జనతా గ్యారేజ్
జనతా గ్యారేజ్ 2016 సెప్టెంబరు 1 న విడుదలైన తెలుగు చిత్రము.
జనతా గ్యారేజ్ | |
---|---|
దర్శకత్వం | కొరటాల శివ[1] |
రచన | కొరటాల శివ |
నిర్మాత | యెర్నెని నవీన్ వై. రవి శంకర్ సి.వి. మొహన్ |
తారాగణం | మోహన్ లాల్ జునియర్ ఎన్.టి.ఆర్ సమంత ఉన్ని ముకుందన్ నిత్య మేనన్ |
ఛాయాగ్రహణం | తిర్రు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఎరోస్ ఇంటర్‌నేషనల్ |
విడుదల తేదీ | 1 సెప్టెంబరు 2016 |
సినిమా నిడివి | 162 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹55 కొట్లు[2][3] |
బాక్సాఫీసు | est. ₹135 కోట్లు[4] |
కథ
మార్చుసత్యం (మోహన్‌లాల్) ఓ మెకానిక్. తమ్ముడు (రెహమాన్)తో పాటు హైదరాబాద్‌లో ఓ గ్యారేజ్ నడుపుతుంటాడు. దాని పేరే '‘జనతా గ్యారేజ్ '. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడ్ని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్ (ఎన్టీఆర్)ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారేజ్‌కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్‌కి అసలు తనకంటూ ఓ కుటుంబం ఉందని కూడా తెలియకుండా పెంచుతాడు మేనమామ. ఆనంద్‌కి ప్రకృతి అంటే ఇష్టం. చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు. అందుకోసం ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకీ ముంబైలో శత్రువులు పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల ఆనంద్ తొలిసారి హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు. దానికి కారణం ఏమిటి? సత్యం తన పెదనాన్న అని ఆనంద్‌కు తెలిసిందా? లేదా? జనతా గ్యారేజ్‌కి ఆనంద్ అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ కథలో కొనసాగుతాయి.
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గీత రచన | Artist(s) | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ప్రణామం" | రామజోగయ్య శాస్త్రి | శంకర్ మహదేవన్ | 04:00 | |||||
2. | "రాక్ ఆన్ బ్రో" | రామజోగయ్య శాస్త్రి | రఘు దీక్షిత్ | 04:08 | |||||
3. | "ఆపిల్ బ్యూటీ" | రామజోగయ్య శాస్త్రి | యజిన్ నిజర్ , నేహా భాసిన్ | 03:52 | |||||
4. | "జయహో జనత" | రామజోగయ్య శాస్త్రి | సుఖ్వీందర్ సింగ్ , విజయ్ ప్రకాష్ | 04:18 | |||||
5. | "నీ సెల్వదిగి" | రామజోగయ్య శాస్త్రి | శ్వేతా మోహన్ | 01:38 | |||||
6. | "పక్కా లోకల్" | రామజోగయ్య శాస్త్రి | గీతా మాధురి , సాగర్ | 04:19 | |||||
22:17 |
తారాగణం
మార్చు- ఆనంద్‌గా జూనియర్ ఎన్టీఆర్
- సత్యంగా మోహన్‌లాల్
- బుజ్జిగా సమంత
- అనుగా నిత్యమేనన్
- రాఘవా సత్యంగా ఉన్ని ముకుందన్
- కె. చంద్ర శేఖర్‌గా సాయి కుమార్ (పోలీస్ కమీషనర్, అను తండ్రి)
- పద్మా సత్యంగా దేవయాని
- శివగా రెహమాన్
- బొస్గా అజయ్
- శంకర్‌గా బ్రహ్మాజీ
- రియాగా విదిశ
- నంజై ఆశిష్ విద్యార్థి
- సయ్యద్ సోహైల్ - "ప్రణామం" పాటలో అతిధి పాత్ర
- జాన్ కొక్కెన్
సాంకేతికవర్గం
మార్చు- సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
- ఛాయాగ్రహణం: తిరు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాతలు: నవీన్ ఎర్నేని. . రవిశంకర్.. సీవీ మోహన్
- రచన - దర్శకత్వం: కొరటాల శివ
పురస్కారాలు
మార్చుఉత్తమ సహాయ నటుడు, మోహన్ లాల్, నంది పురస్కారం
సైమా అవార్డులు
మార్చు2016 సైమా అవార్డులు
- ఉత్తమ నటుడు
- ఉత్తమ సంగీత దర్శకుడు
- ఉత్తమ గీత రచయిత (రామజోగయ్య శాస్త్రి - ప్రణామం)
మూలాలు
మార్చు- ↑ "Koratala Siva's Remuneration for Jr NTR's film?". Chitramala. Archived from the original on 6 నవంబరు 2015. Retrieved 2 నవంబరు 2015.
- ↑ Hooli, Shekhar H (31 ఆగస్టు 2016). "'Janatha Garage' total pre-release business: Jr NTR-Mohanlal-Samantha beats 'Srimanthudu,' 'Nannaku Prematho' record". International Business Times. Retrieved 4 సెప్టెంబరు 2016.
- ↑ FE Online (2 సెప్టెంబరు 2016). "'Janatha Garage' box office collections: Jr. NTR, Mohanlal starrer rakes in Rs 210 crore on opening day". The Financial Express (India). Retrieved 4 సెప్టెంబరు 2016.
- ↑ "Janatha Garage 1st weekend box office collection: Jr NTR's film surpasses Rs 135 crore mark in 32 days". IBTimes. 3 అక్టోబరు 2016. Retrieved 7 అక్టోబరు 2016.