చూసి చూడంగానే

శేష సింధు రావు దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

చూసి చూడంగానే 2020, జనవరి 31న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శేష సింధు రావు దర్శకత్వం వహించాడు.[2] శివ కందుకూరి,[3] వర్ష బొల్లమ్మ,[4][5] మాళవిక సతీశన్‌ తొలిసారిగా నటించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు.

చూసి చూడంగానే
Choosi Chudangane Movie Poster.jpeg
చూసి చూడంగానే సినిమా పోస్టర్
దర్శకత్వంశేష సింధు రావు
నిర్మాతరాజ్ కందుకూరి
నటవర్గంశివ కందుకూరి
వర్ష బొల్లమ్మ
మాళవిక సతీశన్‌
ఛాయాగ్రహణంవేద రమణ
రవితేజ గిరిజాల
కూర్పువేద రమణ
రవితేజ గిరిజాల
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థ
ధర్మపథ క్రియేషన్స్
పంపిణీదారులుసురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2020 జనవరి 31 (2020-01-31)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశంసవరించు

తల్లిదండ్రుల బలవంతంతో ఇంజనీరింగ్‌లో చేరిన సిద్ధు (శివ కందుకూరి), ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. ఇంజనీరింగ్‌ చివర్లో ఐశ్వర్య సిద్ధును వదిలేస్తుంది. ఆ డ్రిపెషన్‌తో ఇంజనీరింగ్‌ పూర్తిచేయకుండా మూడేళ్లు కష్టపడి వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్‌ అవుతాడు. ఆ సమయంలో ఒక పెళ్లిలో శృతిని (వర్ష) చూసి ప్రేమిస్తాడు. అయితే, శృతి ఇంజనీరింగ్‌లోనే సిద్ధును ప్రేమిస్తుందికానీ, ఆ విషయం సిద్ధుకు చెప్పదు. ఇదే సమయంలో శృతి బాయ్‌ఫ్రెండ్‌ విరాట్‌ వచ్చి ప్రపోజ్‌ చేయడంతో శృతి కూడా ఓకే చెపుతుంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా. విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేది మిగతా కథ.[6][7]

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: శేష సింధు రావు
 • నిర్మాత: రాజ్ కందుకూరి
 • సంగీతం: గోపి సుందర్
 • ఛాయాగ్రహణం, కూర్పు: వేద రమణ, రవితేజ గిరిజాల
 • నిర్మాణ సంస్థ: ధర్మపథ క్రియేషన్స్
 • పంపిణీదారు: సురేష్ ప్రొడక్షన్స్

నిర్మాణంసవరించు

2019, జనవరిలో చిత్రీకరణ ప్రారంభమై 2019, ఏప్రిల్ నెలలో చిత్రీకరణ పూర్తయింది.[9] జాతీయ అవార్డు గ్రహీత, పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో చిత్రాల నిర్మాత, రాజ్ కందుకూరి ధర్మపాత క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాడు.

పాటలుసవరించు

Untitled

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు. మధుర ఆడియో ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి.[10]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నీ పరిచయంతో (రచన: అనంత శ్రీరామ్)"అనంత శ్రీరామ్సిద్ శ్రీరామ్3:36
2."వెనకనే ఉన్నా (రచన: అనంత శ్రీరామ్)"అనంత శ్రీరామ్చిన్మయి4:49
3."నీడే నాకు నేను (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిగోపి సుందర్3:36
4."తూరుపు జాడలో (రచన: విశ్వ)"విశ్వఎల్.వి. రేవంత్3:12
5."ఏమైందో తెలుసా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రికాల భైరవ, నూతన మోహన్4:04
Total length:19:17

విడుదలసవరించు

ఈ చిత్రం 2020, జనవరి 31న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలయింది.[1]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Choosi Choodangaane: Shiva Kandukuri's debut film to release on Jan 31". The Times of India. 2 January 2020. Retrieved 6 February 2020.
 2. "Raj Kandukuri's son Shiva makes his debut with Choosi Choodangaane". The Times of India. 4 August 2019. Retrieved 6 February 2020.
 3. "Shiva Kandukuri's character from 'Choosi Choodangaane'". The Times of India. 19 August 2019. Retrieved 6 February 2020.
 4. "Choosi Choodangaane is a triangle love story that has many layers underneath: Varsha Bollamma". The Times of India. 30 January 2020. Retrieved 6 February 2020.
 5. సాక్షి, సినిమా (31 January 2020). "ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే!". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
 6. సాక్షి, సినిమా (31 January 2020). "'చూసీ చూడంగానే' మూవీ రివ్యూ". Archived from the original on 6 February 2020. Retrieved 7 February 2020.
 7. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: చూసీ చూడంగానే." Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 7 February 2020.
 8. "A listless narration, held afloat by an effervescent Varsha Bollamma". The Hindu. 1 February 2020. Retrieved 7 February 2020.
 9. "Choosi Choodangaane: Shoot of Shiva Kandukuri's debut film wraps up, post-production begins". The Times of India. 5 August 2019. Retrieved 6 February 2020.
 10. "Choosi Choodangaane Music Review". IndiaGlitz. 10 December 2019. Retrieved 6 February 2020.

ఇతర లంకెలుసవరించు