చర్చ:తెలుగు

తాజా వ్యాఖ్య: తెలుగు భాష గొప్పతనం టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: 2409:408C:5E96:E3D6:0:0:9F4B:8109
తెలుగు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 51 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
తెలుగు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 15 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
తెలుగు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


తెలుగు వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • ఈ వ్యాసంలో బయటి లింకులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క బయటి లింకుకూ వికీపీడియాలోనే ఒక వ్యాసాన్ని సృస్టించి, బయటి లింకులను తగ్గించాలి.
  • వ్యాసంలో ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను తొలగించేసి కొంత శుద్దిచేయాలి.
  • ఈ పేజీ ఒక సమాచార సంగ్రహంగా తయారయ్యిందే కానీ వ్యాసంలా లేదు.
  • తెలుగు భాషా పరిణామము మరియు చరిత్రలో గ్రాంథిక మరియు వ్యవహారిక ఉద్యమాల గురించి క్లుప్తంగా వ్రాయాలి.
  • తెలుగు భాష మన దేశం అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ స్థానం లో వున్నది *రెండవ స్థానం లో కాదు *

రెండవ స్థానం లో బంగ్లా భాష వున్నది

తెలుగు (భాష), తెలుగువారు అని వేర్వేరు వ్యాసాలు

మార్చు

తెలుగు భాష గురించి, తెలుగు ప్రజల నగురించి వేర్వేరు వ్యాసాలు ఉంటే వీలుగా ఉంటుంది అని నా అభిప్రాయం. 213.23.255.223 11:18, 26 ఫిబ్రవరి 2010 (UTC)Reply


వ్యాసం యొక్క పరిధి

మార్చు

ఈ వ్యాసం ప్రాధమికంగా తెలుగు భాష గురించి, తెలుగు ప్రజలు, ఆంధ్రుల గురించిన విషయాలు ఆయా వ్యాసాల్లో చేరిస్తే బాగుంటుంది. తెలుగు తొలిప్రొద్దు వెలుగులు, వివిధ రంగాలలొ తొలి తెలుగు వ్యక్తులు, అవధానం - తెలుగు సాహిత్యానికి ప్రత్యేకం విభాగాలను ఇందులోనుండి తొలగిస్తే బాగుంటుందేమో! ఇంకో విషయం అవధానం కేవలం తెలుగుకే ప్రత్యేకమని చెప్పుకున్నప్పటికీ అవధానం మరే ఇతర భారతీయ భాషలోనైనా జరగవచ్చు. అందులో ప్రత్యేకంగా తెలుగులోనే జరగగలిగినదేమీ లేదు. ఇతర భారతీయ భాషలగురించి నాకు ఖచ్చితంగా తెలియదు కానీ, సంస్కృతంలో మాత్రం అవధానాలు జరిగేవని నేను చదివాను --వైజాసత్య 05:27, 3 జనవరి 2009 (UTC)Reply

లింకు చూడండి --వైజాసత్య 05:37, 3 జనవరి 2009 (UTC)Reply

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట

మార్చు
  • కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)--Nrahamthulla 03:49, 28 అక్టోబర్ 2009 (UTC)

పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే

మార్చు

పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.--Nrahamthulla 03:01, 7 నవంబర్ 2009 (UTC)

ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్

మార్చు

ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)----Nrahamthulla 05:48, 1 నవంబర్ 2009 (UTC)

తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ

మార్చు
  • "మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారు.ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారు"--మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ (ఈనాడు 31.1.2010)
  • భారతదేశంలో ఏ రాష్ట్రంలో పనిచేసే అధికారులకు ఆ భాష నేర్పించే ప్రయత్నం చేస్తోంది అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌.అమెరికా వైస్‌ కాన్సూల్‌ గ్రెగ్‌ ర్యాంకిన్ తెలుగు నేర్చుకొని తెలుగులో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.(ఈనాడు గుంటూరు 16.9.2010)--Nrahamthulla 03:28, 16 సెప్టెంబర్ 2010 (UTC)

అంతరించిపోతున్నఅమ్మభాష

మార్చు

దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)--Nrahamthulla 07:26, 21 ఫిబ్రవరి 2010 (UTC)Reply

తెలుగు మంత్రిత్వ శాఖ

మార్చు

రాష్ట్రంలో ఉగాది పర్వదినం నుంచి పూర్తి స్థాయిలో తెలుగులోనే పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు.తెలుగు భాష అభివృద్థికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖనూ ఏర్పాటు చేస్తామన్నారు.(ఈనాడు25.2.2010)

ప్రాచీన హోదా

మార్చు

హైకోర్టు విషయం తేల్చకపోయినప్పటికీ, తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి అన్ని సౌకర్యాలు, నిధుల విడుదల విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చునని కేంద్ర న్యాయమంత్రి వీరప్ప మొయిలీ సంబంధిత మంత్రిత్వ శాఖల అభ్యర్థన మేరకు న్యాయసలహాను అందజేశారు. ప్రాచీన హోదా అమలు అయితే తెలుగు భాషాభివృద్దికి, పరిశోధనాకేంద్రాలకు రు. వందకోట్ల మేరకు నిధుల విడుదల, ఇతర సౌకర్యాలు అమలు అవుతాయి.(ఆంధ్రజ్యోతి 12.3.2010)

బ్రిటిష్‌ వాళ్లను తరిమినా ఆంగ్లాన్ని వదల్లేకపోతున్నాం

మార్చు

స్వాతంత్య్ర పోరాటంతో దేశం నుంచి బ్రిటిష్‌ పాలకుల్ని తరిమికొట్టినా వారి భాషను మాత్రం విడవలేకపోతున్నామని శాసనమండలి అధ్యక్షుడు ఎ.చక్రపాణి , మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ విచారం వ్యక్తం చేశారు. మాతృభాష పరిరక్షణకు సమైక్యంగా నడుం బిగించాలని పిలుపునిచ్చారు.అధికారభాషలోనే పాలన కొనసాగించేందుకు ప్రజల నుంచి ఒత్తిడి రావాలన్నారు.ఈ విషయంలో తమిళనాడు ముందంజలో ఉందన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో విషాదకర పరిణామాలకు భాష, సంస్కృతిలను విస్మరించడమే కారణమని అభిప్రాయపడ్డారు.(ఈనాడు 8.3.2010)

భాష పెట్టె స్థానం

మార్చు

తెలుగుతల్లి బొమ్మ ని మొదటిదిగా చేయక, భాషపెట్టెని మొదటిదిగా చేయటం మంచిది. ఎందుకంటే ఆ పెట్టెలో విలువైన సమాచారం తొలిదర్శనంలో కనబడుతుంది. తెలుగుతల్లిని ప్రత్యేక వ్యాసంలో బొమ్మని మొదటిదిగాచేయటం బాగుంటుంది.-- అర్జున 07:19, 13 అక్టోబర్ 2010 (UTC)

Dictionary of mixed Telugu  By Charles Philip Brown

మార్చు

http://books.google.com/books?id=j28IAAAAQAAJ&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false

Rajmaan (చర్చ) 22:01, 9 మార్చి 2013 (UTC)Reply

తెలుగు అధికార భాషా సంఘం

మార్చు

ఇది పునరుద్ధరించబడిందికదా. దీనికి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షుడు కదా. ఆయనకు మంత్రి హోదా కల్పిచబడింది కదా. ఈ విషయాన్ని వ్యాసం లో చేర్చ వచ్చునా. దీనికి ప్రమాణం చూపించాలా?కంపశాస్త్రి 13:38, 10 ఏప్రిల్ 2013 (UTC)

చేర్చవచ్చు. గూగుల్ లో వెతికి అంతర్జాల తెలుగు వేదికలలో శాశ్వతంగా వుండే వార్తలు, లేక హిందూ లాంటి ఆంగ్లపత్రికలలో సంబంధించిన వార్తను వనరు గా చేర్చాలి.--అర్జున (చర్చ) 23:32, 10 ఏప్రిల్ 2013 (UTC)Reply
  తెలుగు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 51 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia

Dating of Telugu Language

మార్చు

I will try to write History part of this article on par with https://en.wikipedia.org/wiki/Telugu_language#Earliest_records. I want to expand the history part.

--Criticpanther (చర్చ) 09:17, 26 డిసెంబరు 2017 (UTC)Reply

తెలుగు భాష గొప్పతనం గురించి

మార్చు

తెలుగు భాష గొప్పతనం గురించి ఎస్సే రైటింగ్ 2409:408C:5E96:E3D6:0:0:9F4B:8109 14:03, 26 ఆగస్టు 2024 (UTC)Reply

తెలుగు భాష గొప్పతనం

మార్చు

తెలుగు భాష గొప్పతనం గురించి ఎస్సే రైటింగ్

2409:408C:5E96:E3D6:0:0:9F4B:8109 14:04, 26 ఆగస్టు 2024 (UTC)Reply

Return to "తెలుగు" page.