స్ర్తి పాత్రలను పురుషులు పోషించడం సాధారణం.. కానీ పురుష పాత్రలను స్ర్తిలు పోషించడం అసాధారణం.. ఆ అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసింది జమునా రాయలు రంగస్థల మణిహారంలో మరో ఆణిముత్యం ప్రస్తుతం అప్రతిహతంగా రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు జమునా రాయలు. ఆంధ్ర దేశ నాటక రంగ చరిత్రలో సురభి సమాజానికి ఉన్న ప్రాభవం, ప్రజలలో సురభి కళాకారులకు ఉన్న అభిమానం, ఆదరణ మరువలేనివి.. అలాంటి సురభి కుటుంబం నుంచి వచ్చిన కళాకారిణి శ్రీమతి జమునా రాయలు. నాలుగు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం ఉంది. బాల్యంలో బుర్రకథలు, హరికథలు చెప్పిన ఈవిడ సురభి సంస్థ ప్రదర్శనలో చాలా నాటకాల్లో నటించారు.

జమునా రాయలు
200px
జమునా రాయలు
జననంజమునా రాయలు
1960 జనవరి 22
ఇతర పేర్లునట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల
వృత్తిసురభి నాటక సమాజం
ప్రసిద్ధిరంగస్థల కళాకారిణి,బుర్రకథ, హరికథ కళాకారిణి
భార్య / భర్తసురభి రాయలు
తండ్రివనారస కొండలరావు
తల్లివసుంధరాదేవి


రంగస్థలం మీద పురుషులతో సమానంగా శైశవ దశలోనే రంగస్థలం మీద అడుగుపెట్టినస్త్రీలలో సురభి సంస్థకు చెందిన స్ర్తిలే ముఖ్యులు. ఆ స్ర్తిలలో మొదటివారు సురభి కమలాబాయి.. కామాక్షి బాయి, పద్మావతీ బాయి, నీలవేణి బాయి, భువన లక్ష్మీబాయి, అనసూయ ఆ తరువాత ఎందరో సురభి కుటుంబ స్త్రీలు రంగస్థలం పై రాణించినవారే. ఒక ఊరులోనో, ఒక ప్రదేశంలోనో ఆగిపోయి అక్కడే స్థిరపడడం కాదు.. ఊరూరు పర్యటిస్తూ నాటక ప్రదర్శనలు ఇవ్వడం సురభి వారి సంప్రదాయం. అలా గుంటూరులో సురభి సమాజం ఉన్న రోజుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలిలో మె 1960 జనవరి 22 న శ్రీమతి వసుంధరాదేవి, వనారస కొండలరావు దంపతులకు జన్మించారు జమునా రాయలు. విద్యాభ్యాసం అంతగా లేకున్నా చక్కటి ఉచ్ఛారణా, భావయుక్తమైన డయలాగ్ డెలివరీ ఆమె సొంతం. ఈమె అద్భుతంగా పద్యాలు పాడగలరు. పాటలు, పద్యాలు పాడడానికి సంగీతం నేర్చుకోవడం ప్రధానం కాదు. గాత్రం భగవంతుడిచ్చిన వరం.. పాట తల్లిదండ్రుల వారసత్వం, నా పెదబావగారు అయిన గజపతి రాజ కళామండలి మేనేజరుగారి శిక్షణ అని చెప్పే జమునా రాయలు గళం ఎంత పాడితే ముగ్ధులవని ప్రేక్షకులుండరు. వీరి స్వరంలో వీర, క్రోధ, రౌద్ర, శృంగార, కరుణ రసాలు అలవోకగా పలుకుతాయి. 8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం బ్రతుకుతెరువుగా మలచుకుని, చిన్నారి భజస్కంధాలమీద కుటుంబ బాధ్యతలు మోయవలసి రావడం ఒకవిధంగా బాధాకరమైనా అదే నేడు తనకి సమాజంలో ఒక స్థాయినిచ్చిందని అంటారు జమునా రాయలు. మేనమామ సురభి రాయలునే వివాహమాడి, అటు పిల్లల బాధ్యతను మోస్తూనే ఇటు రంగస్థల కళాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం స్థాపించుకున్న జమునా రాయలు యుక్త వయస్కురాలు అయాక వేసిన మొదటి పాత్ర చింతామణిలో శ్రీకృష్ణుడు పాత్ర. ఆ తరువాత ఆమె శ్రీకృష్ణుడిగా అనేకమార్లు నటించారు. ఆమెకి ఎంతో ఇష్టమైన పాత్ర శ్రీకృష్ణపాత్ర, ద్రౌపది పాత్ర అని చెప్పారు జమునా రాయలు. ఆమె కేవలం నటే కాదు దర్శకురాలు కూడా. వీరి దర్శకత్వంలో వచ్చిన శశిరేఖాపరిణయం నంది పురస్కారమే కాక అనేక పురస్కారాలను, బహుమతులనూ అందుకుంది. సత్యభామ స్వాతిశయం, సక్కుబాయి భక్త్భివం, చంద్రమణి సౌమ్యం, రాధలోని ప్రేమ భావం అద్భుతంగా పోషించగల దిష్ట జమునా రాయలు. సత్యభామగా ఆంజనేయరాజుగారితో, రాధగా పీసపాటితో, సుధేష్ణగా వేమూరి రామయ్యతో ఇలా అనేక మంది ప్రముఖులతో నటించే అదృష్టం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా చెప్తారు జమునా రాయలు. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఒదిగి నటించి రాణించి మెప్పించే జమునా రాయలు ఆధునిక రంగస్థల మహిళకు ఆదర్శం. అభినయం, గాత్రం సమానంగా కలిగిన జమునా రాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు పొందారు.

స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు.

సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు.

నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పొందారు.

మూలాలుసవరించు

  • జమునా రాయలు, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 42.

యితర లింకులుసవరించు