చాంద్రాయణగుట్ట

(చాంద్రాయణ గుట్ట నుండి దారిమార్పు చెందింది)

చాంద్రాయణ గుట్ట (చెన్నరాయుని గుట్ట),[1] హైదరాబాదు నగర దక్షిణ భాగంలో ఉన్న ఒక పేట.[2] ఒక పక్క నేషనల్ పోలీస్ అకాడెమీ, మరో పక్క రక్షణ శాఖ వారి కచేరీలు, దక్షిణాన కేంద్ర ప్రభుత్వ పోలీస్ శాఖ వారి ప్రధాన కార్యాలయంతో కూడుకున్న ఈ ప్రదేశం దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సంబంధిత వ్యక్తుల నివాసాలకు నెలవు. 2022 ఆగస్టు 27న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చేతులమీదుగా ఇక్కడ చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభించబడింది.[3]

చాంద్రాయణగుట్ట

ముఖ్యమయిన బస్తీలు సవరించు

ఈ పేటలోని ముఖ్యమయిన బస్తీలు :

ఈ ప్రదేశానికి ఉత్తరంగా ఫలక్నామా, దక్షిణంగా పహాడీ షరీఫ్, తూర్పువైపుకి సంతోష్ నగర్ (కంచన్ బాగ్), పడమరకు శివరాంపల్లి ఉన్నాయి. ఈ ప్రదేశం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషను పరిధిలో ఉంది. సౌత్ డివిజన్, ఫలక్నుమా జోన్ కింద వస్తుంది. రెవెన్యూ ప్రకారం బండ్లగూడ మండలం కింద వస్తుంది.

ముఖ్యమయిన ప్రదేశాలు సవరించు

  • చెన్నకేశవస్వామి ఆలయం, కేశవగిరి
  • రామలింగేశ్వర స్వామి-గుట్ట మల్లేశ్వర స్వామి ఆలయం, కేశవగిరి
  • దేవీ దేవాలయం, కుమ్మర బస్తీ
  • పూరీ జగన్నాథ్ మఠం
  • ఏకనాథ్ స్వామి దేవాలయం
  • సీఅర్‍పీఎఫ్ క్యాంపస్
  • పీలీ దర్గా

విద్యా సంస్థలు సవరించు

ఈ పేటలో ఉన్న విద్యా సంస్థలు:

విశేషాలు సవరించు

నిజాం కాలం నాటి బస్తీలు. నేటికీ అరబ్బుల రాకపోకలు. అరబ్ వంటాకాల కొలువులు.

మూలాలు సవరించు

  1. దక్కన్ లాండ్, హైదరాబాదు (1 October 2020). "పట్నంలో షాలిబండా". www.deccanland.com. పరవస్తు లోకేశ్వర్‍. Archived from the original on 14 January 2021. Retrieved 14 January 2021.
  2. Chandrayangutta PS Archived 5 ఏప్రిల్ 2015 at the Wayback Machine
  3. Namasthe Telangana (27 August 2022). "చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి మహమూద్‌ అలీ". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.

వెలుపలి లంకెలు సవరించు