చర్చ:తాజ్ మహల్

తాజా వ్యాఖ్య: వ్యాస నిర్వహణ టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
తాజ్ మహల్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 10 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


తాజ్ మహల్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 25 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాస నిర్వహణ

మార్చు

వివిధ సభ్యులు వ్యాసంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇదివరకు వ్రాసిన వ్యాసాన్ని తొలగిస్తున్నారు. దయచేసి అందుకు చర్చా పేజీని ఉపయోగించండి, సమన్వయంతో ప్రవర్తిస్తే బాగుంటుంది. ముందు రాసిన వాటికి రుజువులు చూపుతూ లేక ఖండనలు వ్రాయవచ్చు కానీ, ఇలా పూర్తి వ్యాసాన్ని తొలగించడం సమంజసం కాదు. నిర్వాహకులు ఈ వ్యాసాన్ని పునరిద్ధరించగలరు, నేను ప్రయత్నించి విఫలమయ్యాను.

TeluguPadam 03:21, 8 నవంబర్ 2009 (UTC)

అవును వ్యాసాన్ని పూర్తిగా మార్చివేశారు. మీరన్నట్లు వ్యాసం మొత్తాన్ని విమర్శనాత్మకంగా వ్రాయడం సమంజసం కాదు. కాబట్టి వ్యాసాన్ని కొన్ని కూర్పులు వెనక్కి చేయాల్సి ఉంటుంది. పాత వ్యాసాన్ని పరిశీలించి వెంటనే వెనక్కి చేయడానికి ప్రయత్నిస్తాను. -- C.Chandra Kanth Rao-చర్చ 15:15, 8 నవంబర్ 2009 (UTC)
ఒక అజ్ఞాత సభ్యుడు (76.183.162.23) మరియు Namahshivaya సభ్యుడు తాజ్‌మహల్ వ్యాసంలో ఉన్న వ్యాసం మొత్తాన్ని తొలిగించి క్రింది వ్యాసాన్ని ఉంచారు. వ్యాసాన్ని మార్పుచేయవచ్చు కాని మొత్తం వ్యాసాన్ని తొలిగించి వివాదాస్పద వాక్యాలను పెట్టినందుకు ఆ ఇద్దరి (ఒకరే కావచ్చు!) కూర్పులన్నింటినీ తొలిగించాను. ఆ సభ్యుడు/సభ్యులు చేర్చిన వ్యాసం ఇక్కడ చర్చా పేజీలో కాపీచేస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 17:59, 8 నవంబర్ 2009 (UTC)

ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో ఉన్న తాజ్ మహల్ 17 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం నిర్మించినట్లుగా చరిత్రను అతిదారుణంగా వక్రీకరించినారు. ఇది ఒక సనాతన శివాలయం మరియు అపురూపమైన కట్టడం. తాజ్ అని సంక్షిప్తంగా పిలవబడే తాజ్ మహల్ యొక్క అసలు పేరు తేజో మహాలయం . ముంతాజ్ పై అమితమైన ప్రేమ కలిగియుండడం వల్ల ఆమె మరణానంతరం ఆమెపై తన కున్నప్రేమకు స్మృతి చిహ్నంగా షాజహాన్ దీనిని నిర్మించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఈ పేరు షాజహాన్ భార్యలలో ఒకరయిన ముంతాజ్ బేగం పేరుకు దగ్గరగా ఉండడం వల్ల ఆమె పై ప్రేమకు చిహ్నంగా కట్టించాడని చరిత్రను వక్రీకరించారు. వాస్తవానికి షాజహాన్ హరెంలో ఉన్న చాలా వందల మంది స్త్రీలు, భార్యలలో ముంతాజ్ ఒకరు. ఆమెపై ప్రత్యేకమైన ప్రేమ అనే విషయం అనుమానానికి తావిస్తుంది.తాజ్ మహల్ అనే పేరును సునిశితంగా పరిశీలించినట్లయితే మనకు వాస్తవాలు అర్ధమవుతాయి. తాజ్ మహల్ ను ఆంగ్లంలో Taj Mahal అని వ్రాస్తారు. ముంతాజ్ పేరును Mumtaz అని వ్రాస్తారు. ఈ రెండు పదాలను గమనిస్తే తాజ్ లో "j" అనే ఆంగ్ల అక్షరం ఉంటే ముంతాజ్ లో "z" అనే అక్షరం ఉంది. ఇంకొక ముఖ్య విషయం, ఆమె పేరులో "మహల్" అనే పదం లేనే లేదు. ఇది చరిత్రను వక్రీకరించే క్రమంలో జత చేసిన పదం. ఆమె పేరులోనే కాదు, అల్జీరియా నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు "ఇస్లాం" విస్తరించి ఉన్న ఏ ప్రాంతంలో కూడా ఈ పదం వాడుకలో లేదు. దీన్నిబట్టి షాజహాన్ కట్టించాడని చెబుతున్న కట్టడానికి పెట్టిన పేరు(వాస్తవానికి అది తమకు అనుగుణంగా మార్చుకున్న పేరు కదా) లోనే ఎన్ని అనుమానాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంపై భారతీయ పురావస్తు శాఖ పరిశోధన చేయలేదు, వాస్తవాలు వాళ్ళకు తెలియవనుకోవడం అజ్ఞానం. అన్నీ తెలిసినా ఇది చాలా సున్నితమైన అంశం కనుక వాస్తవాలను గోప్యంగా ఉంచుతున్నారు.


ఇక్కడ వీటన్నింటికీ సంబందించిన ఋజువులు చూపించడానికి చిత్రాలను( ఫోటో) జత చేద్దామంటే అనుమతి లభించలేదు. 100 కి పైగా ఫోటోలు అద్భుతమైన వర్ణన లతో ,పక్కా ఆధారాలతో సహా ఉన్నాయి. ఆ ఋజువులన్నీ చాలా సరళమైన ఆంగ్ల భాషలో ఈ క్రింది వెబ్ సైట్ లో ఉన్నాయి.

http://www.stephen-knapp.com/was_the_taj_mahal_a_vedic_temple.htm

ఈ వెబ్ సైట్ ను సందర్శించి వాస్తవాలను తెలుసుకోండి. ఇంకా తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించాడని ,అది పవిత్ర ప్రేమకు చిహ్నం అనే భ్రమలో ఉండకండి.

ఈ వ్యాసం సంరక్షణ చేసేటంత దుశ్చర్యకు గురికాలేదు కాబట్టి నేను సంరక్షణ తొలగించాను. ఇక ముందు నిజంగా దుశ్చర్యలకు గురైతే సంరక్షణ గురించి ఆలోచించవచ్చు. అజ్ఞాత సభ్యుడి చేర్చిన సమాచారానికి కూడా ఆధారం ఉంది కాని వ్యాసంలో చేర్చబడలేదు అయిననూ దాని ఏకపక్షంగా తొలగించారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:35, 20 జనవరి 2014 (UTC)Reply

సంరక్షణ

మార్చు

తాజ్ మహల్ వ్యాసం ఈరోజు పదే పదే వ్యాసం దుశ్చర్యలకు అవుతుంది, కావున లాక్ చేయగలరు. కొత్త సభ్యులు వ్యాసంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇదివరకు వ్రాసిన వ్యాసాన్ని తొలగిస్తున్నారు. పేజీలో విద్వంసపు పనులు, దుశ్చర్యలకు అవుతుంది, కావున లాక్ చేయగలరు. అలాగే, నిర్వాహకులు ఈ వ్యాసాన్ని పునరిద్ధరించగలరు.  ప్రభాకర్ గౌడ్ నోముల 15:09, 9 సెప్టెంబరు 2020 (UTC)Reply

ఈ వ్యాసం ఈ రోజు దుశ్చర్యలకు గురి కాబడింది. ఒక వాడుకరి పేజీలో సమాచారమంతా తీసివేసి హిందూమత దేవాలయమని కొంత సమాచారం మూలాలు లేకుండా చేర్చాడు. అతని చర్చాపేజీలో హెచ్చరిక చేసి మరల పునరుద్దరించడం జరిగింది. మరల మరో పేరుతో మరల తొలగించే ప్రయత్నం చేస్తే దుశ్చర్యలను త్రిప్పికొట్టి వ్యాసాన్ని సంరక్షించాను. కొంతకాలం అయిన తరువాత సంరక్షణ తొలగించవచ్చు. K.Venkataramana(talk) 16:04, 9 సెప్టెంబరు 2020 (UTC)Reply
  ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆర్కిటెక్చర్ కు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
Return to "తాజ్ మహల్" page.