చిలకలపూడి (మచిలీపట్నం)

భారతదేశంలోని గ్రామం

చిలకలపూడి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 002., ఎస్.టి.డి.కోడ్ = 08672.

చిలకలపూడి (మచిలీపట్నం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,178
 - పురుషులు 1,077
 - స్త్రీలు 1,101
 - గృహాల సంఖ్య 576
పిన్ కోడ్ 521002
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు. చిలకలపూడి గ్రామం మచిలీపట్టణానికి దగ్గరలో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

శ్రీనివాస నగర్ కాలని, రామరాజుపాలెం, ఆకులమన్నాడు

సమీప మండలాలుసవరించు

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. శ్రీ వరలక్ష్మీ పాలిటెక్నిక్.
  2. ఎన్.ఎఫ్.ఎస్.ఏ.నిర్మల ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు, 2016,జనవరి-9న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, ఈ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్ధం, 2,000 లీటర్ల సామర్ధ్యం గల 3 లక్షల రూపాయల విలువగల ఆర్.వో.ప్లాంటును వితరణగా అందజేసినారు. [5]
  3. ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాల:- 2016లో ఈ పాఠశాల శతజయంతి ఉత్సవాలను జరుపుకొనుచున్నది. [6]

గ్రామానికి రవాణా సదుపాయంసవరించు

రైలుసవరించు

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం:- 11 సంవత్సరల నుండి వృద్ధులకు ఉచితంగా సేవలందించుచున్న ఈ అశ్రమానికి నూతన భవన నిర్మాణానికి, స్థానిక చిలకలపూడి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న, సంపత్ కుమారి దంపతులు అందజేసిన స్థలంలో, 2015,డిసెంబరు-17వ తేదీ గురువారం ఉదయం 9-25 గంటలకు శంకుస్థాపన నిర్వహించారు. [3]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

పాండురంగస్వామి దేవాలయంసవరించు

ఈ దేవాలయం మంగినపూడి బీచ్ కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురములో ఉన్న దేవాలయము వలే ఇక్కడ దేవాలయము ఉంటుంది.కంసాలి (విశ్వబ్రాహ్మణ) కులస్తులే పౌరోహిత్యం చేస్తారు.భక్తులను గర్భ గుడిలోకి అనుమతిస్తారు.స్వామివారి పాదాలను పట్టుకోనిస్తారు. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, కార్తీకఏకాదశి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహించెదరు. ఏకాదశి రోజున విఘ్నేశ్వర పూజతో మొదలగును. ద్వాదశిరోజున స్వామివారి కళ్యాణం, త్రయోదశి రోజున రథోత్సవం, చతుర్దశి రోజున ఘంటశాల గానామృతం, కార్తీకపౌర్ణమి రోజున నిర్వహించెదరు. అన్నసమారాధన, కార్తీకస్నానాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా పండరీభజనలు, కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

శ్రీ కొండపల్లి పాండురంగారావు, స్వాతంత్ర సమరయోధులు.

గ్రామ విశేషాలుసవరించు

శ్రీ నరహరిశెట్టి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ:- వీరు పరుగుల గాంధీగా సుపరిచితులు. తాజాగా వీరు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల నిర్వహించిన 35వ మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పరుగు పందెంలో పోటీలలో, 60+ విభాగంలో పాల్గొని 10 కి.మీ. 5 కి.మీ.పోటీలలో 2 స్వర్ణ పతకాలు, 1,500 మీటర్ల పందెంలో రజత పతకం సాధించారు. [4]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 822.[1] ఇందులో పురుషుల సంఖ్య 418, స్త్రీల సంఖ్య 404, గ్రామంలో నివాసగృహాలు 188 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 2,178 - పురుషుల సంఖ్య 1,077 - స్త్రీల సంఖ్య 1,101 - గృహాల సంఖ్య 576

కృష్ణవేణి కలాశాల అధినేత. కె. రమెష్.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-2; 10వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-18; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2016,జనవరి-3; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2016,జనవరి-10; 4వపేజీ.