చర్చ:తెలుగు/పాత చర్చ 1

తాజా వ్యాఖ్య: తెలుగు పై సంస్కృత ప్రబావం టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran

(ప్రొఫెసరు వేమూరి రావు గారి పుస్తకము నుండి ) (స్వేచ్ఛానువాదము చావా కిరణ్ కుమార్ - తప్పులు ఉన్న సరిదిద్ది క్షమించగలరు . అనువాదమనే మొదలు పెట్టినాను కానీ వేమూరి గారి వ్యాసము ఇంగ్లీషు వారికోసం ఉద్దేశించి వ్రాయబడినది. ఈ తెలుగు వికీని ఎక్కువగా తెలుగు వారే చదువుతారు. కనుక నేను ఎక్కువగా స్వతంత్రముగా కోసివేయడము, పొడిగించడము వంటి నిర్ణయములు తీసుకున్నాను, విజ్ఞులు సరిచూసి సరిదిద్దగలరు. )

see the page telugu in English Wiki. We can also translate from that page.

సమష్టి కృషి

మార్చు

25/9/2006 న వైజాసత్య ఇచ్చిన సందేశము ఇక్కడకు కాపీచేస్తున్నాను: "తెలుగు వికీపీడియాలో తెలుగు పై వ్యాసము అంతంత మాత్రమే ఉండటము ఏమీ బాగోలేదు. విస్తరించడానికి నడుం కడదాం రండి"


ఇది ముఖ్యమైన విషయం. ముందుగా ఈ వ్యాసము అభివృద్ధికి పందిరి వేద్దాము(ఫ్రేమ్ వర్క్) . సభ్యులు ఎవరివీలును బట్టి వారు వ్యాసానికి తోడ్పడవలెను. ఐతే కొన్ని ముఖ్యమైన గమనికలు

  • ఇందులో చాలా విషయాలకు వేరే వేరే వ్యాసాలు ఉన్నాయి. కనుక అంతర్గత లంకెలనూ, వర్గాలనూ జాగ్రత్తగా గమనించండి.
  • ఒక విషయంమీద వేరే వ్యాసం ఉన్నట్లయితే, ఇక్కడకూడా క్లుప్తంగా వ్రాయండి. అప్పుడు ఈ వ్యాసం అతుకుల బొంతలాగా కాకుండా, సమగ్రవ్యాసంగా రూపు దిద్దుకొంటుంది.

కాసుబాబు 12:11, 25 సెప్టెంబర్ 2006 (UTC)

ఇది చాలా మంచి ఆలోచన
పందిరి వేయడముతో నేను ఏకీభవిస్తున్నాను
ఈ వ్యాసములో మనము తెలుగు భాష గురించి వ్రాద్దాము
తెలుగు లిపి గురించి మరొక వ్యాసము వ్రాద్దాము
తెలుగు ప్రజల గురించి మరొక వ్యాసము వ్రాద్దాము .
దీనికి ముందు మనము మిగిలిన భాషలు ఎలా వ్రాసినారో ముఖ్యముగా ఇంగ్లీషు వికీలో చూసి కొద్దిగా ఆలోచన పొందితే బాగుంటుంది Chavakiran 13:08, 25 సెప్టెంబర్ 2006 (UTC)


ఇంక ఆలస్యము ఎందుకని పందిరి మొదలు పెట్టాను. సభ్యులంతా పందిరినీ మార్చ వచ్చు. వ్యాసాన్నీ కూర్చ వచ్చును. స్వాగతం కాసుబాబు 19:52, 25 సెప్టెంబర్ 2006 (UTC)


నేను ఇదివరలో చదివిన ఒక పుస్తకంలో క్రింది విధంగా ఉంది... "తెలుగు భాషలో అక్షరాలు కేవలం 36, ఆంధ్రభాషలో అక్షరాలు 56 " అని. దయచేసి మరోసారి పరీక్షించండి. --కిషోర్ 04:30, 6 నవంబర్ 2006 (UTC)

మా తెలుగు తల్లికి మల్లెపూదండ -- యొక్క అవసరం

మార్చు

ఈ వ్యాసంలో నాకు ఈ పాట యొక్క అవసరము ఏమీ కనిపించడం లేదు.

మీరేమంటారు? Chavakiran 14:29, 5 అక్టోబర్ 2006 (UTC)

అవును దాన్ని ప్రత్యేక వ్యాసములో పెట్టాలి. --వైఙాసత్య 15:55, 5 అక్టోబర్ 2006 (UTC)
ఇప్పటికే ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 17:00, 5 అక్టోబర్ 2006 (UTC)
అది కిరణ్ గారి వ్యాఖ్య చదివి నేనిప్పుడే సృష్టించాను --వైఙాసత్య 17:02, 5 అక్టోబర్ 2006 (UTC)
సారీ నేను లింకు తప్పిచ్చాను. ఇప్పటికే అది వేరే చోట ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 17:05, 5 అక్టోబర్ 2006 (UTC)
పర్వాలేదు తప్పునాదే వెతకకుండానే పేజీ సృష్టించా. ఇప్పుడు దాన్ని దారిమార్పు చేశా. --వైఙాసత్య 17:11, 5 అక్టోబర్ 2006 (UTC)

ప్రస్తుత లిపి

మార్చు
  • ఈ విభాగాన్ని నేను చేర్చాను. ఉచితమో కాదో సభ్యులు వ్యాఖ్యానించ గలరు.
  • "చ", "ఛ" ల మధ్య ఒక అక్షరం, "జ", "ఝ" ల మధ్య ఒక అక్షరం ఉండాలి. కాని వాటిని టైపుచేయడం నాకు చేతకావటంలేదు. కాసుబాబు 17:40, 5 అక్టోబర్ 2006 (UTC)
ఈ రెండు అక్షరాలను ఇంకా యూనికోడులో చేర్చలేదండి. బహుశ త్వరలో చేరుస్తారనుకుంటా! __చదువరి (చర్చ, రచనలు) 17:55, 5 అక్టోబర్ 2006 (UTC)
ఇంకో రెండు నెలలు ఆగాలి --వైఙాసత్య 21:43, 5 అక్టోబర్ 2006 (UTC)

గమనించవలెను

మార్చు

తెలుగు చరిత్ర లో కొంత భాగాన్ని www.bhashaindia.com లోని "తెలుగు - తేనెకన్నా తీయనిది" అన్న వ్యాసాన్నుండి, తొలితెలుగు విశేషాలు http://www.pramukhandhra.org/pr_viseshaalu.html అన్న వ్యాసం నుండి యథా తథంగా తీసుకొన్నాను. ఈ విషయాలు సార్వత్రికమైనవి అవడం వల్ల కాపీ హక్కులు ఉల్లంఘించడంలేదని భావిస్తున్నాను

కాసుబాబు 17:55, 7 అక్టోబర్ 2006 (UTC)



తెలుగుతల్లి చిత్రం - ఇంకా మంచిది లభిస్తే ఎవరైనా చేర్చగలరు. కాసుబాబు 19:44, 9 అక్టోబర్ 2006 (UTC)

ఇంకా రెండు బొమ్మలు ఉన్నాయి. ఏది బాగుందనిపిస్తే అది చేర్చండి బొమ్మ:Telugutalli.gif బొమ్మ:Telugu thalli.JPG --వైఙాసత్య 13:04, 10 అక్టోబర్ 2006 (UTC)
Give me some time, I will upload the photo of telugu talli statue near Tank Bund. Chavakiran 07:32, 11 అక్టోబర్ 2006 (UTC)

Have a look at english essay on english wiki

మార్చు
  1. That is a nice one to look.
  2. We need to add more of telugu grammar
  3. we need to sub device articles and write here briefly with a pointer to main article.

Chavakiran 16:17, 9 నవంబర్ 2006 (UTC)

తెలుగు గురించి ప్రముఖుల వాక్యాలు

మార్చు

తెలుగు గురించి ప్రముఖుల వాక్యాలు

ఇవి తటస్థ దృక్కోణమునకు అనుగుణంగా ఉన్నాయా?

అలాగే, మనము వీటిని ప్రముఖుల వాక్యాల్లోకి మారిస్తే బాగుంటుది, పైన కుడివైపుకు ఉంచడం కన్నా!

ఏమంటారు? Chavakiran 16:17, 9 నవంబర్ 2006 (UTC)

వీటిని వేరేపేజీలో పెట్టి ఇక్కడ లింకు ఇస్తే బాగుంటుంది. ఇవి ప్రచురించబడిన అభిప్రాయాలు అందునా మూలాలతో సహా ఉన్నాయి కాబట్టి వికి తటస్థ దృక్కోణములో ఉన్నట్టే. --వైఙాసత్య 15:56, 11 నవంబర్ 2006 (UTC)

లింకులు మరీ ఎక్కువ అవుతున్నాయి

మార్చు

, we need to have a strict policy about what can be linked and what can not be linked.

I say

Links must be related to telugu language other are to be rather removed or moved to other articles. Chavakiran 16:17, 9 నవంబర్ 2006 (UTC)

ఎలాగోలా వీటిని కుదించి అమరిక మార్చాలి. ఇలా అంత స్థలాన్ని ఆక్రమించడం బాగోలేదు --వైఙాసత్య 15:58, 11 నవంబర్ 2006 (UTC)

ఇంటింటా తెలుగు దివ్వె

మార్చు

(పాపిశెట్టి గారు ప్రదీప్ చర్చాపేజీ లో వ్రాసిన విషయాన్ని ఇక్కడికి మారుస్తున్నాను. ఇది ఇక్కడ ఉండడమే సబబు అని.ఈ విషయంలో నేను ప్రదీప్ అనుమతి తీసుకొనలేదు. అతనికి అభ్యంతరము ఉండదని అనుకొంటూ - కాసుబాబు 19:01, 3 జనవరి 2007 (UTC))Reply


ఈ క్రింది వ్యాసాన్ని ఒక తెలుగు బ్లాగులో చూసాను. నచ్చింది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దీనిని తెలుగు భాష వర్గం క్రింద చేర్చితే బావుంటుందో లేక ఒక క్రొత్త వ్యాసంగా తెలికీ లో పెడితే బావుంటుందో అర్ధంకావట్లా. బహుశా ఈ వ్యాసాన్ని మీరు ఇంతకుముందే చూసుంటారని అనుకుంటున్నాను. దీని పై మీ అభిప్రాయం ఏమిటి?
ఇంటింటా తెలుగు దివ్వె - డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ Courtesy: ఈనాడు
తెలుగువారిలో ప్రతి ఒక్కరూ తెలుగుకు నిలువెత్తు దర్పణంలా నిలవాలి. మనం పలికే ప్రతి పలుకులో తెలుగుకే పట్టం కట్టాలి. ప్రతి పలకరింతా తెలుగు పులకరింత కావాలి.
మనం నిలబడాలనుకొంటే పక్కవాణ్ని పడేయాలనుకోవడం అవివేకం. అలాగే తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే, ఏవో కొన్ని భాషల వ్యాప్తిని అరికట్టాలనుకోవడం కూడా అవివేకమే. ఇప్పటికయినా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా మనలో తెలుగు బాగా వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మనం చిత్తశుద్ధితో కొన్ని నిర్ణయాలు తీసుకొని, వాటిని తు.చ. తప్పకుండా ఆచరిస్తే ఫలితం కచ్చితంగా వచ్చి తీరుతుంది. మనల్ని చూసి ప్రభుత్వం కూడా మార్గం మార్చుకుంటుంది.
ముందుగా- తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వారి సంతకాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుగులోనే చేయాలి. బ్యాంకు లావాదేవీల దగ్గరనుంచి, ఉద్యోగం చేసే చోట చేస్తున్న పొట్టి సంతకాల దాకా! మనమందరం కలిసి ప్రతిరోజూ సాగించే ఉత్తర, ప్రత్యుత్తరాలు అసంఖ్యాకంగానే ఉంటాయి. ఆ ఉత్తరాలలో నిర్దేశించిన విషయం ఆంధ్ర దేశ పరిధిలో ఉంటే, ఆ విషయాన్ని; ఉత్తరాలపై వ్రాసే చిరునామాల్ని కూడా తెలుగులోనే వ్రాయండి. ఒకవేళ ఆయా అధికారులు ఆంధ్రేతరులైనట్లయితే, తెలుగులో ఉన్న ఆ లేఖల్ని చదివి తర్జుమా చేయించుకునే తలనొప్పి వారిదే అవుతుంది. బజారుకు వెళ్ళి మనమేదైనా కొనేటప్పుడు వాటి పేర్లను సహజంగా తెలుగులోనే చెప్పి కొనుక్కురండి. నిత్యావసర వస్తువుల్ని, పచారీ సామాన్లను, కూరగాయలను, పండ్లను ఇలా పలకడానికి ఇబ్బందిలేని, తెలుగు భాషలో చక్కని పదాలు ఉన్న వాటిని ఆ పేర్లతోనే పలకండి. తెలుగు భాషలో లేని పదాలు గల ఇతర భాషలలోని వస్తువుల పేర్లను (టీవీ, సైకిలు, రేడియో వంటివి) అలాగే పలకండి. బ్యాంకు ఫారాలను, మనియార్డరు ఫారాలను, చలానాలను నింపేటప్పుడు ఒకవైపు ఆంగ్లంలోనూ, మరొకవైపు తెలుగులోనూ నమూనా ఉంటే తెలుగులోనే కచ్చితంగా నింపండి. టీవీ చూస్తున్నప్పుడు తెలుగు ఛానళ్ళనే చూడండి. తెలుగు భాషతోపాటుగా మనోవికాసాన్ని కలిగించే భాగవతం, దేవీ భాగవతం, పంచతంత్రం వంటి కార్యక్రమాలను తప్పనిసరిగా పిల్లలకు చూపించండి. మీ పిల్లల్ని రోజుకో గంట సేపు మీ ఇంట్లో ఉన్న వృద్ధుల దగ్గర కూర్చోపెట్టండి. వారి చేత తెలుగు సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, కథలు, పాటల రూపంలో చెప్పించండి. కొత్తగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తప్పనిసరిగా తెలుగు భాషను ఎంపిక చేయండి. ఇంటి దగ్గర పిల్లలకు రోజూ కొన్ని కొత్త తెలుగు పదాల్ని నేర్పిస్తూ తెలుగులోనే మాట్లాడండి. కనీసం వారానికో పద్యం వాళ్లు నేర్చుకొని చక్కగా చదివేటట్టు చూడండి. విజిటింగ్ కార్డులను, వివిధ శుభకార్యాలకోసం మనం ముద్రించే శుభలేఖలను తెలుగులోనే ముద్రించి అందరికీ పంచండి. పాఠశాలల్లో తెలుగులో మాట్లాడవద్దని నియంత్రించే యాజమాన్యాన్ని తల్లిదండ్రులందరూ కలిసి నిలదీయండి. ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడేవారికి చిన్న చిన్న బహుమతుల్ని ఇవ్వండి. ఎవరైనా తెలుగు వచ్చి కూడా ఇంగ్లిష్లో మాట్లాడితే వారితో తెలుగులోనే మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అపరిచితులకు తెలుగు రాదేమోనని ముందుగా మీరే ఊహించేసుకొని ఆంగ్ల సంభాషణ ప్రారంభించకండి. చక్కగా తెలుగులోనే మాట్లాడండి. వారికి చక్కగా అర్థమవుతుంది. ఏవైనా దరఖాస్తులు వ్రాయవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ తప్పుల తడకలతో ఆంగ్లంలో వ్రాయడం మానేసి చక్కగా తెలుగులో స్వేచ్ఛగా వ్రాసి (మాట్లాడే భాషనే) ఆత్మవిశ్వాసంతో నిలబడండి. శుభాకాంక్షల్ని నోరారా తెలుగులోనే తెలియజేయండి. (ఎదుటి వారు ఇంగ్లీషులో చెప్పినాసరే!) వారానికొక రోజు (సెలవు రోజైన ఆదివారమైతే మరీ మంచిది) పూర్తిగా చక్కని తెలుగు భాషలో మాట్లాడాలనే నిర్ణయాన్ని ఇంటిల్లిపాదీ తీసుకొనేట్లు చూడండి. ఆచరింపజేయండి. ఇలా ప్రతిఒక్కరూ నిత్యం తెలుగును గుర్తుంచుకొని వ్యవహరించాలి. ఇప్పటికే తెలుగు వచ్చినవారంతా ఈ సూచనలు పాటిస్తే తెలుగుకు ప్రాచుర్యం తక్కువ కాలంలోనే ఎక్కువగా లభిస్తుంది.
ఇక- అసలు తెలుగువారై ఉండి, తెలుగు భాషలో రాయడం, చదవడం వంటివి రానివారి కోసం ప్రభుత్వం కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తెలుగు భాషను బోధించని, ప్రాధాన్యం ఇవ్వని పాఠశాల తెలుగుదేశంలోనే ఉండకూడదు. చిన్నప్పటినుంచి తెలుగును నిర్బంధ విద్యగా అమలు చేయాలి. తెలుగుదేశంలో ప్రతి ఒక్కరికీ అ, ఆ, ఇ, ఈ లతోనే చదువు ప్రారంభం కావాలి. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య దాకా తెలుగుకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పించాలి. వృత్తి విద్యా కోర్సులలో సైతం తెలుగు భాషా సాహిత్యాలకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఉద్యోగ ప్రకటనల్లోని నియమ నిబంధనలలో... తెలుగు వ్రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉంటేనే అర్హతగా ప్రకటించాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగాలకే కాక ప్రయివేటు ఉద్యోగాలకు కూడా వర్తింపజేయాలి. (ఇది తెలుగు మాతృభాషగా కలవారికి మాత్రమే) ఎంసెట్ వంటి పోటీ పరీక్షలలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకు సముచిత స్థానం కల్పించాలి. పరీక్షలలో ఉత్తీర్ణత శ్రేణిని నిర్ణయించడానికి తెలుగు మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో..., ఆంధ్ర దేశం వరకు పరిమితమయ్యే ఆధికారిక లేఖా వ్యవహారాలన్నీ తెలుగులోనూ; ఆంధ్రేతర ప్రాంతాలతో జరిపే వ్యవహారాలలో తెలుగుతోపాటుగా అన్యభాషలలోనూ జరిగేటట్లు శాసనం చెయ్యాలి. కంపెనీల, సినిమాల, షాపుల, అధికారుల పేర్లు, హోదాలు ఇలా అన్నీ తెలుగులో (తెలుగు లిపిలో) రాసేటట్లు ఆజ్ఞలు జారీ చేయాలి. శాసనసభలో నాయకులు మాతృభాషలోనే ప్రసంగించాలి. ఇలాంటివి ఎన్నో ఆలోచనలు మనసు పెట్టి ఆలోచిస్తే స్ఫురిస్తాయి. అలా స్ఫురించినవాటిని ఆచరణలోకి తీసుకువస్తే ప్రయోజనం ఉంటుంది.
తెలుగును వ్యాప్తి చేయడంలో ప్రజల బాధ్యత ప్రజలది, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానిది. సాధ్యమయినంత వరకు మన నిత్య జీవనాన్ని పూర్తిగా తెలుగుమయం చెయ్యడానికి ఎవరికీ ఏ ఇబ్బందికానీ, ఖర్చుకానీ ఉండదు. ఉద్యమాలు చేసి ఆయాసపడనక్కర్లేదు. ఉద్యమస్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అది నూటికి నూరుపాళ్ళూ ఆచరించేదిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తక్కినవారిని ప్రభావితం చేసి కార్యోన్ముఖులయ్యేలా చూడాలి. ఇది మనందరి గురుతర బాధ్యత. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపజేయడమో, లేక క్రమక్రమంగా కొండెక్కిపోతున్న వెలుగును పోగొట్టుకొని, మన భాషా సంస్కృతుల్ని అజ్ఞానంలోనికి నెట్టుకొని ఉనికిని కోల్పోవడమో... అంతా మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది. ఆలోచించండి. ఆచరించండి. ఉద్యమించండి. పాపిశెట్టి 19:39, 18 డిసెంబర్ 2006 (UTC)

ఇంటి భాషంటే ఎంత చులకనో!

మార్చు

భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించరు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,... ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి..... పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు.... భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్‌ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్‌ హైదరాబాద్‌ రావటం, సివికాన్‌ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్‌ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు: ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు. తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు: 1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు. 2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు. 3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.

4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది. 5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే?అన్నారు పుట్టపర్తి నారాయణాచార్యులు. 6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్‌ నేర్వాలి. 7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి. ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?: 1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా? 2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన 3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం. 4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్‌ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి? 5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం. 6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్‌ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది. 7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006) అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్‌ డానియల్‌ నెగర్స్‌ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు. మెదక్‌ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్‌ పూర్‌ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్‌ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్‌ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది. తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్‌ స్కూళ్ళు తెలుగు నేర్పవు. మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్‌ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్‌ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా. - నూర్‌బాషా రహంతుల్లా గీటురాయి 31-3-2006


చేయవలసిన పనులు??

మార్చు

ముఖ్యవ్యాసంలో "చేయవలసిన పనులు" అనే విభాగం క్రింద ఉన్న సమాచారం అంతా ఒక ప్రకటనలాగా ఉంది. ఇలాంటి సమాచారాన్ని ముఖ్యవ్యాసంలో కంటే వేరే నేంస్పేసులో ఉండే వ్యాసాలలో చేరిస్తే బాగుంటుంది. ముఖ్యవ్యాసంలో ఇలాంటి వాఖ్యాలకు అసలు చోటు ఉండకూడదని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:20, 15 జూన్ 2007 (UTC)Reply

నాకు కూడా అలాగే అనిపించింది. అవి వ్యాఖ్యలు సలహాలుగా ఉన్నాయి. నేను మొదటి సారి చదవాను సభ్యుడు అక్కడ సంతకం పెట్టడం వల్ల...--మాటలబాబు 15:23, 15 జూన్ 2007 (UTC)Reply
అవును ఈ చేయవలసిన పనులు ఒక వీకీపీడియాలో నేంస్పేసు వ్యాసంలోకి మార్చాలి. తెలుగు గురించి ఇతరులు ఏమన్నారు అనేది కూడా వేరే ఎక్కడికైనా మార్చితే బాగుంటుంది. వ్యాసాన్ని శుద్ధి చేసి వివిధ భాగాల మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి. ఇది శుద్ధి చేయటానికి పంపించాల్సిన వ్యాసం --వైజాసత్య 15:28, 15 జూన్ 2007 (UTC)Reply

బయటి లింకులు

మార్చు

ఈ వ్యాసంలో బయటి లింకులు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుగుకు సంబంధించిన పత్రికలు, ప్రభుత్వ సైట్లు వగైరాలకు తీసుకు వెడుతున్నాయి. దానికి బదులుగా, ఆ సంస్థలను వివరించడానికి ఒక్కొక్క సంస్థకు ఒక వ్యాసాన్ని సృస్టించి బయటి లింకులను తెవికీ లింకులుగా మార్చితే బాగుంటుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:06, 22 జూన్ 2007 (UTC)Reply

తెలుగు పై సంస్కృత ప్రబావం

మార్చు

దీని గురించి ఉపోద్ఘాతంలో ఇలా ఊదరగొట్టే బదులు ప్రత్యేక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. ఉపోద్ఘాతం సాధ్యమైనంత వరకూ చిన్నగా ఉంచడానికి తెలుగు ప్రత్యేకతలను ఒక్క ముక్కలో చెప్పడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. Chavakiran 13:16, 29 జూన్ 2007 (UTC)Reply

వ్యాసంలో ఉన్న అభిప్రాయాలు

మార్చు

వ్యాసం లో ఈ క్రింది భాగం నాకు అభిప్రాయాలుగా అనిపించాయి అందుకనే దీనిని అక్కడి నుండి తొలగించాను. ఎవరికైనా అలా కాదు అని అనిపిస్తే సరయిన కారణాలు తెలిపి మరలా అక్కడ అతికించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:08, 3 ఆగష్టు 2007 (UTC)

==తెలుగుభాష ఎదుర్కొంటున్న సవాళ్ళు==
-----
''(చర్చించండి - ఈ విభాగంలోని విషయాలు కొంతవరకు అభిప్రాయాలుగా పరిగణింపవచ్చును. దీనిని గురించి చర్చా పేజీలో వ్రాయండి. ఎక్కువగా సభ్యుల ఆమోదం పొందినట్లయితే వాటిని సార్వజనీనకంగా పరిగణింపవచ్చును)''
------

తెలుగుభాష, తెలుగు సాహిత్యం ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నది.ఆర్ధికంగా  తెలుగుజాతి గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న సమయంలో తెలుగుభాష ప్రాచుర్యం క్షీణించడం ఆందోళన కలిగించే సమస్య. ముఖ్యంగా స్థితిగతులు కలిగి, విద్యావంతులైన వర్గాలలో తెలుగుభాష వినియోగం బలహీనమవుతున్నది. ఇంగ్లీషు చదువుల వ్యామోహంలో పట్టభద్రులైన వారికి తెలుగు వచ్చీరాని పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. భాష ఉపయోగమే అంతంత మాత్రంగా ఉన్నపుడు ఇక సాహిత్యానికి ఆదరణ ఎలా ఉంటుంది? 

===క్షీణతకు ప్రధానమైన కారణాలు===

* తెలుగు నేర్చుకోవడం వల్ల బ్రతుకుతెరువుకు ఏమీ లాభంలేదన్నస్థితి. తెలుగు రాకపోవడం వల్ల ఏమీ ఇబ్బంది లేదన్న పరిస్థితి.
* అధికారభాషగా ఏమీ ప్రగతి సాధించలేక పోవడం
* కొరవడిన మాతృభాషాభిమానం. ఇక తెలుగువారికి పరభాషాభిమానం ఎప్పుడూ ఉన్నదే
* భాషలకు కంప్యూటరులు ప్రధానసాధనాలుగా మారుతున్నాయి. కంప్యూటరుపై వాడకంలో భారతీయభాషలన్నీ చాలా వెనుకబడి ఉన్నాయి.
* రాజకీయాలలో కులాలకు, వృత్తులకు, మతాలకు ఉన్నంత ప్రభావం లో ఇసుమంతయినా భాషకు లేదు. భాషాభిమానంతో  ఇంతవరకు ఏ తెలుగు రాజకీయనాయకులూ ఎదగలేదు.  [[నందమూరి తారక రామారావు]] తప్ప.


===ఆశాజనకమైన విషయాలు===

అలాగని పరిస్థితి పూర్తిగా చేజారలేదు. తెలుగును నిలిపే పట్టుగొమ్మలలో కొన్ని:

* తెలుగు మాటలాడేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉండబట్టి కొన్ని ఒడిదుడుకులున్నా తట్టుకొనే శక్తి భాషకు లభిస్తున్నది
* నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి వచ్చిన తరువాత తెలుగు భాషకూ, తెలుగు జాతికీ భారతస్థాయిలో అంతకు ముందెన్నడూ లేని బలం కూడింది.
* తెలుగు భాష బాగా పరిణతి చెందినదవడం వల్ల, అన్ని మాధ్యమాలకూ అనుగుణంగా మార్చుకొనే శక్తి కలిగి ఉన్నది.
* ముందుగా సినిమాలు, తరువాత టీవీ ఛానళ్ళు తెలుగు భాష వినియోగానికి ఊపిరి పోస్తున్నాయి. ప్రభుత్వం చేయలేని ఘనకార్యాలను ఇవి సాధించాయి. విరవిగా విస్తరించిన సినిమా వెబ్ సైటులు ఇందుకు ఉదాహరణ.
* కంప్యూటరులో తెలుగు వినియోగం ఆరోగ్యకరంగా పెరుగుతున్నది. అందుకు అనుగుణమైన సాధనాలూ వెలుగు చూస్తున్నాయి.
* భాషాభిమానం మరీ అంత తక్కువ కాదు - అనిపిస్తున్నది. మనకు గర్వకారణంగా ఎదుగుతున్న తెలుగు వికీపీడియా ఇందుకు ఒక తార్కాణం.


===చేయవలసిన పనులు===
* పాఠశాలల్లో తెలుగు భాష బోధనా ప్రమాణాలు పెంచాలి. అంటే మరింత క్లిష్టం చేయడం కాదు. ఆసక్తిని పెంచాలి.
* ఆచార వ్యవహారాలలోనూ, ఆధికారిక వ్యవహారాలలోనూ తెలుగు వాడుక పెంచాలి
* భాషపై ఆదరణ పెంచడానికి వాణిజ్య ధోరణి అవలంబింపక తప్పేలా లేదు. భాషను ప్రాచుర్యం చేయడానికి పోటీలు, గేమ్‌షోలు, క్విజ్‌లు పెట్ట వచ్చు.
ఏడు సూత్రాలు:</br>
1.నాయకులు,అధికారులు ముందు తమ మనసుల్లో తెలుగు భాష పట్ల గౌరవం అభిమానం పెంచుకోవాలి.ఆ భాష గౌరవాన్ని కాపాడటానికి శపథం తీసుకోవాలి.ఎంతో గౌరవమిస్తూ విలువనిస్తూ ఆ భాషను మాట్లాడాలి.వాడుకలోకి తేవాలి.అభివృద్ధి చేయాలి. </br>
2.అన్ని చట్టాల్నీ తెలుగులోకి అనువాదం చెయ్యాలి.ప్రతి జీవో తెలుగులో జారీ చెయ్యాలి. </br>
3.తెలుగు మీడీయంలో డిగ్రీ చదివిన వారికి 5% ప్రోత్సాహక మార్కులు పోటీ పరీక్షల్లో ఇవ్వాలి.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 50% వీరికే రిజర్వు చెయ్యాలి.కోర్టుల్లో తీర్పులు తెలుగులో రావాలి.  </br>
4.వివిధ ప్రాంతాలలోని జాతీయాలు,యాసలు,సామెతలు,మాండలికాలు సేకరించి సమగ్రమైన తెలుగు -తెలుగు మహా నిఘంటువు తయారు చెయ్యాలి.  </br>
5.రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియం పాటశాలల్ని మాత్రమే నడపాలి.ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండేలా ఆదేశించాలి. </br>
6.తెలుగును దేశంలో రెండవ అధికార భాషగా, ప్రాచీన భాషగా ప్రకటించాలి. </br>
7.లిపి సంస్కరణ జరిపి అక్షరాలను కంపూటర్లకు అనుకూలంగా మార్చాలి.లేదా ఆంగ్ల లిపినే తెలుగుకోసం వాడుకోవాలి.


పై వాటిలో "క్షీణతకు కారణాలు, ఆశాజనకమైన విషయాలు" అన్న భాగాలు నేనే వ్రాసాను. (మిగిలినవి రహమతుల్లాగారు వ్రాశారనుకొంటాను) వీటితో చాలా మంది ఏకీభవిస్తారు గనుక ఇవి సార్వత్రిక విషయాలు అని (అప్పుడు) అనుకొన్నాను. కాని ఏమైనా ఇవి అభిప్రాయాలే. కనుక ఇక్కడ (చర్చా పేజీలో) ఉండడమే సబబు. - (నిన్న 28/8/07న ఈటివి-2 ప్రతిధ్వనిలో వచ్చిన చర్చలో చాలా మంది ప్రముఖులు ఈ అభిప్రాయాలనే వెలిబుచ్చారు!. వాటిని గనుక ఉట్టంకించగలిగితే వీటిని వ్యాసంలోకి మార్చవచ్చును!) - --కాసుబాబు 04:42, 29 ఆగష్టు 2007 (UTC)
నాఅభిప్రాయాన్ని తెలుపుతున్నాను. సరో కాదో తెలియదు. వ్యాసములొ ఉంచడం కంటే ఈ అభిప్రాయలతో ఒక వేరే పేజి ఏర్పాటు చేసి ప్రధాన పేజికి తెలుగు కి లింకు ఇస్తే బాగుంటుందని అనుకొంటున్నాను--మాటలబాబు 04:46, 29 ఆగష్టు 2007 (UTC)
ప్రత్యక పేజీలో రాస్తే దానికి సరైన కాంటెక్స్ట్ (సందర్భము) ఉండక అభిప్రాయాల పేజీ అయ్యి చివరికి తొలగించాల్సి వస్తుంది. వ్యాసాలలో అభిప్రాయాలు ఉండకూడదని కాదు..మన అభిప్రాయాలు ఉండకూడదు. కాసుబాబు గారన్నట్లు సరైన మూలాలతో ఇతరులచేత పలికించవచ్చు --వైజాసత్య 04:56, 29 ఆగష్టు 2007 (UTC)

ఈ టి.వి. చర్చ మూలం అని చివర వ్రాయాలనుకొన్నాను, ఇంతలొ పని పడి భద్రపరచే మీట నొక్కేశా--మాటలబాబు 05:03, 29 ఆగష్టు 2007 (UTC)

ఇలాంటి అభిప్రాయాలకు అంత స్థూలమైన మూలం సరిపోదు. కొంత ఖచ్చితంగా ఉండాలి..ఫలానా వ్యక్తి..ఫలాన దగ్గర ఇలా చెప్పాడు అని తిరిగి వేరిఫై చేసుకునేందుకు వీలుగా రాయాలి. (ఈ ఫలానా వ్యక్తులు కూడా ఏ సుబ్బారావో, వెంకట్రావో అయితే కుదరదు) --వైజాసత్య 05:44, 29 ఆగష్టు 2007 (UTC)

మృతభాషా?

మార్చు

తెలుగు త్వరితగతిన మరణిస్తున్నదని యునెస్కో వారు చెప్పడం చాల ఆందోళనకరము. ప్రతి తెలుగువాడు తననితాను ప్రశ్నించుకోవాల్సిన సమయము ఆసన్నమయింది.Kumarrao 14:34, 9 డిసెంబర్ 2008 (UTC)

త్వరిత గతిన మృతిచెందుతున్న ప్రపంచ భాషలలో ఒకటిగా తెలుగును యునెస్కో చేర్చింది[1].

ఈ వాక్యం ఎవరు చేర్చారో కానీ ఇది సరికాదు. నేను 2001లో ప్రచురితమైన ఈ పుస్తకాన్ని చూశాను. అందులో కోట, కుయి, తొడ లాంటి ద్రవిడ భాషలను ప్రస్తావించారు. కానీ తెలుగు లేదు --వైజాసత్య 08:14, 14 డిసెంబర్ 2008 (UTC)
  1. మృత భాషగా తెలుగు: Stephen Wurm, Atlas of World's Languages in Danger of Disappearing, 2001, p. 35, UNESCO, 978-92-3-103798-6
Return to "తెలుగు/పాత చర్చ 1" page.