చింతామణి (1956 సినిమా)
1956 తెలుగు సినిమా
కాళ్ళకూరి నారాయణరావు వ్రాసిన నాటకం చింతామణి ఆధారంగా ఈ సినిమాను భరణి పిక్చర్స్ సంస్థ పి.యస్.రామకృష్ణారావు దర్శకత్వంలో నిర్మించింది. ఎన్.టి.రామారావు, పి.భానుమతి, జమున, ఎస్.వి.రంగారావు మొదలైన వారు నటించిన ఈ సినిమా 1956, ఏప్రిల్ 11వ తేదీన విడుదలయ్యింది.
చింతామణి (1956 సినిమా) (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.యస్.రామకృష్ణారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, పి.భానుమతి, జమున, ఎస్.వి.రంగారావు, రేలంగి, కె.రఘురామయ్య, అమర్‌నాథ్ |
సంగీతం | ఆది నారాయణరావు, టి.వి. రాజు |
నిర్మాణ సంస్థ | భరణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు, నిర్మాత, కూర్పు : రామకృష్ణ
- మూలకథ: కాళ్ళకూరి నారాయణరావు
- చిత్రానువాదం, సంభాషణలు: రావూరు వెంకట సత్యనారాయణరావు
- సంగీతం: అద్దేపల్లి రామారావు
- నేపథ్య సంగీతం: టి.వి.రాజు
- నృత్యాలు: ఛోప్రా, వేదాంతం జగన్నాథశర్మ
- ఛాయాగ్రహణం: శ్రీధర్
- కళ: సి.హెచ్.ఇ.ప్రసాదరావు
నటీనటులు
మార్చుపాత్ర | పాత్రధారి |
---|---|
చింతామణి | భానుమతి |
రాధ | జమున |
బిళ్వమంగళుడు | ఎన్.టి.రామారావు |
భవానీ శంకరుడు | ఎస్.వి.రంగారావు |
సుబ్బిశెట్టి | రేలంగి |
కృష్ణుడు, సాధువు | కల్యాణం రఘురామయ్య |
దామోదరుడు | అడ్డాల నారాయణరావు |
వాసుదేవమూర్తి | వక్కలంక కామరాజు |
బ్రాహ్మణుడు | ఆర్.వి.కృష్ణారావు |
పెద్దిశెట్టి | బొడ్డపాటి కృష్ణారావు |
గోవిందు | కృష్ణప్రసాద్ |
అక్కన్న | వెంకటరత్నం |
శ్రీహరి | ఋష్యేంద్రమణి |
రుక్మిణి | ప్రభావతి |
చిత్ర | లీలారాణి |
మణి | ఛాయాదేవి |
నర్తకి | లక్ష్మీకాంత |
పాటలు
మార్చు- అర్ధాంగలక్ష్మి ఐనట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు (పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- అందాలు చిందేటి ఆనందసీమా రాగాలతూగే శృంగారమేమో - పి.భానుమతి, ఎ. ఎం.రాజా, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- ఇంట రంభలవంటి ఇంతులుండగ సాని సంపర్కముగోరు ( పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- ఇందవ సుందరీమణులకాత్మవిభుండె జగత్రయంబు (పద్యం) - పి. లీల
- ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రాణలెంతలేసి సామంతులాడినన్ (పద్యం) - పి.భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- ఎంత దయో చింతలపై పంతంబున పులుసుగాచి పడిపడి దాగెన్ (పద్యం) - రేలంగి , రచన: కాళ్ళకూరి నారాయణరావు
- కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతాని మాయాజాలమే - కె. రఘురామయ్య, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం నాసాగ్రే - ఘంటసాల, రచన: శ్రీకృష్ణ కర్ణామృతం
- కలి రోజులు వచ్చి కళ్ళు మూసుకుపోయి చల్లగ సాని ఇంటికి (పద్యం) - రేలంగి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- కష్ట భరితంబు బహుళ దుఖ:ప్రదంబు సారరహితమైన(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- కలిగిన భాగ్యమెల్లను మొగంబున తెచ్చితి ఇప్పుడు (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- కాళిందీపుళినే తమాలనిబిడిఛ్చాయే (పద్యం) - ఘంటసాల, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- చల్లని మేనితోడ చిరునవ్వులు పర్వులిడంగడుంత (పద్యం) - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము (పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- చూచిన వేళ ఎట్టిదియో చూడక యుండిన నిన్నేకమియున్ దోచదు(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- జయజయా సుందరా వనమాలి జయ బృందావనా - ఘంటసాల,పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణ రావు
- తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం) - కె. రఘురామయ్య, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- తల్లిరొ నీదువాదమృత ధారలు చేరికొనంగజేసె(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా - పి.లీల, రచన:కాళ్ళకూరి
- తాలిమి భూమికీడైన దాని వివేకమునన్ మదాలసంబోలిన దానిన(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి
- తాతలనాటి క్షే త్రములెల్ల తెగనమ్మి దోసిళ్ళతొ తెచ్చిపోసినాను (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- తనియధనుడు రూపసి యొప్పనివాడు వివేకి మూఢభావుడు (పద్యం) - పి.లీల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- తీయని వేణువు ఊదిన దారుల పరుగిడు రాధనురా పదముల - పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- దివ్య స్ధలమంబగు తిరుపతి కొండను కోతిమూకను పాదుకొల్పినావు (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- నలువురు నోట గడ్డియిడ నవ్వులబుచ్చితి అగ్గివంటి (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- నను దేవేంద్రునిగా నొనర్తుననియెన్ నన్నేమియోగించి ఆతని ( పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్లకూరి నారాయణరావు
- పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై(పద్యం) - కె. రఘురామయ్య, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) - కె. రఘురామయ్య, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- పాపిని బ్రష్టురాల నటిబానిసనై బహునీచవృత్తిలో (పద్యం) - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి
- పున్నమీ చకోరినయీ తేవోయి హాయి జాబిలి - పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- బాలాయే నీలావకుచే నవకింకిణీక ఛాయాభిరామా ( పద్యం) - పి. భానుమతి
- భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం) - కె.రఘురామయ్య, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- మేలాయే నీవేళ శ్రీ వేణుగోపాలా నీసాటి ఎవరోయి సామీ - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి
- మౌనులు సతతమున్ భజింపగనిపింపన్‌బూని నీవెటులో (పద్యం) - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- రంగైన రవ్వనురా బంగరు మువ్వనురా నీపైన మోహమురా - సుశీల
- రావోయి రావోయి ఓ మాధవా అందాల రాధ అలిగింది వేగ రావోయి - పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
- విడిచితి బంధువర్గముల వీడిత ప్రాణములోగ్గు మిత్రులను (పద్యం) -మాధవపెద్ది,రచన:కాళ్ళకూరి
- సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమున్ ( పద్యం) - పి.లీల, రచన: భాగవతం నుండి .
- నల్లని మేనితోడ చిరునవ్వులు(పద్యం), భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
- శాస్త్రములెల్లను చదివిన లెస్సయా మనస్సు(పద్యం) కె.రఘురామయ్య
- హైందవ సుందరీమణులకాత్మ విభుండే జాగ్రత్త(పద్యం), పి.లీల, రచన: కాళ్లకూరి.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)