చింతపిక్కల నూనె
చింత చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది.ఆంగ్లంలో టామరిండ్ (Tamarind) అంటారు.[1].వృక్షశాస్త్రనామం:టామరిండస్ ఇండికా.సాధారణ పేర్లు:మరాఠీలో చించ్ (chich) ;మలయాళం లలో పులి (puli) ;కన్నడలో హూలి; బెంగాలి, గుజరాతిలలో అమ్లి; హింది, పంజాబిలలో ఇమ్లి/చించ్‍పాల/తింతిదిక (tintidika) [2] చింతచెట్లు బయలు ప్రదేశాలలో పెరుగును.బాటల కిరువైపుల పెంచెదరు.కొన్నొచోట్ల గుంపుగా చింత తోట/తోపులుగా పెంచెదరు.మైదాన ప్రాంతాలంతా వ్యాప్తిచెందివువుంది. దేశంలో ఆంధ్ర ప్రదేశ్, బెంగాల్, బీహరు, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, హిమాలయ దిగువ పరిసర ప్రదేశాల్లో వ్యాపిచెందివుంది. చింతపిక్కల నుండి చింతపిక్కల నూనె తీయుదురు. చింతపిక్కలో 7-8% వరకు నూనె లభించును. చింత పుట్టుకస్థానం భారతదేశం కాదు.ఆఫ్రికాఖండపు ఉష్ణప్రాంతమండలంసూడాన్,, మడగాస్కర్లోని ఆకురాల్చుఆడవులు[2]
చింతగింజసవరించు
చింతకాయలోని చింతగింజ వెలుపల ముదురు కాపీగింజ రంగులో వున్న పలుచని, పెలుసైన పెంకు (shell) ను కల్గివుండును. లోపల లేత క్రీం రంగులో రెండు చింత పిక్కలు/బద్దలుండును. చింతగింజ పరిమాణం 1.5 x 0.8 సెం.మీ.వుండును. ఒక చింతకాయలో 4-5 వరకు చింతగింజ లుండును. చింతకాయల నుండి చింతపండును ప్రధానంగా ఉత్పత్తి చేస్తారు. చింతపండు రసాన్ని వంటలలో కూరలలో పులుపురుచి నిచ్చుటకై వాడెదరు. చింతపిక్కల పొడిని కాటన్ వస్త్రాల తయారిలో సైజింగ్ చేయుటకు, గమ్, అడ్హెసివ్స్ తయారిలో వుపయోగిస్తారు. చింత పిక్కల బ్రౌన్ రంగున్న పై పెంకును కాఫి పొడిలో కల్తిగా కొందరు వ్యాపారులు కలుపుతారు.
చింతపిక్కలోని సమ్మేళనాల శాతము(%)సవరించు
సమ్మేళన పదార్థం | గింజలో | నూనెతీసిన తరువాత |
నూనె | 7.0-8.0 | 0.6-1.0 |
ప్రొటిన్ | 7.6 | 19.0 |
పాలిసాకరైడులు | 51.0 | 55.0 |
పీచు పదార్థం | 1.2 | 1.1 |
తేమ శాతం | 7.1 | 7.0 |
సాండ్/సిలికా | 0.4 | .05 |
నూనె తీయువిధానము[3]సవరించు
చింతపిక్కలను మొదట రోస్టరు పెనంలో పైకాఫిరంగు పెంకు వదులుగా అయ్యేటట్లు వేయించెదరు. అటుపిమ్మట చింతగింజలను బీటరుయంత్రానికి పంపి పైపెంకును తొలగించెదరు.పైపెంకు తొలగించిన చింత పిక్కలను సీడ్ బ్రేకరు యంత్రం ద్వారా చిన్నచిన్న ముక్కలుగా చేయుదురు. ఇలా ముక్కలుగా చేసిన చింతపిక్కలను కుక్కరుకు పంపి స్టీము ద్వారా కుకింగ్ చేసి చింతపిక్కలు మెత్తగా, మృదువుగా అయ్యృటట్లు చేయుదురు.ఇలా కుకింగ్ అయిన పిక్కలను ఫ్లేకరు యంత్రం ద్వారా ఫ్లేక్సుగా తయారు చేయుదురు. తాయారైన ఫ్లేక్సుఎక్కవతేమను (15-18%) కల్గివుండి,80-850C డిగ్రిల ఉష్ణోగ్రతలో వుండును.ఈఫ్లేక్సును ఫ్లేక్సు కూలరులో చల్లార్చి, తేమను 10-11%కు తగ్గించి సాల్వెంట్ ఎక్సుట్రాక్సను ప్లాంటునకు పంపెదరు.అచ్చట హెక్సెను అను హైడ్రోకార్బను ద్రావణిని (ఆల్కేను గ్రూపునకు చెందినది) ఉపయోగించి చింత పిక్కలనుండి నూనెను సంగ్రహించెదరు.నూనె తొలగించిన చింతపిక్కల పొడిలోని హెక్సెను వేపరులను తొలగించి, పొడిపరచి (Drying, గది ఉష్ణోగ్రతకు చల్లబరచి బస్తాలలో/సంచులలోనింపి నిల్వచేయుదురు.
చింతపిక్క నూనె యొక్క పదార్ధములు,భౌతిక లక్షణాలుసవరించు
సాల్వెంట్ ఎక్సుట్రాక్సను ద్వారా తీసిన చింతపిక్కల నూనె ముదురు గోధుమ (బ్రౌన్) రంగులో వుండును.రిపైనరిలో బ్లిచింగ్ చేసిన లేత పసుపురంగులో వుండును. కొద్దిగా వేరుశనగ నూనెకు దగ్గరగా భౌతిక, రసాయనిక లక్షణాలను ప్రదర్శించును.[4]
చింతపిక్క నూనెలోని కొవ్వు ఆమ్లాలశాతము(%)సవరించు
కొవ్వుఆమ్లము | శాతము |
లారిక్ ఆమ్లం | 0.3 |
మిరిస్టిక్ ఆమ్లం | 0.4 |
పామిటిక్ ఆమ్లం | 8.7-14.8 |
స్టియరిక్ ఆమ్లం | 4.4-6.6 |
అరచిడిక్ ఆమ్లం | 3.7-12.2 |
లిగ్నొసెరిక్ ఆమ్లం | 4.0-10.0 |
ఒలిక్ ఆమ్లం | 19.6-27.0 |
లినొలిక్ ఆమ్లం | 7.5-55.4 |
లినొలెనిక్ ఆమ్లం | 2.8-5.6 |
చింతపిక్క నూనెభౌతిక లక్షణాలుసవరించు
భౌతిక/రసాయనిక గుణము | విలువ/మితి |
తేమశాతము | 0.25% |
వక్రీభవగుణకము/సూచిక | 1.4600-1.4700 |
సపొనిఫికేసన్ విలువ | 184-196 |
అయోడిన్ విలువ | 100-120 |
ఆసిడ్ విలువ, గరిష్ఠం | 20 |
అన్‍సపోనిఫియబుల్ పదార్థం %, గరిష్ఠం | 3.0 |
నూనె ఉపయోగాలుసవరించు
- రిపైండు చేసినతరువాత వంటనూనెగా వాడవచ్చును.
- సబ్బులతయారిలో వినియోగించవచ్చును.
- వనస్పతి తయారిలో వినియోగించవచ్చును
- రంగుల తయారిలో వినియోగించవచ్చును.
- వార్నిషుల తయారిలో కూడా వాడెదరు.
- దీపపునూనె (Lamp oil) గా కూడా వాడవచ్చును.
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "Tamarind Seeds". http://www.agriculturalproductsindia.com/seeds/seeds-tamarind-seeds.html. Retrieved 7-2-2014.
- ↑ 2.0 2.1 "Tamarind". www.flowersofindia.net/. http://www.flowersofindia.net/catalog/slides/Tamarind.html. Retrieved 7-2-2014.
- ↑ "Extraction Of Oil From Tamarind Seeds". www.niir.org/. http://www.niir.org/profiles/profile/1553/extraction-oil-from-tamarind-seeds.html. Retrieved 7-2-2014.
- ↑ "Tamarind Seed". www.crirec.com/. http://www.crirec.com/2011/01/tamarind-seed/. Retrieved 7-2-2014.