చర్చ:ఎం.ఆర్.ఓ

తాజా వ్యాఖ్య: తహసీల్దార్ వ్యాసంలో విలీనం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana


తహసీల్దార్ వ్యాసంలో విలీనం

మార్చు

గతంలో తహసీల్దార్ హోదాను మండల రెవెన్యూ అధికారిగా మార్చబడింది.తిరిగి మరలా తహసీల్దార్ గా మార్చబడింది.ఈ రెండు హోదాలు వేరువేరు కాదు.రెండు ఒకటే. దీనికి రెండు రకాల పేజీలు ఉండటంలో అర్థంలేదు.దీనిలోని సమాచారం తహసీల్దార్ వ్యాసం పేజీలో విలీనం చేసి, ఎం.ఆర్.ఓ, మండల రెవిన్యూ అధికారి అని రెండు దారిమార్పుల చేయవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 06:39, 19 జనవరి 2021 (UTC)Reply

ఈ వ్యాసాన్ని తహశీల్దార్ వ్యాసంలో విలీనం చేసితిని.➤ కె.వెంకటరమణచర్చ 14:58, 2 ఫిబ్రవరి 2022 (UTC)Reply

అర్జున గారు చేసిన తుడిచివేతను ఎందుకు రద్దు చేసానంటే..

మార్చు
  1. ప్రతిపాదించిన విలీనం - {{విలీనము}} గానీ, {{విలీనము అక్కడ}} గానీ {{విలీనము ఇక్కడ}} గానీ -ఏదైనా ఏదైనా కావచ్చు. చర్చ ఏ పేజీలోనైనా జరగొచ్చు, విలీనమై మిగిలిపోయే పేజీలోనూ జరగొచ్చు. మరీ ముఖ్యంగా విలీనమై లుప్తమైపోయే పేజీ లోనూ జరగొచ్చు, జరగాలి కూడా. అంచేత ఇక్కడ అర్జున గారు తీసేసిన చర్చను తిరిగి స్థాపించాను.
  2. ఈసరికే ఒక వాడుకరి మొదలెట్టిన చర్చను, ఈ సందర్భంలో, తీసెయ్యాల్సిన పని లేదు. దాని కింద ఒక వ్యాఖ్య - ఫలానా కారణం వలన ఈ చర్చను ఇక్కడి నుండి కాపీ చేస్తున్నాను, ఇక అక్కడే చర్చించండి అని - రాసి కాపీ చేసి ఉంటే బాగుండేది. దాంతో ఇక్కడి చర్చ ముగిసి అక్కడ మొదలై/కొనసాగి ఉండేది.
  3. అర్జున గారు చేసిన ప్రతిపాదన సరైనదేనని భావిస్తే, ఇతరులు ఆ కొత్త ప్రదేశం లోనే చర్చిస్తారు. అది సరి కాదని భావించిన వారు అ సంగతే రాస్తూ ఇక్కడే చర్చను కొనసాగించవచ్చు.
  4. జరిగిన చర్చను తుడిచెయ్యడం వలన, అప్పటికే రాసిన వాడుకరి వాదన/అభిప్రాయం తెలికుండా పోతోంది.

గతంలో ఇలానో మరో రకంగానో చర్చలను డాక్టరింగు చేసిన ఘటనలు జరిగినపుడు అలా చెయ్యవద్దని చెప్పిన సంఘటనలున్నాయి. చర్చలలో ఇతరులు రాసిన వాటిని తీసెయ్యడం, సవరించడం, తరలించడం చెయ్యవద్దని అర్జున గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 01:27, 22 ఫిబ్రవరి 2021 (UTC)Reply

User:Chaduvari గారు, మీ సవరణకు ధన్యవాదాలు. విలీనము అక్కడ లాంటి మూసలు విలీనం మూసలు కంటె మెరుగైనవి. చర్చ స్థానం ఒకే చోట వుంటుంది, లక్షిత పేజీలో కూడా సూచన వుంటుంది. కావున ఇక్కడ చర్చఅనవసరం అని భావించి తొలగించాను. తొలగించకుండా వ్యాఖ్య వ్రాసివుండాల్సింది. చర్చ మెరుగుగా జరగటానికి నిర్వహణ కార్యక్రమాలను డాక్టరింగ్ అని వక్రీకరించవద్దు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:32, 22 ఫిబ్రవరి 2021 (UTC)Reply
అర్జున గారూ, నేను చెప్పినదాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. "చర్చ మెరుగుగా జరగటానికి నిర్వహణ కార్యక్రమాలను.." మీరు చేసిన పని చర్చ మెరుగ్గా జరిగేందుకు దోహదపడడం లేదు కాబట్టే దాన్ని తిరగ్గొట్టాల్సి వచ్చింది, ఆ సంగతి గమనించగలరు. ఇక ముందు అలా జరగకుండా మీరు చూసుకుంటారనే ఆశాభావంతో, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 02:00, 22 ఫిబ్రవరి 2021 (UTC)Reply

భూమి రికార్డుల పదజాలం

మార్చు

@Chaduvari:, @Arjunaraoc: గారూ ఈ వ్యాసం ఎం.ఆర్.ఓ గూర్చి తెలియజేస్తుంది. అతని వృత్తికి అర్హతలు, నియామక విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు, భాద్యతలు వంటివి చేర్చవచ్చు. ఈ భూమి రికార్డుల పదజాలం ఈ వ్యాసానికి సంబంధించినది కాదని నా అభిప్రాయం. తొలగిస్తే బాగుంటుందని భావిస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 17:49, 29 జనవరి 2022 (UTC)Reply

@K.Venkataramana గారు, భూమి రికార్డుల వివరం తొలగించి ఆ వివరాలతో కొత్త వ్యాసంగా చేయటం మంచిది. అర్జున (చర్చ) 05:04, 1 ఫిబ్రవరి 2022 (UTC)Reply
ఈ వ్యాసంలో అవసరం లేని రెవెన్య్హూ రికార్డుల పదజాలాన్ని తొలగించి కొత్త వ్యాసంలోకి తరలించితిని.➤ కె.వెంకటరమణచర్చ 13:55, 2 ఫిబ్రవరి 2022 (UTC)Reply
Return to "ఎం.ఆర్.ఓ" page.