పెదమద్దాలి

భారతదేశంలోని గ్రామం

పెదమద్దాలి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 390., ఎస్.టి.డి.కోడ్ = 08674.

పెదమద్దాలి
—  రెవిన్యూ గ్రామం  —
పెదమద్దాలి is located in Andhra Pradesh
పెదమద్దాలి
పెదమద్దాలి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′48″N 80°57′12″E / 16.346746°N 80.953256°E / 16.346746; 80.953256
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,490
 - పురుషులు 1,733
 - స్త్రీలు 1,757
 - గృహాల సంఖ్య 1,039
పిన్ కోడ్ 521390
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడరూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరులపాడుమండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

ఈ గ్రామం పామర్రు నుండి 2 కి.మీ., గుడివాడ నుండి 8 కి.మీ., దూరంలో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి

సమీప మండలాలుసవరించు

పెదపారుపూడి, గుడివాడ, వుయ్యూరు, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పామర్రు, గుడివాడ నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 43 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పెదమద్దాలి. సి.బి.ఎన్.సి.పి స్కూల్, పెదమద్దాలి. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కొత్తపెదమద్దాలి.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

పాల కేంద్రం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

కొండాయిపాలెం, పెదమద్దాలి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీమతి ఈడ్పుగంటి వసుంధర, సర్పంచిగా ఎన్నికైనారు.[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయాన్ని 1830లో, ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయానికి 18.44 ఎకరాల సాగుభూమి మాన్యంగా ఉంది. అందులో 11.44 ఎకరాలు, అర్చకుల అధీనంలో ఉంది. మిగిలిన 7 ఎకరాల భూమి దేవాదాయశాఖ అధీనంలో ఉంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం, 180 బస్తాల కౌలు ద్వారా, 1.35 లక్షల రూపాయల ఆదాయం వచ్చుచున్నది. కౌల ద్వారా వచ్చే ఆదాయం, ఆలయ నిర్వహణకే సరిపోవడంలేదు. పురాతనమైన ఈ ఆలయం శిథిలమవడంతో, ఒక కోటి రూపాయల అంచనాతో పునర్నిర్మాణం చేయడానికి దేవాదాయశాఖవారికి నిధుల కొరకు ప్రతిపాదనలు పంపించారు.[4]

ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, 2016,మే-18 నుండి 21 వరకు వైభవంగా నిర్వహించెదరు.[5]

శ్రీ ఉద్దండవేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయాన్ని 1836లో, 40 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయానికి 16.11 ఎకరాల సాగుభూమి మాన్యంగా ఉంది. అందులో 6.20 ఎకరాలు, అర్చకుల అధీనంలో ఉంది. మిగిలిన 9.91 ఎకరాల భూమి దేవాదాయశాఖ అధీనంలో ఉంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం, 1.70 లక్షల రూపాయల ఆదాయం వచ్చుచున్నది. కౌల ద్వారా వచ్చే ఆదాయం, ఆలయ నిర్వహణకే సరిపోవడంలేదు. పురాతనమైన ఈ ఆలయం శిథిలమవడంతో, ఒక కోటి రూపాయల అంచనాతో పునర్నిర్మాణం చేయడానికి దేవాదాయశాఖవారికి నిధుల కొరకు ప్రతిపాదనలు పంపించారు. [3]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి (మే నెలలో) మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ రామసాయి మందిరంసవరించు

ఈ ఆలయ వార్షికోత్సవం, 2016,మే-2వతేదీ సోమవారంనాడు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు, మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.[6]

శ్రీ గొంతేనమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయంలో గొంతేనమ్మగా పిలువబడే కుంతీదేవి వార్షిక జాతర మహోత్సవాలు, 2016,నవంబరు-20వతేదీ ఆదివారంనాడు, 21వతేదీ సోమవారంనాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి గ్రామంలోని ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని ఈ ఆలయంలో 150 సంవయత్సరాల నుండి ఈ జాతర మహోత్సవం క్రమం తప్పకుండా నిర్వహించుచున్నారు.[7]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ గ్రామ శివారులోని కొండాయిపాలెం గ్రామంములో ఉన్న ఈ ఆలయంలో, 2017,ఆగస్టు13వతేదీ ఆదివారంనాడు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామస్థులు అమ్మవారికి, టెంకాయలు, పసుపు కుంకుమలు చల్ది నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.[8]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరకు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారితవృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

 • కాకి మాధవరావు
 • మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి.
 • గవర్నర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు.
 • ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత చలసాని గోపి.
 • ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత చలసాని అశ్వనీ దత్తు.
 • ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత, ఎన్.టి.ఆర్.సోదరుడు, నందమూరి త్రివిక్రమరావు అత్తగారి ఊరు గూడా ఇదే.
 • కాకి సునీత:- ఈ గ్రామానికి చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అయిన కాకి మాధవరావు కుమార్తె కాకి సునీత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈమె ఆకర్షణీయ గ్రామాల సందర్శనలో భాగంగా, ప్రతి ఐ.యే.ఎస్.అధికారీ, ఒక గ్రామాన్ని దత్తర తెసుకోవాలనే ప్రభుత్వ ఉత్తరువుల నేపథ్యంతో, తన స్వగ్రామమయిన పెదమద్దాలి గ్రామాన్ని దత్తత తెసుకొన్నది. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా, ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి అభివృద్ధి చేయడం ప్రారంభించింది.
 • ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ యార్లగడ్డ హరీష్ చంద్రప్రసాద్.

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 3,490 - పురుషుల సంఖ్య 1,733 - స్త్రీల సంఖ్య 1,757 - గృహాల సంఖ్య 1,039

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3544.[9] ఇందులో పురుషుల సంఖ్య 1770, స్త్రీల సంఖ్య 1774, గ్రామంలో నివాస గృహాలు 947 ఉన్నాయి.

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Pedamaddali". Archived from the original on 27 మార్చి 2019. Retrieved 30 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
 3. ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-13; 27వపేజీ.
 4. ఈనాడు అమరావతి; 2016,జనవరి-20; 23వపేజీ.
 5. ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-12; 1వపేజీ.
 6. ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-3; 1వపేజీ.
 7. ఈనాడు అమరావతి/పామర్రు; 2016,నవంబరు-22; 2వపేజీ.
 8. ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఆగష్టు-14; 1వపేజీ.
 9. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులుసవరించు