చర్చ:కర్నూలు జిల్లా

తాజా వ్యాఖ్య: మెరుగైన బొమ్మ టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc


కర్నూలు జిల్లా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


కేవలం కర్నూలు నగరము (కర్నూలు జిల్లా కాదు) గురించి ప్రత్యేకంగా వ్యాసము ఉన్నదా? sasi 12:01, 25 మే 2009 (UTC)Reply

ప్రస్తుతానికి అయితే లేదు. కానీ మీరు విస్తరించగలరనుకుంటే పట్టణానికి ప్రత్యేక వ్యాసం సృష్టించండి --వైజాసత్య 16:03, 25 మే 2009 (UTC)Reply

మెరుగైన బొమ్మ మార్చు

కొండారెడ్డి బురుజు కి స్పష్టమైన బొమ్మ కావాలి.--అర్జున (చర్చ) 09:11, 16 మే 2012 (UTC)Reply

  • కామన్స్ లో ఉన్న ఏకైక చిత్రం చాలా తక్కువ రిజొల్యూషను కలిగి ఉన్నది. ఈ వారాంతం కర్నూలు వెళుతున్నాను. సమయం కుదుర్చుకొని కొండారెడ్డి బురుజుతో బాటు, ఇతర చిత్రాలు కూడా అప్లోడు చేస్తాను - శశి (చర్చ) 15:44, 2 సెప్టెంబర్ 2013 (UTC)

సందేహం మార్చు

కొండారెడ్డి బురుజు మరియు నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి ఒకటేనా ? ఈ దస్త్రం [1] చూసి సందేహం వచ్చింది. వచ్చింది. అహ్మద్ నిసార్ (చర్చ) 10:56, 28 అక్టోబర్ 2013 (UTC)

సలాం అహ్మద్| భాయ్! మెదడుకి మంచి మేతే పెట్టారు! ఈ దస్త్రంలో చూపిన భవనం, కొండారెడ్డి బురుజు ఒక్కటే. కానీ అబ్దుల్ వహబ్ ఖాన్ టోంబ్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే గోలే గుమ్మా వచ్చినది. ఈ దస్త్రం వాల్రెడీ కామన్స్ లో ఉన్నది. మీ సౌకర్యానికై జతపరుస్తున్నాను. కానీ కర్నూలులో ఇది ఎక్కడ ఉన్నది? దీని చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? వంటి విషయాలు నాకు కూడా తెలియదు. (డ్యామ్న్ మీ, నాకు కూడా తెలియదా?!?!) ఇవ్వాళే మా నాన్నారిని అడిగి తెలుసుకొంటాను! - శశి (చర్చ) 14:45, 18 నవంబర్ 2013 (UTC)
 
అహ్మద్| భాయ్! మా నాన్నారిని అడిగాను. ఉస్మానియా కాలేజి వద్ద ఈ సమాధి కలదు. కర్నూలు పట్టణం లో ప్రముఖ రాజవిహార్ కూడలి కలదు. రాజవిహార్ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డు ఒక వంతెనతో కలుస్తుంది. ఈ వంతెనకి కుడి వైపున ఈ వ్యాసంలో చిత్రమాలికలోని రాజవిహార్ హోటల్ వద్ద నున్న వంతెన పై నుండి కనబడుతున్న హంద్రీ నది పేరు గల చిత్రములో చూడవచ్చును. ఇలాగే ఎడమ వైపు కూడా ఉన్నది. ఆ ఎడమ వైపే దూరంగా గోలే గుమ్మా కనబడుతుంది. అంత దూరం నుండి చూసి నేను ఏదో మసీదు అనుకొన్నాను. అదే గోలే గుమ్మా అని మా నాన్నారు సెలవిచ్చారు. సో, అదీ మ్యాటర్!! మీ డౌట్ తో బాటు, నా డౌట్ కూడా క్లారిఫై చేసుకొనే ఆపర్చ్యునిటీ ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. - శశి (చర్చ) 14:59, 19 నవంబర్ 2013 (UTC)
సలాం శశి భాయి, మీ రిసర్చ్ కు ధన్యవాదాలు. మీరిచ్చిన ఇంఫర్మేషన్ కరెక్టే, మీ నాన్నగారికి నా సలాములు మరియు ధన్యవాదాలు తెలిపేది. దాదాపు ఓ 20 యేండ్ల క్రితం ఓ ట్రెయినింగ్ కొరకు కర్నూలు వచ్చాను. ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్యుయేజెస్, మానసగంగోత్రి, మైసూరు వారి సౌజన్యంతో, యూ.టీ.ఆర్.సి.(ఉర్దు ట్రైనింగ్ అండ్ రీసర్చ్ సెంటర్ - సోలన్, హిమాచల్ ప్రదేశ్) I.I.I.L. యొక్క అనుబంధ సంస్థ చే ఎస్.సి.ఇ.ఆర్.టి. మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ట్రెయినింగ్ ఉర్దూ భాషపై 10 రోజులు జరిగింది. అప్పుడు ఈ ప్రదేశాలు 1.కొండారెడ్డి బురుజు, 2.నవాబ్ బంగలా 3.గోల్ గుమ్మా (గోల్ గుంబద్, బీజాపూరు లాగా) మొదలగు ప్రదేశాలు చూశాను. అందుకే నేను మొదట ఉదహరించిన దస్త్రంపై అనుమానం వచ్చింది. ఈ గోలుగుమ్మా చూసాను, లోపలభాగంలోనూ వెళ్ళి దర్శించాను. అదొక సమాధి. నేను చూసినపుడు చాలా పాడుపడ్డలా అందవిహీనంగా వుండేది. కానీ మీరు చూపించిన దస్త్రంలో బాగుంది. ఏ.ఎస్.ఐ. (భారతీయ పురావస్తు శాఖ) ఆధ్వర్యంలో వున్న ఈ సమాధి, దీని నిర్మాణ శైలి ఇండో-ఇస్లామిక్ శైలి లో వున్నది. కట్టడం ఆకర్షణీయమే, చూపరులకు ఆకట్టుకొంటుంది. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:59, 19 నవంబర్ 2013 (UTC)
Return to "కర్నూలు జిల్లా" page.