చిన్ని చిన్ని ఆశ

చిన్ని చిన్ని ఆశ 1999 లో వచ్చిన సినిమా. దీనిని లక్ష్మి సాయి శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై తలసాని శంకర్ యాదవ్, లింగాశెట్టి లక్ష్మణ్ గౌడ్, అథైలీ శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 1966 లో వచ్చిన తెలుగు చిత్రం మనసే మందిరం, నుండి స్ఫూర్తి పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నమోదైంది.[1]

చిన్ని చిన్ని ఆశ
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
ఇంద్రజ,
నిత్యాశెట్టి
సంగీతం రాజ్
నిర్మాణ సంస్థ లక్ష్మిసాయి శ్రీనివాస ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

రాజా (రాజేంద్ర ప్రసాద్) & ఆశ (ఇంద్రజ) ప్రేమ పక్షులు. వారి నిశ్చితార్థానికి ముందు, అతను రక్త క్యాన్సరని, మరణశయ్యపై ఉన్నాననీ రాజా తెలుసుకుంటాడు. అయితే, ఆశ అతన్ని బలవంతంగా పెళ్ళి చేసుకునేలా చేస్తుంది. ఆశ యొక్క ఆశ, విశ్వాసం రాజాను మరణ ద్వారం నుండి ఎలా రక్షిస్తుందనేది మిగతా కథ.

తారాగణం మార్చు

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఓ అభిసారికా"సినారెఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం5:07
2."మల్లెపూల జల్లులే"సాహితిమ్నో, సుజాత4:38
3."ఒలేలే ఒలేలే"సినారెఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, బేబీ దీపిక4:17
4."ఆ వంక చూసుకో"సాహితిమనో, సింధు4:15
5."ఈ మనీషా"సాహితిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:42
మొత్తం నిడివి:22:59

మూలాలు మార్చు

  1. "Chinni Chinni Aasa (Review)". Tollywood Times.com. Archived from the original on 2016-08-16. Retrieved 2020-08-30.