేది ఎప్పుడూ వుండదు. నలుగురు చర్చించి మెరుగుపరచే అవకాశాలు ఎప్పుడూ వుంటాయి.
ఇక జిల్లా వ్యాసాలలో చరిత్ర గురించి మీ వ్యాఖ్యను గమనించాను. జిల్లా వ్యాసాలలో దోష పూరిత సమాచారం వీలైనంత వేగంగా సరిచేయటం ప్రాధాన్యతగా పనిచేస్తున్నాను. మండలాల పాత, కొత్త జిల్లా వివరాలు ఆంధ్రప్రదేశ్ మండలాలు పేజీలో ఇటీవల చేర్చాను. జిల్లా వ్యాసాలలో చరిత్ర విభాగాన్ని విస్తరించదలచుకుంటే మీరు పాలుపంచుకోండి. దానికి అవసరమైన సమాచారం ఆ పేజీనుండి, జిల్లా వ్యాసం చరిత్రలో పాత రూపాన్నుండి పొందవచ్చు. నాకేమి అభ్యంతరంలేదు. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:36, 24 జూన్ 2022 (UTC)Reply
@Arjunaraoc గారూ, చరిత్ర ప్రాముఖ్యత తెలిసినవాళ్ళు గదా పాత సమాచారాన్ని తీసెయ్యడం చెయ్యడం తప్పు అని చెప్పాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆ సమాచారాన్ని చేర్చవచ్చు. నేనే ఎందుకు మీరే చేర్చవచ్చు. కాకపోతే, పారబోసి ఎత్తుకోవడం ఎందుకు అనేది ప్రశ్న.
పోతే.., "కొత్త జిల్లాల సమాచారమంతా జిల్లా వ్యాసాలలో వాడిన సంబంధిత వార్తల మూలంలో వుంది. దానికొక ప్రత్యేక నిలువవరుస అవసరంలేదు." అనే ముక్కకి అర్థం ఏంటి? పట్టికల్లో ఆ సమాచారం వద్దనే గదా మీరన్నది.. వద్దనడం సరికాదు, అది ఉండాలి అన్నాన్నేను. ఇప్పుడూ అదే అంటున్నాను.
నమస్కారం.__ చదువరి (చర్చరచనలు) 06:19, 24 జూన్ 2022 (UTC)Reply
చదువరి గారూ, అర్జునరావు గారూ కాస్త ఎక్కువుగా రాయవలసివచ్చినందుకు ముందుగా క్షమించాలి. పై చర్చలలోని అన్ని విషయాలజోలికి నేను వెళ్లదలచుకోలేదు.ఈ చర్చలో ప్రసక్తి వచ్చింది కాబట్టి, కేవలం పాత జిల్లాలలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఉన్న చరిత్రను తొలగించిన విషయంమీద పూర్వాపరవిషయాలు, కొన్ని తప్పిదాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను.ఇవి ముందు ముందు వికీ అభివృద్ధికి తొడ్పడగలవని నేను భావిస్తున్నాను.
అర్జునరావు గారు నేను ముఖ్యంగా పైన " ఇక జిల్లా వ్యాసాలలో చరిత్ర గురించి మీ వ్యాఖ్యను గమనించాను. "జిల్లా వ్యాసాలలో దోష పూరిత సమాచారం వీలైనంత వేగంగా సరిచేయటం ప్రాధాన్యతగా పనిచేస్తున్నాను. మండలాల పాత, కొత్త జిల్లా వివరాలు ఆంధ్రప్రదేశ్ మండలాలు పేజీలో ఇటీవల చేర్చాను. జిల్లా వ్యాసాలలో చరిత్ర విభాగాన్ని విస్తరించదలచుకుంటే మీరు పాలుపంచుకోండి. దానికి అవసరమైన సమాచారం ఆ పేజీనుండి, జిల్లా వ్యాసం చరిత్రలో పాత రూపాన్నుండి పొందవచ్చు. నాకేమి అభ్యంతరంలేదు. ధన్యవాదాలు." అని అన్నారు. దానిమీదనే పూర్వాపరవిషయాలు వెల్లడిస్తున్నాను.
ఈ జిల్లాల పునర్య్వస్థీకరణ పనులు ఏప్రిల్ 4 నుండి మొదలైనవి.మొదటిసారిగా ప్రకాశం జిల్లాలో డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు విభాగంలో ఉన్న మొత్తం మండలాలు 56 కు తగిన చరిత్ర వివరాల రాయకుండా పునర్య్వస్థీకరణ తరువాత ఉండాల్సిన 38 జిల్లాలకు కుదించి సవరించుట జరిగింది.దీనివలన పూర్వపు పాత జిల్లాలో ఎన్ని మండలాలు ఉండేవి,పాత జిల్లా మండలాల భౌగోళిక పటం చరిత్ర వివరాలు కనుమరుగయ్యాయి.దీనిని గమనించి, పాత జిల్లాలలో చరిత్రను తొలగించకుండా జిల్లాల పునర్య్వస్థీకరణకు ముందు, తరువాత జిల్లా స్థితి అనే పద్దతిలో నేను మొదటగా శ్రీ కాకుళం జిల్లాలో సవరించి, దానిని ఉదహరిస్తూ రచ్చబండలో అదే రోజు 2022 ఏప్రిల్ 8న ఆంధ్రప్రదేశ్ 2022 జిల్లాల పునర్వ్యస్థీకరణలో పాత జిల్లాల పేజీల సవరణలలో గమనించాల్సినవి అనే విభాగంలో చర్చకు ప్రవేశపెట్టాను. అయితే దీనిలో బాగా చురుకుగా సవరణలు చేసే అర్జునరావు గారు ఇది చూసారో లేదో!.ఒకవేళ చూసి ఏముందిలే అని మిన్నకున్నారో ?తెలియదు.సరేనని బాపట్ల జిల్లా చర్చాపేజీలో సంబంధిత మాతృ జిల్లా వ్యాసాల సవరణ విభాగంలో  “ఈ జిల్లా పరిధిలో గల మాతృ జిల్లా వ్యాసంలోని వివరాలు ఈ జిల్లా వ్యాసంలో చేర్చి అక్కడ తొలగించాలి.” అని రాసారు.దానిని గమనించి అదే సమయంలో ఇదే విషయంమీద నా అభిప్రాయం సూటిగా చెప్పాను. ఆ చర్చను ఒకసారి పరిశీలించండి.ఇది జరిగిన తరువాతనే కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరానులు నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, కదప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ప్రకాశం జిల్లా పద్దతిలోనే అర్జునరావు గారు చరిత్ర  సమాచారం, సంబందిత పటాలతో సహా తొలగించారు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో వాడుకరి:పండు అనిల్ కుమార్ ఏప్రిల్ 7 న కొత్త వాడుకరిగా చేరి అదే రోజు చరిత్ర తొలగించిన పద్దతిలో సవరించాడు.సరే అతను కొత్త వాడకరి కాబట్టి అవగాహన లేదనుకుందాం.
ఇక అర్జున రావు గారు ఈ చర్చలో ఏమంటారో ఒకసారి పరిశీలించండి. “ మండలాల పాత, కొత్త జిల్లా వివరాలు ఆంధ్రప్రదేశ్ మండలాలు పేజీలో ఇటీవల చేర్చాను. జిల్లా వ్యాసాలలో చరిత్ర విభాగాన్ని విస్తరించదలచుకుంటే మీరు పాలుపంచుకోండి. దానికి అవసరమైన సమాచారం ఆ పేజీనుండి, జిల్లా వ్యాసం చరిత్రలో పాత రూపాన్నుండి పొందవచ్చు. నాకేమి అభ్యంతరంలేదు. “ అని అంటారు. దానికి నేను అంటానూ, ఆలోచించకుండా మీరు తొలగించి, మీరు ఎవరైనా అలా చెస్తే నాకేమి అభ్యంతరం లేదు అనటం ఎంతవరకు సబబుగా ఉందని అంటాను. ఇది సింపులుగా చెప్పాలంటే నేను బురదలో కాలుపెట్టాను.నా కాళ్లు ఎవరన్నా కడగండి అన్న చందంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భారీ ఎత్తునచేయవలసిన సవరణలకు, తెలంగాణ రాష్ట్ర జిల్లాలు మండలాల మార్పుచేర్పులుకు చేపట్టిన ప్రాజెక్టులాగా ఒక ప్రామాణిక ప్రాజెక్టు తయారు చేయకుండా, ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి అనే పేరుతో అర్జునరావు గారు ప్రయోగాత్మక ప్రాజెక్టు పెట్టటం సరియైన మార్గం అని నేను భావించటం లేదు.సరే ఆ సవరణలలో ఎవరైనా నాలాంటి వారు సవరణలు చేపడితే వారికి ఆటంకాలు కలిగించటం ఒక ప్రధాన లోపం.విసిగిస్తే క్షమించండి.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:34, 25 జూన్ 2022 (UTC)Reply
@యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. చర్చ గాడితప్పకుండా నా స్పందన నేను లేవనెత్తిన ప్రధానాంశం గురించే చేస్తాను. సద్విమర్శను మీరు ఆటంకంగా అనుకోవట బాధాకరం. నేను ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యకూడా నేను చేసింది సద్విమర్శే అని బలపరుస్తున్నదని గమనించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:00, 29 జూన్ 2022 (UTC)Reply
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:08, 29 జూన్ 2022 (UTC)Reply

పునర్వ్యవస్థీకరణ - 2022 జిల్లాల ఆర్కేవ్ లింకులు మార్చు

1. శ్రీ కాకుళం జిల్లా

2. మన్యం జిల్లా

3. విజయనగరం జిల్లా

4. విశాఖపట్నం జిల్లా

5. అనకాపల్లి జిల్లా

6. అల్లూరి సీతారామరాజు జిల్లా

7. తూర్పు గోదావరి జిల్లా

8. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా

9. కాకినాడ జిల్లా

10. పశ్చిమ గోదావరి జిల్లా

11. ఏలూరు జిల్లా

12. కృష్ణా జిల్లా

13. ఎన్టీఆర్ జిల్లా

14. గుంటూరు జిల్లా

15. పల్నాడు జిల్లా

16. బాపట్ల జిల్లా

17. ప్రకాశం జిల్లా

18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

19. తిరుపతి జిల్లా

20. చిత్తూరు జిల్లా

21. అన్నమయ్య జిల్లా

22. వైఎస్ఆర్ జిల్లా

23. కర్నూలు జిల్లా

24. నంద్యాల జిల్లా

25. అనంతపురం జిల్లా

26. శ్రీ సత్యసాయి జిల్లా

యర్రా రామారావు (చర్చ) 06:53, 6 సెప్టెంబరు 2022 (UTC)Reply

తొలి పునర్వ్యవస్థీకరణ తరువాత ఏర్పడిన కొత్త రెవెన్యూ డివిజన్ల ఆర్కేవ్ లింకులు మార్చు

1. పులివెందుల రెవెన్యూ డివిజను

2. కొత్తపేట రెవెన్యూ డివిజను

3. రేపల్లె రెవెన్యూ డివిజను

తొలి పునర్వ్యవస్థీకరణ ముందు ఏర్పడిన కొత్త రెవెన్యూ డివిజన్ల ఆర్కేవ్ లింకులు మార్చు

1. బద్వేలు రెవెన్యూ డివిజను

Return to "ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022" page.