చిరంజీవి రాంబాబు

చిరంజీవి రాంబాబు 1978, మార్చి 11న విడుదలైన సాంఘిక చిత్రం. ఈ సినిమాకు తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించగా పద్మజా పిక్చర్స్ బ్యానర్‌పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించాడు.

చిరంజీవి రాంబాబు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ప్రకాశరావు
తారాగణం రంగనాథ్,
మంజుల (నటి)
నిర్మాణ సంస్థ పద్మజ పిక్చర్స్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు

రామాపురం ప్రెసిడెంటు రాఘవరావు. ఆయన భార్య రత్నమ్మ గయ్యాళి. వారి పుత్రరత్నం రంగడు గారాల బాబు. రత్నమ్మ సవితి రమ్ముడు రాంబాబు తన తల్లి చనిపోవడంతో తన సవితి అక్క దగ్గరకు చేర్చబడతాడు. రత్నమ్మ రాంబాబును రాచిరంపాన పెడుతుంది. బడిలో పంతులమ్మ శారదను అక్కా అని పిలుస్తుంటాడు. రాఘవరావు తమ్ముడు మధు శారదను ప్రేమిస్తాడు. కనకారావు అనే వడ్డీవ్యాపారి అడ్డు వచ్చినా మధు, శారదల వివాహం అవుతుంది. రత్నమ్మ, కనకారావు కలిసి రాంబాబుపైనా, శారదపైనా కుట్రలు పన్నుతారు. మధు మూలంగా వడ్డీవ్యాపారం దెబ్బతిన్న కనకారావు గ్రామంలో సహకార గిడ్డంగులను పేల్చివేయడానికి పథకం వేస్తాడు. అది తెలిసిన రాంబాబు మధుకు చెప్పడానికి వెడుతూ రంగడి మూలకంగా పోలీసుల పాలవుతాడు[1].

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
అమ్మ అన్నమాట కమ్మనైన పాట వీటూరి జె.వి.రాఘవులు పి.సుశీల
ఏడనో పుట్టింది ఏడనో తిరిగింది ఏడనో కలిసింది గోదారి వీటూరి జె.వి.రాఘవులు జె.వి.రాఘవులు
నీనామమెంతో మధురము కాదా పావనమైనది నీ గాధా వీటూరి జె.వి.రాఘవులు పి.సుశీల
లావొక్కింతయు లేదు (పద్యం) బమ్మెర పోతన జె.వి.రాఘవులు రమణ
చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ అది చూసి మురవాలి తల్లిదండ్రులు గోపి జె.వి.రాఘవులు పి.సుశీల బృందం
నువ్వా దేవుడివీ రాతి గుడిలో దాగితివీ గోపీ జె.వి.రాఘవులు పి.సుశీల
కాయి రాజా కాయి రాజా చేయి దాటిపోకుండ చూడు రాజా కొసరాజు జె.వి.రాఘవులు వాణీ జయరాం

మూలాలు

మార్చు
  1. వి.ఆర్. (17 March 1978). "చిత్ర సమీక్ష చిరంజీవి రాంబాబు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 64, సంచిక 338. Retrieved 9 January 2018.[permanent dead link]

బయటి లింకులు

మార్చు