జహీరాబాదు రెవెన్యూ డివిజను
జహీరాబాదు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సంగారెడ్డి జిల్లాలోవున్న నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి.[1] ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[2] ఈ డివిజను ప్రధాన కార్యాలయం జహీరాబాదు పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం, జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
జహీరాబాదు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]
పరిపాలన
మార్చుజహీరాబాదు డివిజనులోని మండలాలు:[5]
క్ర.సం | జహీరాబాదు రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | జహీరాబాద్ మండలం | 23 రెవెన్యూ గ్రామాలు |
2 | మొగుడంపల్లి మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
3 | న్యాల్కల్ మండలం | 31 రెవెన్యూ గ్రామాలు |
4 | ఝరాసంగం మండలం | 35 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
5 | కోహీర్ మండలం | 23 రెవెన్యూ గ్రామాలు |
6 | రాయికోడ్ మండలం | 37 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
మూలాలు
మార్చు- ↑ "Revenue Divisions | District Sangareddy, Government of Telangana | India". www.sangareddy.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-20. Retrieved 2022-07-29.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-07-21.
- ↑ "Telangana Sangareddy District Revenue Divisions, Mandals TS GO 239". Teacher4us. 2016-10-16. Archived from the original on 2022-07-18. Retrieved 2022-07-21.
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-07-21.