Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

తెలుగు భాషకు మన ప్రభుత్వము ఇస్తున్న ఆదరణ ఏమిటి

  • ఈ మధ్య నేను గమనించిన విషయము ఒకటి చెపుతున్నాను. మన RTC బస్సుల పైన ముఖ్యము గా అంతర రాష్ట్ర బస్సు ల పైన తెలుగు పేరులు తీసివేసి అంతా ఆంగ్లము లోనికి మార్చివేసారు.ఇలాగైతే మన సంస్కృతి ఇతర రాష్ట్రాల వారికి ఎలా తెలుస్తంది. గరుడ బస్సుల పైన ఒక వైపు గరుడ అని తెలుగు లో రాయవచ్చు కదా? తెలుగు, ఆంగ్లము రెండూ రాయవచ్చు కదా?

--సభ్యుడు: సురేష్ బాబు 12:24, 30 అక్టోబర్ 2007 (IST)

పై చర్చ సభ్యుడి చర్చ పేజికి మార్చబడింది--బ్లాగేశ్వరుడు 07:33, 30 అక్టోబర్ 2007 (UTC)


మీరు చెప్పిన విషయం చాలా బాగానే ఉన్నదికాని, ఈ విషయం గురించి సామాన్య ప్రజలు స్పందించనంతవరకు ఇటువంటి అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి, మన తెలుగు భాషకు ఇటుంవంటి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. చదువుకున్నామనుకునే మనలాంటి వాళ్ళందరమూ కూడా RTC అధికారులకి మన అభిప్రాయాలు ఒక పోస్ట్ కార్డుమీద వ్రాసి పంపిస్తే వారు తప్పకుండా స్పందిస్తారని నా అభిప్రాయం. --SIVA 14:18, 26 జూలై 2008 (UTC)Reply

బిష్ణుప్రియ మణిపురి వికిపిడియా గురించి

  • బిష్ణుప్రియ మణిపురి వికిపిడియా లింకు మొదటిపేజీ "ఇతర భాషలు"లో చేర్చాను. ఇది భారతీయ భాషలలో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నట్లుంది.
  • చదువరి, వైఙాసత్య మొదటి పేజీ డిజైన్ మార్చడానికి పనిచేస్తున్నారనుకొంటాను (వారి ఇసుక పెట్టెలలో తొంగిచూసాను). ఒకసారి http://bpy.wikipedia.org/wiki/ మొదటి పేజీ చూడమని కోరుతున్నాను. వారి డిజైన్ చక్కగా ఉంది.
  • వీవెన్, "వివిధ భారతీయ భాషల వికిపిడియాల తులన"లో ఇది కూడా చేర్చితే బాగుంటుంది.
  • వ్యాసాల సంఖ్యలు పెంచడం నా అభిమతం కాదు. కాని ఒకసారి bpy: చూడదగినది. వారు కొన్ని smart విధానాలు అనుసరిస్తున్నారని నాకు అనిపిస్తున్నది.

--కాసుబాబు 19:33, 9 మే 2007 (UTC)Reply

ప్రస్తుతానికి డిజైన్ మార్చే ప్రయత్నం నేనేదీ చెయ్యట్లేదు. ఇప్పుడున్న డిజైన్ కూడా వీవెన్ రూపొందించినదే. ఆయనైతేనే ఈ పనికి సరి. ఈ కొత్త పేజీ ఆవిష్కరించిన తర్వాత మార్గదర్శిని కొత్తగా రూపొందిస్తే బాగుండని నాకు చాలా సార్లు అనిపించింది.
మణిపురి లోని స్మార్ట్ విధానాల గురించి మీరు కొద్దిగా రాయండి. అందరికీ తెలుస్తుంది. మీరు బాటుతో తయారు చేస్తున్న పట్టణ పేజీల గురించేనా అంటున్నది? దీనికి మూలం ఆంగ్ల వికీలోని బాటు. ఈ బాటు రూపశిల్పికి తెలుగులో కూడా ఖాతా ఉంది. ఆయన మచిలీపట్నం నుండే. తెలుగులో కూడా ఇలాంటి పేజీలు తయారు చేయటానికి అవసరమైన మూసలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో ఎందుకో వెనక్కి తగ్గినట్టున్నారు. కావాలంటే తిరిగి తెలుగు వికీమీద కొంత సమయము కేటాయించమని ఆయన్ను ఆహ్వానించవచ్చు. --వైఙాసత్య 22:42, 9 మే 2007 (UTC)Reply
నా ప్రస్తుత ప్రయోగాలు సహాయం పేజీల మీద, మొదటి పేజీ మీద కాదు! ఎంచేతన్నాగానీ, బిష్ణుప్రియ వారి మొదటిపేజీ నాకంతగా నచ్చలేదు. మన మొదటిపేజీకి విషయాలకు సంబంధించి - నెలల తరబడి దానిలోని విషయం మారడం లేదు. పాతకాపులు నేరుగా ఇటీవలి మార్పులు పేజీకి వెళ్ళినా 90 శాతం మంది మొదటిపేజీకే వెళ్తారు. దానిలో మార్పులేమీ కనబడకపోతే ఓహో పనేమీ జరగడం లేదు కాబోలనుకుంటారు. నా సూచనలు..
  1. విశేష వ్యాసం కనీసం వారానికొక సారి మారాలి.
  2. సుస్వాగతం, మార్గదర్శిని పెట్టెలు కాస్త కిందకి దించి, (వీలైతే కుదించి) వాటి స్థానంలో రోజూ మారే విశేషాలు - ముఖ్యమైన వార్తలు.. మొదలైనవి పెట్టాలి.
  3. మీకు తెలుసా లో కొత్త విషయాలు చేర్చాలి.
  4. బొమ్మలు చాలా తక్కువ ఉండడం తెవికీలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మొదటి పేజీలో వారానికో బొమ్మ - ఈ వారపు బొమ్మ లాగా- ఒకటుండాలి.
  5. అన్నిటికంటే ముఖ్యమైనది.. మనందరం పై మార్పులపై శ్రద్ధ చూపించాలి. ఈ విషయమై నాకు మీ అందరికంటే శ్రద్ధ తక్కువేనని చెప్పాలి.. నా బ్రౌజరు హోమ్ పేజీ ఇటీవలి మార్పులు కావడం చేత నేను కొన్ని రోజుల పాటు మొదటి పేజీకి వెళ్ళను. ఇక ఆ పద్ధతిని మార్చుకుంటాను. __చదువరి (చర్చ, రచనలు) 02:10, 10 మే 2007 (UTC)Reply
కొత్తవాళ్లు మొదటిపేజీకి వెళతారనేది పాతవాళ్లు సులువుగా మరిచిపోయే విషయం. గుర్తుచేసినందుకు థాంక్స్ చదువరి. మీ సలహాలన్నీ పాటించదగినవే. నా వంతుగా విశేష వ్యాసాలను/మొదటి పేజీలో ఉంచదగిన వ్యాసాలను గుర్తించి ఒక జాబితా తయారు చేస్తాను. మీరు కూడా దానికి చేర్చవచ్చు. ఒక చరిత్రలో ఈ రోజులో మిగిలిన తేదీలను కూడా పూరిస్తా. మార్గదర్శిని కిందకుతోసినా ఫర్వాలేదు కానీ కుదించటం ఎదుగుతున్న వికీల్ల్లాంటి తెవికీకి మంచిదికాదని నా ఆలోచన. --వైఙాసత్య 22:38, 10 మే 2007 (UTC)Reply
విశేష వ్యాసాల జాబితా తయారు చేస్తున్నప్పుడు, వ్యక్తుల వ్యాసాలను మాత్రమే కాకుండా మిగతా వ్యాసాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు తెవికీలో చాలా జిల్లా వ్యాసాలు మంచి వ్యాసాలుగా ఉన్నాయి, అంతే కాదు ఎన్నో మంచి మంచి చారిత్ర వ్యాసాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కొద్ది కొద్ది మార్పులతో విశేష వ్యాసాలుగా తీర్చిదిద్దవచ్చు. అంతే కాదు వ్యాసాలను విశేష వ్యాసాలుగా చేసేముందు ఒక ఎన్నికల ప్రక్రియను నిర్వహించటం మంచిదేమో, సభ్యులు పెరుగుతున్నారు కాబట్టి అందరి అభిప్రాయాలు తెలుసుకోగలుగుతాము. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:02, 11 మే 2007 (UTC)Reply
విశేష వ్యాసాల ప్రతిపాదనల కోసం రచ్చబండలో ఇదివరలో ఓ పేజీ మొదలుపెట్టాం. అది పనికొస్తుందేమో చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 12:24, 11 మే 2007 (UTC)Reply
ఆ పేజీ బాగా నే ఉంది కానీ ఎవరయినా ఒక వ్యాసాన్ని ప్రతిపాదించగలిగేలా ఆ పేజీలేదు. ఆ పేజీ ఒక వ్యాసాన్ని విశేష వ్యాసంగా ఎన్నుకునే పేజీగా కంటే వ్యాసాలను మెరుగు పరిచేందుకు ఉపయోగిస్తున్నా వ్యాసంగా కనబడుతుంది. అంతే కాదు అక్కడ చర్చించే సౌలబ్యం కూడ అంతగా బాగాలేదు. అందుకనే వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు అనే పేజీని సృష్టిస్తున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:31, 11 మే 2007 (UTC)Reply
వడ్డాది పాపయ్య, బాపు లాంటి వాళ్ళు చిత్రంచిన కళాఖండాలను (కాపీ హక్కులను పరిగణలోకి తీసుకుని) వికీ కామన్స్‌‌లోకి ఎగుమతి చేసి వాటిని ఇక్కడ మొదటి పేజీలో పెట్టడానికి ప్రయత్నించవచ్చేమో? -- శ్రీనివాస 16:02, 11 మే 2007 (UTC)Reply


మెదటి పేజి బోసి పోయినట్లున్నది

చరిత్రలో ఈ రొజు అనే పెట్టె కు ఎడమ భాగన ఉన్న స్థలంలొ చాలా ఖాళీగా ఉండి మెదటి పేజిలోని ఆ స్థలం బోసి పోయినట్లున్నది.సత్య గారు ఆలోచించి ఎదైన పణాళికా రచన చేసి అక్కడ ఏదైనా క్రొత్త అంశాన్ని పెట్టండి అంశాన్ని పెట్టండి. --మాటలబాబు 22:44, 11 జూన్ 2007 (UTC)Reply

అక్కడ ఈ వారం చిత్రం /ఫొటో అన్న శీర్షిక పెట్టాలని నేను ఇంతకు ముందు సూచించాను. కాని తెలుగు వికీలో ఫొటోలు అందించేవారి కొరత బాగా ఉన్నందున ఆది మొదలు పెట్టడానికి వెనుకాడుతున్నట్లున్నారు. ఒకే ఫొటో ఉంటే మొహం మొత్తుతుంది కదా! దీనికి నా సూచనలు.
  • వీవెన్! రవీ! ముందు మొదలు పెట్టండి. వారం వారం మార్పులగురించి తరువాత చూద్దాము. ఎవరో ఒకరు ముందుకు రాకపోరు.
  • అంతగా అయితె ఆంగ్లవికీనుండి తస్కరిద్దాము. తప్పులేదు.
  • మాటల బాబూ! చెట్టులెక్కగలవా? పుట్టలెక్కగలవా? ఫొటోలు తేగలవా? వారం వారం ఒక ఫొటోను కూర్చి, దానికి అనుబంధంగా కనీసం మూడు పేరాల వ్యాసం వ్రాసే పనిని నీ తలకెత్తుకొనగలవా?

--కాసుబాబు 13:49, 13 జూన్ 2007 (UTC)Reply

ఆంగ్లవికీ లొ ఈ రోజు ప్రదర్శించిన బొమ్మ చూసారా చాలా విశేషంగా ఉంది దానిని తస్కరించాలని కోరికగా ఉంది. దానిని మన వికీ లో పెట్టాడానికి అనుమతి దొరుకుతుందా!!! మెదటి పేజి చర్చాపేజిని నిక్షేపం చేసే సమయం ఆసన్నమైనట్లుంది--మాటలబాబు 10:10, 14 జూన్ 2007 (UTC)Reply
అది GFDL image కనుక కాపీ చేయడానికి మనం మొగమోటపడనవసరం లేదు. కాని బొమ్మతో బాటు వ్యాసాన్ని అనువదిస్తేనే తెలుగు వికీలో ఉంచడానికి అర్ధం ఉంటుంది. లేకపోతే ఇది flickr లాంటి సైటు అవుతుంది. --కాసుబాబు 20:22, 14 జూన్ 2007 (UTC)Reply
నేనుచేస్తా.. ఈ రోజు బొమ్మకి అనుంధంగా ఉన్న విషయాన్ని అనువదించడానికి నేను తయ్యారు.కాని కాసుబాబు గారు మీరు అడిగినట్లు నేను నావంతు ప్రయత్నంచేస్తాను కాని మాట( ప్రతి వారం ఒక బొమ్మ తేవడం వివరించడం) పూర్తిగా నిలబెట్టు కోంటానే అన్న సందేహం వల్లే ఇక్కడ నేను వ్యాఖ్య చెయ్యలేదు. --మాటలబాబు 20:30, 14 జూన్ 2007 (UTC)Reply

మెదటి పేజి సవరణ

మొదటి పేజిని అలా కాకుండా వెరే విధముగా పిలిస్తె బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే పేజి అనే పదం తెలుగు కాదు.

నరసింహ గారూ, ఇక్కడ ఇదే విషయమై అభిప్రాయ సేకరణ జరిగింది చూడండి వికీపీడియా:రచ్చబండ (అనువాదాలు)#మొదటి పుట, ఖాతా --వైజాసత్య 09:03, 5 ఆగష్టు 2007 (UTC)

మార్గదర్శని పట్టు కొని ఎంతమంది వికీ లొనికి వెళ్ళుతున్నారు, దానిని ప్రక్కనుండి క్రిందకు దింపి, వారం వ్యాసాన్ని ఆంగ్ల వికి లాగా ఎడమ ప్రక్కకు తెచ్చి, కుడి వైపు కి మీకు తెలుసా ని పైకి తీసుకొని వస్తే ఎలా ఉంటుందో చర్చ జరపాలి, మెదటి పేజిని బొమ్మలతో రంగులతో ఆకర్షితులను చేయాలి, వచ్చి చూసే వారికి క్రొత్త విషయాలు వ్రాసేటట్లు చేయాలి, రోజుకి ఎంతమంది సభ్యులు గా చేరు తున్నారు,స్వాగతం పేజిని వారి సభ్యత్వపేజికి జత చేయించు కొంటున్నారు , వెళ్తున్నారు. -మాటలబాబు 23:01, 8 జూలై 2007 (UTC)Reply

మార్గదర్శిని ఎంతమంది ఉపయోగిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది. కానీ లేదు. తెవికీలాంటి ఎదుగుతున్న వికీకి మార్గదర్శిని అవసరమని నాకనిపిస్తుంది. అయితే ఇప్పుడది కేవలం గంపెడు లింకులలో చిత్రాలేమీ లేకుండా కళావిహీనంగా ఉన్నమాట వాస్తవమే. అంగ్ల వికీ ఫార్మటు మనకి యధాతధంగా అంత బాగుండదు. కాకపోతే మార్గదర్శిని క్రిందకు దించాలి. ఈ వారం బొమ్మ లాంటిది ఒకటి పెట్టాలని పైన కొన్ని సూచనలు వచ్చాయి. అదీ పరిశీలించవచ్చు. నేను ప్రస్తుతం ఈవారపు వ్యాసానికి తయారుచేసిన ఆటోమేటిక్ పద్ధతిని స్థిరపరచడంలోను, చరిత్రలో ఈ రోజు శీర్షికలో మిగిలిన రోజులు పూరించడం మీద కేంద్రీకరిస్తున్నాను. ఒక నెలరోజుల్లో అవి రెండూ పూర్తవుతాయి. ఆ తరువాత మిగిలిన శీర్షికలమీద కేంద్రీకరించగలను. వార్తలలో.. అన్న శీర్షికను ప్రారంభించవచ్చు కానీ, దాన్ని నిర్వహించేంత వనరులు మనదగ్గర లేవు. కాసుబాబు గారు, చదువరి గారు తిరిగొచ్చిన తర్వాత వార్తలలో శీర్షిక విషయం ఆలోచించవచ్చు. ఇంతకీ కొత్తసభ్యుల గురించి ఏం చేద్దామంటారు? --వైజాసత్య 07:19, 9 జూలై 2007 (UTC)Reply
ఆంగ్ల వికీలో మరియూ, మరాఠీ వికీలో, కొత్త సభ్యులను ఆహ్వానించేటప్పుడు, వారికి ఏదయినా సహాయం కావాలని అనుకుంతే గనక వారి సభ్య పేజీలలో "{{Help me}}" అనో లేక పోతే {{సహాయం కావాలి}} అనో ఒక మూసను తగిలించుకోమంటున్నారు. అలా తగిలించుకున్న వారికి ఆ వికీపీడియాలో ఉన్నా సభ్యులు వచ్చి వారికున్న సందేహాలను తీరుస్తూ ఉంటారు. తెవికీలో ఇది ఎంత వరకూ ఆచరణ యోగ్యమో తెలీదుమరి. అలాగే కొత్తవారిని వ్యాసాలను అభివృద్ది చేయమని చెప్పే బదులుగా, మంచి మంచి వ్యాసాలను ఎక్కడెక్కడ చదువుకోవచ్చో, వినవచ్చో చూపిస్తే బాగుంటుంది. అలా చేయటం వలన కొత్తవారిని చేరిన వెంటనే వారిని బెదరగొటకుండా ఉండవచ్చు :) __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:32, 9 జూలై 2007 (UTC)Reply
హెల్ప్ మీ..అద్బుతమైన ఆలోచన. సఫలీకృతం ఎంతవరకు అవుతుందో కానీ..తప్పుకుండా ఆచరించి చూడాల్సిన ఆలోచన. ఇప్పుడు ఎలాగూ నిరుపయోగమైన వికీపీడియన్లు వర్గం చేర్చుకోమంటున్నాం కదా (అది పనిచేస్తున్నట్లు లేదు). దాని స్థానంలో ఈ వాక్యం చేర్చుదాం. ఇక ఈ రెండో ఆలోచన కూడా బాగుంది. విశేష వ్యాసాలు, ఈ వారపు వ్యాసాలు, శ్రవణ వ్యాసాలు వాళ్లకు చూపించాలి. (అందుకనుగుణంగా స్వాగత సందేశాన్ని మార్చాలి) --వైజాసత్య 07:45, 9 జూలై 2007 (UTC)Reply

మొదటి పేజీ మార్పులు

పై విభాగములో మరియు రచ్చబండలో జరిగిన చర్చల ప్రకారం మొదటిపేజీకి కొన్ని మార్పులు చేశాను. అవి

  1. మార్గదర్శిని కొంత అర్ధవంతముగాను, అందంగానూ తీర్చిదిద్ది పేజీలో క్రిందకు దించాను. ఈ కొత్త మార్గదర్శిని ఇదివరకటి దానిలా కాకుండా వర్గవిహారిణి. ఇందులో కేవలం ఒకమాదిరి వ్యాసపుష్టి మరియు ప్రాముఖ్యత ఉన్న వర్గాలనే చేర్చటం జరిగింది. (వర్గాల లింకులవటం మూలాన పాఠకుల ఒకే క్లిక్కుతో అనేక వ్యాసాలున్నట్టు తెలుస్తుంది. ఒక వర్గంలో వారి అభిరుచిని బట్టి ఒక వ్యాసం ఎంచుకొని చదివే అవకాశం ఉంది).
  2. ఈ వారం బొమ్మ శీర్షికను ప్రారంభించాను. కానీ ఇది ఈ వారపు వ్యాసంలా ఆటోమేటిక్ కాదు. (కాబట్టి మనం మార్చేదాకా మారదు). స్పందనను బట్టి దీన్ని అటోమేటిక్ చెయ్యాలో లేదో నిర్ణయించుకోవాలి.

పై విషయాల్లో కానీ అమరికలో కానీ ఎవైనా మార్పులు చేర్పులు మరింత మెరుగుపరుస్తాయనుకుంటే సూచించగలరు --వైజాసత్య 14:29, 31 ఆగష్టు 2007 (UTC)

క్రొత్త మొదటి పేజీ రూపకల్పన - అభినందనలు

"మొదటి పేజీ" క్రొత్త డిజైను చాలా బాగుంది. వైఙాసత్యకూ, ఇందులో పాల్గొన్న ఇతరులకూ అభినందనలు. "ఈవారం వ్యాసం" మార్పు ఇప్పుడు సజావుగానే సాగుతున్నది. "ఈవారం బొమ్మ" బాధ్యత వేరేవారు తీసుకోవాలి. ఎవరైనా ముందుకు రాగలరా? నా తోడ్పాటు, సూచనలు కూడా త్వరలోనే వ్రాస్తాను. ప్రస్తుతానికి నా ఆలోచన - మనకు క్రొత్త బొమ్మ సిద్ధం కాకపోతే ఆంగ్లవికీనుండి ఒక బొమ్మ తీసుకొని, సంబంధిత వ్యాసం కూడా పనిలో పనిగా అనువదించవచ్చును. కాని అప్పుడు అలాంటి బొమ్మను వికీమీడియా కామన్స్‌లోంచి తెలుగు వికీకి కాపీ చేస్తే మన డేటాబేస్‌లో భద్రంగా ఉంటుందనుకొంటున్నాను. వైఙాసత్యా! వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా లాంటి మూసలాగానే ఈవారం బొమ్మ మూస + పేజీ చేయ గలవా? (చెప్పేవాడికి చేసేవాడు లోకువ!)--కాసుబాబు 14:33, 31 ఆగష్టు 2007 (UTC)

మార్గదర్శిని లోని విజ్ఞానము మరియు సాంకేతికం విభాగంలో గణిత శాస్త్రం ను కూడ చేర్చాలనుకుంటాను.----కంపశాస్త్రి 14:41, 31 ఆగష్టు 2007 (UTC)
కాసుబాబు గారు, తప్పకుండా ఈ వారం బొమ్మ తయారుచేస్తాను. (ఎంతమాట..మీకు పద్ధతి నచ్చాలే గానీ చెయ్యటం అంత కష్టమేమీ కాదు). శాస్త్రి గారూ గణితాన్ని కూడా చేర్చుతాను. --వైజాసత్య 16:30, 31 ఆగష్టు 2007 (UTC)
ఇదిగో వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా జాబితా సిద్ధం --వైజాసత్య 18:01, 31 ఆగష్టు 2007 (UTC)
మార్గదర్శిని లోని భాష మరియు సంస్కృతి విభాగం లో సిక్కు, బౌద్ధ, జైన మతాలను కూడా చేర్చవచ్చు.మిగిలిన మతాలకు చోటు ఇవ్వడం కోసం 'ఇతరమతాలు' అని కూడా చేర్చవచ్చు.----కంపశాస్త్రి 20:30, 2 సెప్టెంబర్ 2007 (UTC)
ప్రస్తుతానికి ఈ మతాలకు పేజీలే లేవు. కాబట్టి ఇప్పుడు వీటిని చేర్చటం అనవసరం. ఆయా మతాలకు సంబంధించిన వ్యాసాలు కూడా అభివృద్ధి చెందింతే అప్పుడు చేర్చవచ్చు --వైజాసత్య 12:35, 3 సెప్టెంబర్ 2007 (UTC)
చిన్న సూచన -
  1. చాలా అందంగా తీర్చి దిద్దబడ్డ మార్గదర్శని మరి క్రిందకు ఉండడం ఏమి బాగాలేదు. మార్గదర్శని పైకి లేపండి. ఈ వారం బొమ్మ క్రిందకు దింపండి. సుస్వాగతం కూడా మార్చడమో కుదించడమో చేయాలి.కాసుబాబు గారు అనట్లు చెప్పేవాడికి చేసేవాడు లోకువ! అని గుర్త్రు చేసుకొంటు వ్రాస్తున్నాను
  2. మార్గదర్శని లొ పై భాగాన ప్రపంచం భారతదేశం తరువాత ఆంధ్ర ప్రదేశ్, తరువాత సంస్కృతి తరువాత సినిమా మొదలైనవి వస్తే బాదుంటుందేమో--మాటలబాబు 12:42, 3 సెప్టెంబర్ 2007 (UTC)

ప్రశ్న

మెదటిపేజి లొని వికీపీడియా అనే వాక్యములొ క లొ ఇకారాము, ప లొ ఈ కారం కనిపించడం లేదు, వికీపీడియా ఖతి సైజు తగ్గించాలేమో--బ్లాగేశ్వరుడు 02:30, 11 అక్టోబర్ 2007 (UTC)

IEలో ఏదైనా పదంలో వత్తులున్న అక్షరాలు ఉన్నప్పుడు, ఆ వ్యాక్యాన్నంతటినీ కొంత పైకి జరుపుతుంది. అయితే ఈ విధంగా ప్రతీసారీ జరగటంలేదు, అప్పుడప్పుడూ వత్తులు లేకపోయినా వాక్యాన్ని పైకి జరుపుతుంది. ఈ bug? వలన "వికీపీడియాకు స్వాగతం" అనే వాక్యంలో "స్వా" ఉండటం వలన ఆ వాక్యం మొత్తం పైకి జరిగి వికీపీడియాలో "ీ"కారాలు ఎగిరి పోయాయి. ఇప్పుడు ఆ వాక్యం పైన కొంత ఖాళీని ఏర్పాటు చేసి సమస్యను నివృత్తి చేసాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:18, 11 అక్టోబర్ 2007 (UTC)
నేను IE నే వాడతాను కాని ఇటువంటి అనుభవం ఎప్పుడు జరగలేదు, నాకు అన్ని అక్షరాలు సరిగానే కనిపిస్తున్నాయి. కాని మెదటిసారిగా పై చెప్పిన విషయం అగుపించింది. దానిని మీరు పరిక్షరిమ్చినందుకు చాలా సంతోషం నాకు ఎక్కువగా మంటనక్క తో నే సమస్యలు ఎదురు అవుతూంటాయి, దానిని వాడరాడని నిశ్చయించుకొన్నాను.తెలుగు అక్షరాలు మెత్తం గజిబిజి అయిపోతాయి మంటనక్క లో --బ్లాగేశ్వరుడు 01:45, 12 అక్టోబర్ 2007 (UTC)

మీకు తెలుసా

"మీకు తెలుసా" లోని సమాచారాన్ని మనం తరచు తాజీకరింపలేకపోతున్నాము. కనుక కొంతకాలం ఈ భాగాన్ని మొదటిపేజీలోంచి తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. మరి కొంత మంది క్రియాశీలక సభ్యులు ఉన్నపుడు మళ్ళీ మొదలుపెట్టవచ్చును.--కాసుబాబు 05:28, 14 నవంబర్ 2007 (UTC)

ఈ వారం గ్రామాలు/ఈ వారం గ్రామం

మొదటి పేజీలో మీకు తెలుసా, చరిత్రలో ఈ రోజు ల తర్యాత క్రింద కాళీ ఉందికదా. ఆ కాళీలో ఒక బాక్స్ పెట్టి దానిలో ఈ వారం గ్రామాలు/ఈ వారం గ్రామం అనే కొత్త శీర్షిక పెడితే ఎలా ఉంటుంది. ఎలాగూ లక్షల గ్రామాలున్నాయి కాబట్టి వాటిలో కొంచెం మంచి సమాచారం ఎక్కువ సమాచారం కలిగిన గ్రామాలను తీసుకొంటే చాలా కాలం వరకూ మేత గురించి వెతికే అవసరం ఉండదు. మొదటి పేజీకొచ్చినవారు తనకు తెలిసిన గ్రామం పేరు ఉంటే అక్కడ కూడా క్లిక్ చేసి చూసే వీలుంటుంది. క్రింద కాళీగానూ, బోసిగానూ లేకుండాకూడా ఉంటుంది. కావాలంటే గ్రామం యొక్క ఒకో పొటోకూడా చేర్చచ్చు(ఉంటే గనుక) పరిశీలించండి...విశ్వనాధ్. 06:56, 14 నవంబర్ 2007 (UTC)

సమస్య అల్లా దానిని తరచు మార్చడం. ప్రస్తుతం ఇది కష్టంగా అనిపిస్తున్నది. కాని ప్రతిపాదన నాకు ఉపయోగకరంగా ఉన్నది. మీరు చెప్పిన బాక్స్ ప్రధానంగా "ఈవారం ఈ గ్రామాన్ని గురించి వ్రాయండి" అన్న ఉద్దేశంతో అనుకొంటాను. కాని గ్రామాలగురించి సమాచారం సేకరించడం అంత తేలిక కాదు అని నాకు అనుభవంలో తెలిసింది. ఈ ప్రతిపాదనను కాస్త మార్చి, "ఈవారం అందరం కలసి ఈ వ్యాసం మెరుగుపరుద్దాం" అన్న ఉద్దేశ్యంతో పెట్టవచ్చును. ('సమైక్య కృషి' మూస ఇప్పటికే ఉంది కాని దానికి అంత ఆదరణ లేదు. దానిని మొదటిపేజీ లోకి తీసుకురావడం ఇప్పటి ప్రతిపాదన). అందులోనే అప్పుడప్పుడూ కొన్ని 'గ్రామాలు' కలుపవచ్చును. ఇలాగైతే కనీసం వారానికొక విశేష వ్యాసం సాధించవచ్చుననుకొంటాను.--కాసుబాబు 07:36, 14 నవంబర్ 2007 (UTC)

మొదటి పేజిలో

మొదటి పేజిలో మిగతా భాషలకు లింకులు చూపించే చోట మొదటిగా ఇంగ్లీషు లింకు ఒక సభ్యుడి సభ్యత్వ పేజికి వెళ్ళుతోంది. పెద్దలు అది గమనించగోరుతున్నాను. అక్కడ రెండు ఇంగ్లీషు లింకులు కానవస్తున్నాయి.--బ్లాగేశ్వరుడు 14:55, 17 నవంబర్ 2007 (UTC)

చిట్కాలు

ఈ వారం చిట్కాను ఈ నాటి చిట్కాతో మర్చాలని మనవి. మరియు ఈ లింకులకు రంగులు అద్దితే ఇంకా సమర్థవంతంగా ఉపయోగపడతాయని నా అభిప్రాయం.---దేవా/DeVచర్చ 02:57, 3 జనవరి 2008 (UTC)Reply

ఈ వారం చిట్కాను ఈ నాటి చిట్కాతో మార్చాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:42, 3 జనవరి 2008 (UTC)\Reply

సాంబశివరావు,

ఆంగ్లము భారతీయ భాషనా?

"భారతీయ భాషలలో వికీపీడియా" బదులు "ఇతర భాషలలో వికీపీడియా" అంటే ఎలా ఉంటుంది? సాయీ(చర్చ) 10:39, 20 మార్చి 2008 (UTC)Reply

ఆంగ్లం భారతీయ భాషే. ఈ భాషను భారతదేశ ప్రభుత్వం హిందీతో పాటుగా అధికారిక భాషగా గుర్తించింది. మరిన్ని వివరాలకు ఆంగ్ల వికీపీడియాలో ఉన్న భారతదేశ అధికారిక భాషల పేజీని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:02, 20 మార్చి 2008 (UTC)Reply
English was not born in India. It's just adopted as a subsidiary official language due to it's widespread popularity ([1]). I don't think it's nice to include English under Indian Languages సాయీ(చర్చ) 11:17, 20 మార్చి 2008 (UTC)Reply
ఇంకొకటి. "పూర్తి జాబితా" నొక్కితే అన్ని భాషల వికీపీడియాలు వస్తున్నాయి. భారతీయ భాషలు మాత్రమే కాదు. సాయీ(చర్చ) 11:23, 20 మార్చి 2008 (UTC)Reply
ఇంగ్లీషుకు అధికార భాషహోదా తీసేసేవరకూ అలాగే ఉంచుదాం మరైతే :) __మాకినేని ప్రదీపు (+/-మా) 11:26, 20 మార్చి 2008 (UTC)Reply

అది జరగని పని. "ఇతర భాషలలో వికీపీడియా" అంటే ఏంటి problem? సాయీ(చర్చ) 03:05, 21 మార్చి 2008 (UTC)Reply

ఆంగ్లము భారతీయ భాషేనండీ! అలా త్రవ్వుకుంటూ వెళితే సంస్కృతము కూడా కాదనవచ్చు! అయినా ఇంగ్లాండు కంటే ఇండియాలోనే ఆంగ్లము తెలిసినవాళ్ళు ఎక్కువాయె! రాజ్యాంగమే ఉంచినది కదా, ఇంక మనం కాదనడాం ఎందుకు ఇప్పుడు? Chavakiran 14:09, 21 మార్చి 2008 (UTC)Reply
Return to "మొదటి పేజీ/పాత చర్చ 3" page.