సుమధుర కళానికేతన్
సుమధుర కళానికేతన్ విజయవాడలోని నాటక సంస్థ. 1973లో ప్రారంభించబడిన ఈ సంస్థ, 1995 నుండి తెలుగు హాస్య నాటిక పోటీలను నిర్వహిస్తుంది.[1][2][3]
22వ తెలుగు హాస్య నాటికల పోటీలు - 2017
మార్చుసుమధుర కళానికేతన్ వారి 22వ తెలుగు హాస్య నాటికల పోటీలు 2017, ఆగస్టు 4,5,6 తేదీలలో విజయవాడ లోని సిద్దార్థ కళాశాలలో జరిగాయి.[4]
పురస్కారాలు
మార్చు- జంధ్యాల స్మారక పురస్కారం - గిరిబాబు (నటుడు, దర్శకుడు)[5]
- కీ.శే. శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం - వంకాయల సత్యనారాయణమూర్తి (రంగస్థల, సినీ నటుడు)
- కీ.శే. రాధాకుమారి స్మారక పురస్కారం - సరోజ (రంగస్థల, సినీనటి)
పరిషత్తు వివరాలు - నాటికలు
మార్చుతేది | సమయం | నాటిక పేరు | సంస్థ పేరు | రచయిత | దర్శకుడు |
---|---|---|---|---|---|
04.07.2017 | సా. గం. 5.30 ని.లకు | వామ్మో గుత్తొంకాయ్ | బాలాజీ ఆర్ట్స్, కానూరు | వీర్ల వరప్రసాద్ | భాస్కర్ వెనిగళ్ళ |
04.07.2017 | రా. గం. 7.30 ని.లకు | అక్క అలుగుడు..చెల్లి సణుగుడు | అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట | అద్దేపల్లి భరత్ కుమార్ | షఫీ |
04.07.2017 | రా. గం. 8.30 ని.లకు | తొక్క తీస్తా | గణేష్ ఆర్ట్ థియేటర్స్, గుంటూరు | వరికూటి శివప్రసాద్ | వరికూటి శివప్రసాద్ |
05.07.2017 | సా. గం. 5.30 ని.లకు | సరితా... స్వాతిముత్యం | కథనం క్రియేషన్స్, పామర్రు | పి.ఎన్.ఎం. కవి | పి.ఎన్.ఎం. కవి |
05.07.2017 | సా. గం. 6.30 ని.లకు | సుందరి-సుబ్బారావు | నవరస, కాకినాడ | ఎస్.ఎస్.ఆర్.కె. గురుప్రసాద్ | ఎస్.ఎస్.ఆర్.కె. గురుప్రసాద్ |
05.07.2017 | సా. గం. 7.30 ని.లకు | వెన్నెలొచ్చింది | మల్లాది క్రియేషన్స్, హైదరాబాద్ | శంకరమంచి పార్థసారధి | మల్లాది భాస్కర్ |
05.07.2017 | సా. గం. 8.30 ని.లకు | ఒక్కోరోజు ఇంతే | శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ | ఉదయ్ భాగవతుల | ఉదయ్ భాగవతుల |
06.07.2017 | సా. గం. 5.45 ని.లకు | అనగనగా ఓ ఆఫీస్ | గీతాంజలి థియేటర్స్, విజయవాడ | బి.వి. శ్యాంప్రసాద్ | వడ్డాది సత్యనారాయణ |
06.07.2017 | సా. గం. 6.45 ని.లకు | టేక్ ఇట్ ఈజీ | మురళీ కళానిలయం, హైదరాబాద్ | శంకరమంచి పార్థసారధి | తల్లావజ్జుల సుందరం |
బహుమతుల వివరాలు
మార్చు- ఉత్తమ ప్రథమ ప్రదర్శన: అక్క అలుగుడు...చెల్లి సణుగుడు (అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట)
- ఉత్తమ ద్వితీయ ప్రదర్శన: టేక్ ఇట్ ఈజీ (మురళీ కళానిలయం, హైదరాబాద్)
- ఉత్తమ తృతీయ ప్రదర్శన: తొక్క తీసారు (గణేష్ ఆర్ట్ థియేటర్స్, గుంటూరు)
- ఉత్తమ రచన: శంకరమంచి పార్థసారధి (టేక్ ఇట్ ఈజీ)
- ఉత్తమ దర్శకత్వం: షఫీ (అక్క అలుగుడు...చెల్లి సణుగుడు)
- ఉత్తమ నటుడు: వరికూటి శివప్రసాద్
- ఉత్తమ నటి: లహరి గుడివాడ (అక్క అలుగుడు...చెల్లి సణుగుడు)
- ఉత్తమ రంగాలంకరణ: పిఠాపురం బాబూరావు (సుందరి..సుబ్బారావు)
- ఉత్తమ సంగీతం: లీలామోహన్ (సరితా..స్వాతిముత్యం)
- ఉత్తమ ఆహార్యం: మోహన్ (సరితా..స్వాతిముత్యం)
- ప్రోత్సహక బహుమతి: జానీపాషా (అక్క అలుగుడు...చెల్లి సణుగుడు), విజయ (సుందరి..సుబ్బారావు), మురళీధర్ తేజోమూర్తుల (వెన్నెలొచ్చింది)
22వ తెలుగు హాస్య నాటికల పోటీలు - 2019
మార్చుసుమధుర కళానికేతన్ వారి 22వ తెలుగు హాస్య నాటికల పోటీలు 2019, జూలై 26,25,28 తేదీలలో విజయవాడ లోని మొగల్రాజపురంలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో జరిగాయి.[6][7]
పురస్కారాలు
మార్చు- జంధ్యాల స్మారక పురస్కారం - బెనర్జీ (సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత)
- కీ.శే. శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం - గోపరాజు రమణ (రంగస్థల, టీవీ, సినీ నటుడు)
- కీ.శే. రాధాకుమారి స్మారక పురస్కారం - జమునా రాయలు (రంగస్థల నటి, దర్శకురాలు)
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "హాస్యానికి చిరునామా సుమధుర :మండలి బుద్ధ ప్రసాద్". Retrieved 31 January 2018.
- ↑ ప్రజాశక్తి (30 July 2016). "హాస్యంతోనే ఆరోగ్యం". Retrieved 31 January 2018.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (30 July 2016). "విజయవాడలో హాస్యాన్ని పండించిన సుమధుర నాటికలు". Retrieved 31 January 2018.
- ↑ సెల్ న్యూస్. "వీనులవిందుగా సుమధుర నాటకోత్సవాలు". www.cellitnews.com. Retrieved 31 January 2018.[permanent dead link]
- ↑ ప్రజాశక్తి (7 August 2017). "గిరిబాబుకు జంధ్యాల స్మారక పురస్కారం". Retrieved 31 January 2018.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, కృష్ణా జిల్లా (28 July 2019). "ఆద్యంతం హాస్యపు జల్లులే." Archived from the original on 22 January 2020. Retrieved 22 January 2020.
- ↑ The New Indian Express, Vijayawada (26 July 2019). "Sumadhura comedy drama festival to begin today". www.newindianexpress.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.