పట్లోళ్ల నర్సింహారెడ్డి

పట్లోళ్ల నర్సింహారెడ్డి (1931 - ఆగష్టు 13, 2018) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ ఎమ్మెల్యే. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1989 నుండి 1994 వరకు జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

పట్లోళ్ల నర్సింహారెడ్డి
జననం1931
మరణంఆగష్టు 13, 2018
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధిభారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు, మాజీ ఎమ్మెల్యే.
మతంహిందూ
పిల్లలుముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు
తండ్రిలక్ష్మారెడ్డి
తల్లినర్సమ్మ

జననం - విద్యాభ్యాసం

మార్చు

నర్సింహారెడ్డి 1931లో లక్ష్మారెడ్డి, నర్సమ్మ దంపతులకు సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలంలోని పిచరగడ్ గ్రామంలో జన్మించాడు. 4వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో గుర్జువాడలో, 5నుంచి 7వ తరగతి వరకు కోహిర్ లో, 8నుంచి హైదరాబాద్‌లో నర్సింహారెడ్డి విద్యాభ్యాసం కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయములో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ పట్టా పొందాడు.

ఉద్యోగం

మార్చు

1958-62 మధ్యకాలంలో జహీరాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

జయప్రకాశ్ నారాయణ్ ఆహ్వానం మేరకు 1951లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నర్సింహారెడ్డి, 1971నుంచి 1976 వరకు మెదక్‌ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1972లో కాంగ్రెస్‌ పార్టీ తరపున మెదక్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా, 1978లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[2] 1994లో భారతీయ జనతా పార్టీ చేరి కొంతకాలం రాష్ట్ర కమిటీలో పనిచేసి, అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి చివరివరకు అదే పార్టీలో కొనసాగాడు.[3]

గత కొంతకాలంగా లింపో కేన్సర్‌తో బాధపడుతున్న నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2018, ఆగష్టు 13 సోమవారంనాడు తుది శ్వాస విడిచాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. Telangana Today, Sangareddy (4 December 2018). "The saga of 'Patlolla' in politics". T.Karnakar Reddy. Archived from the original on 26 December 2018. Retrieved 26 December 2018.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1989".
  3. సాక్షి, సంగారెడ్డి (సిద్ధిపేట) (14 August 2018). "పట్లోళ్ల కన్నుమూత". Archived from the original on 26 December 2018. Retrieved 26 December 2018.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (14 August 2018). "జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి కన్నుమూత". Archived from the original on 26 December 2018. Retrieved 26 December 2018.
  5. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (14 August 2018). "మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి కన్నుమూత". Archived from the original on 26 December 2018. Retrieved 26 December 2018.