చర్చ:పొట్టి శ్రీరాములు
హిందూ పత్రికలో ఉన్న ఇంకో వ్యాసం
మార్చుhttp://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm వ్యాసంలో ఆంధ్రరాష్ట్ర సాధన గురించి చాలా విపులంగా ఉంది. ఆ వ్యాసం కూడా మనకు బాగా ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:30, 18 జూలై 2007 (UTC)
పొట్టి శ్రీరాములు స్వగ్రామం
మార్చుపొట్టి శ్రీరాములు స్వంత గ్రామం "పటమటపల్లె" ఎక్కడ ఉంది? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో పడమటిపాలెం అనే వూరుంది. అదేనా? మరొకటా? తెలిసినవారు స్పష్టం చేయమని మనవి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:17, 25 జూలై 2008 (UTC)
- వ్యాసంలో ఊరి పేరును కాసుబాబుగారు సూచించిన పేరుకి మార్చేస్తున్నాను. అది తప్పని ఎవరికైనా తెలిస్తే మార్చాలని మనవి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 03:12, 15 సెప్టెంబర్ 2008 (UTC)
మరణం గురించి మార్పు రద్దు
మార్చుఇటీవల శ్రీరాములు మరణం గురించిన మూలం లేని సమాచారాన్ని రద్దు చేశాను. ఇది సెన్సిటివ్ సమాచారం కాబట్టి మూలం సాయంతో రాయాలి. అంతేకాక ఈ విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి కానీ సరైన ఆధారం లేదు. పైగా ఈ వ్యాసంలో ముప్పాతిక భాగం ఆయన మరణానంతర అత్యంత సూక్ష్మమైన విషయాలతోనే నిండిపోయింది. దయచేసి ఈసారి మార్పులు చేసేటప్పుడు చర్చా పేజీలో చర్చించండి. - రవిచంద్ర (చర్చ) 06:48, 19 నవంబరు 2021 (UTC)