చిన్నారి పాపలు అనేది 1968 లో వచ్చిన సినిమా. వీరమాచనేని సరోజిని రచించి, నిర్మించగా సావిత్రి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో జమున, జగ్గయ్య, షావుకారు జానకి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ధనవంతుడు గిరిజన అమ్మాయితో ప్రేమలో పడే కథ. వారు విడిపోయినప్పుడు ఈ జంట జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చెబుతుంది.

చిన్నారి పాపలు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం సావిత్రి
నిర్మాణం వీరమాచనేని సరోజిని
కథ వీరమాచనేని సరోజిని
తారాగణం జగ్గయ్య,
జానకి,
శాంతకుమారి,
సూర్యకాంతం,
రేలంగి,
రమాప్రభ
సంగీతం పి.లీల
నృత్యాలు రాజసులోచన
ఛాయాగ్రహణం సింగ్, శేఖర్
కూర్పు ఎం.ఎస్.ఎన్. మూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ మాతా పిక్చర్స్
విడుదల తేదీ ఆగష్టు 14, 1968
భాష తెలుగు

చిన్నారి పాపలు శ్రీ మాతా పిక్చర్స్ సంస్థకు తొలి చిత్రం. సావిత్రికి దర్శకురాలిగా తొలి చిత్రం. దీని సిబ్బందిలో ఎక్కువగా మహిళలే. దర్శకత్వం సావిత్రి, నిర్మాణం-రచన సరోజిని, సంగీత దర్శకత్వం పి. లీల, ఆర్ట్ డైరెక్టర్ మోహన, నృత్యాలు రాజసులోచన. ఛాయాగ్రహణం సింగ్, శేఖర్, కూర్పు ఎంఎస్ఎన్ మూర్తి దీనికి మినహాయింపులు.

కథసవరించు

మహేష్ అనే ధనవంతుడు అడవిలోకి ప్రవేశించాడు. అక్కడకు, అతను గరిక అనే గిరిజన అమ్మాయిని కలుసుకుని, ప్రేమలో పడతాడు. తన తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న తరువాత, అతను అడవిని విడిచి ఇంటికి వెళ్తాడు. కాని తిరిగి వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు. కానీ అతని తల్లి పార్వతి అనే మహిళతో అతడి పెళ్ళి ఖాయం చేస్తుంది. మహేష్ గరికకు ఇచ్చిన వాగ్దానం గురించి తన తల్లికి చెబుతాడు. అతను తిరిగి అడవికి వెళ్ళాక, వరదల కారణంగా ఆ కుగ్రామం మొత్తం కొట్టుకుపోయిందని తెలుసుకుంటాడు. గరిక మరణించినట్లు కూడా తెలుస్తుంది. మనస్తాపానికి గురైన అతను ఇంటికి తిరిగి వచ్చి పార్వతిని పెళ్ళి చేసుకుంటాడు. గరిక ప్రాణాలతో బయటపడి కొడుకు నాగరాజుకు జన్మనిస్తుంది. పార్వతి నందిని అనే కుమార్తెకు జన్మనిస్తుంది. గరిక మహేష్ ను వెతుక్కుంటూ నగరానికి వచ్చి పార్వతిని కలుస్తుంది. ఆమె తన కుటుంబ జీవితానికి భంగం కలిగించవద్దని చెబుతుంది. అదే రోజు గరిక చనిపోతుంది. నాగరాజును మహేష్ సంరక్షణలో ఉంచుతారు. అది పార్వతికి నచ్చదు. అయితే నందినిని రక్షించిన తరువాత నాగరాజు తన ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు, ఆమె పశ్చాత్తాపపడి అతని కోసం ప్రార్థిస్తుంది. నాగరాజు తన కొడుకు అని తోటమాలి మహేష్ కి చెబుతాడు.

తారాగణంసవరించు

విడుదల, వ్యాపారంసవరించు

చిన్నారి పాపాలు 1968 జూన్ 21 న విడుదలైంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. దాని పెట్టుబడిలో నాలుగవ వంతు కూడా తిరిగి పొందలేకపోయింది. అయితే, ఇది విమర్శకుల ప్రశంసలను అందుకుంది 1968 లో రెండవ ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. దీన్ని తరువాత తమిళంలో కుజాండై ఉల్లం (1969) గా, సావిత్రి దర్శకత్వంలో నిర్మించారు.[1]

మూలాలుసవరించు

  1. Jeyaraj, D.B.S. (7 July 2018). "Nadigaiyar Thilagam" Savitri: Biographical Movie About The Rise and Fall of a "Mahanati" (Great Actress).