మన్నవ బాలయ్య

సినీ నటుడు
(Redirected from ఎం. బాలయ్య)
మన్నవ బాలయ్య

మన్నవ బాలయ్య గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడు లో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు[1].[2] బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశాడు.

చిత్రరంగముEdit

మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించాడు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశాడు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించాడు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చాడు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 2000 సంవత్సరములో తీసిన "పల్లెవాసం-పట్నవాసం"కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది.

నటించిన చిత్రాలుEdit

ఇతడు నటించిన సినిమాల పాక్షిక జాబితా:

1950లుEdit

1960లుEdit

1970లుEdit

1980లుEdit

1990లుEdit

2000లుEdit

2010లుEdit

నిర్మించిన చిత్రాలుEdit

మూలాలుEdit

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 50
  2. "హ్యాపీ బర్త్ డేస్ - ఆల్‌ రౌండర్‌ బాలయ్య ఆంధ్రప్రభ 2011 ఏప్రిల్ 8". మూలం నుండి 2011-09-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-07-16. Cite web requires |website= (help)