పి.ఎస్. రామకృష్ణారావు
పి.యస్.రామకృష్ణారావు (అక్టోబర్ 12, 1918 - సెప్టెంబరు 7, 1986) తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి.
పి.ఎస్. రామకృష్ణారావు | |
---|---|
![]() పి.ఎస్. రామకృష్ణారావు | |
జననం | |
మరణం | 1986 సెప్టెంబరు 4 | (వయసు 67)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | రామకృష్ణ |
వృత్తి | చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1936-1968 |
గుర్తించదగిన సేవలు | లైలా మజ్ను, విప్రనారాయణ, చింతామణి, బాటసారి, గృహలక్ష్మి |
జీవిత భాగస్వామి | భానుమతి రామకృష్ణ |
పిల్లలు | భరణి |
జననం మార్చు
రామకృష్ణారావు 1918, అక్టోబర్ 12 న కర్నూలులో జన్మించాడు. కర్నూలు, మదనపల్లి, బందరులలో విద్యాభ్యాసం చేశాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్గా మారాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.
హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమగా మారిందని జోక్ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
మరణం మార్చు
రామకృష్ణారావు 1986, సెప్టెంబరు 4 న అమెరికాలోని న్యూ జెర్సీలో మరణించాడు.[1]
చిత్ర సమాహారం మార్చు
దర్శకునిగా మార్చు
- గృహలక్ష్మి (1967)
- వివాహ బంధం (1964)
- అనుబంధాలు (1963)
- ఆత్మబంధువు (1962)
- బాటసారి (1961)
- కణల్ నీర్ (1961) (తమిళం)
- శభాష్ రాజా (1961)
- మనమగళ్ థెవై (1957) (తమిళం)
- వరుడు కావాలి (1957)
- చింతామణి (1956)
- విప్రనారాయణ (1954)
- చక్రపాణి (1954)
- బ్రతుకు తెరువు (1953)
- కాథల్ (1952) (తమిళం)
- ప్రేమ (1952)
- లైలా మజ్ఞు (1949)
- రత్నమాల (1947)
నిర్మాతగా మార్చు
- గృహలక్ష్మి (1967)
- వివాహబంధం (1964)
- బాటసారి (1961)
- వరుడు కావాలి (1957)
- చింతామణి (1956)
- విప్రనారాయణ (1954)
- చక్రపాణి (1954)
- చండీరాణి (1953)
- ప్రేమ (1952)
- లైలా మజ్ఞు (1949)
- రత్నమాల (1947)
రచయితగా మార్చు
- గృహలక్ష్మి (1967)
బయటి లింకులు మార్చు
మూలాలు మార్చు
- ↑ జి.వి.జి. (26 September 1986). "డా.భానుమతి భర్త శ్రీ పి.ఎస్.రామకృష్ణారావు అస్తమయం" (PDF). ఆంధ్ర సచిత్రవారపత్రిక. Archived from the original (PDF) on 13 సెప్టెంబర్ 2022. Retrieved 13 September 2022.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help)