జాతీయ రహదారి 3

అమృత్‌సర్ వద్ద పాకిస్తాన్ సరిహద్దు నుండి లేహ్ వరకు ఉన్న జాతీయ రహదారి

జాతీయ రహదారి 3, లేదా ఎన్‌హెచ్ 3, భారతదేశంలోని జాతీయ రహదారి. [1] ఇది భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు ప్రక్కనే, అమృత్‌సర్ సమీపంలోని అటారీ నుండి మొదలై హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి మీదుగా లడఖ్‌లోని లేహ్‌లో ముగుస్తుంది.[2]

Indian National Highway 3
3
National Highway 3
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 3
Best place to drive,Rohtang pass.jpg
ఎన్‌హెచ్ 3 పై రోహ్‌తాంగ్ కనుమ
మార్గ సమాచారం
Part of AH1 AH2
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ
పొడవు556 కి.మీ. (345 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరఅత్తారి, పంజాబ్
Major intersections
జాబితా
తూర్పు చివరలేహ్, లడఖ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుపంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్
ప్రాథమిక గమ్యస్థానాలుఅత్తారి, అమృతసర్, కర్తార్‌పూర్, జలంధర్, హోషియార్‌పూర్, గాగ్రేట్, నదౌన్, హమీర్‌పూర్, సర్కాఘాట్, కోట్లీ, మండి, కుల్లూ, మనాలి, గ్రామ్‌ఫూ, కైలాంగ్, లేహ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 2 ఎన్‌హెచ్ 4

చరిత్ర

మార్చు

2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించిన తర్వాత, మునుపటి ఎన్‌హెచ్ 1, ఎన్‌హెచ్ 70లోని కొన్ని భాగాలను, పాత ఎన్‌హెచ్ 21లోని కొన్ని భాగాలతో కలిపి కొత్త ఎన్‌హెచ్ 3ని రూపొందించారు.

పర్వత కనుమలు

మార్చు

జాతీయ రహదారి 3లో కొంత భాగం హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఎగువ ప్రాంతాల గుండా వెళుతుంది, కొన్ని ఎత్తైన పర్వత మార్గాలను దాటుతుంది. మనాలి తర్వాత మొదటి ప్రధాన కనుమ వస్తుంది, ఇది 3,978 మీటర్ల ఎత్తులో ఉన్న రోహ్తాంగ్ కనుమ. రోహ్‌తంగ్ కనుమ కులు లోయ, హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి లోయల మధ్య రవాణా సౌకర్యం కలిగిస్తోంది. ఎన్‌హెచ్3 పై తదుపరి ప్రధాన కనుమ జంస్కార్ పరిధిలో 4,890 మీటర్ల ఎత్తులో బరాలాచ లా వద్ద ఉంది. లేహ్ జిల్లాలో ఎన్‌హెచ్ 3, సముద్ర మట్టం నుండి 4,739 మీటర్ల ఎత్తున ఉన్న నకీ లా మీదుగా, 5,064 మీటర్ల ఎత్తున ఉన్న లాచులుంగ్ లా, తగాంగ్ లా ల గుండా వెళుతుంది.[3]

జాతీయ రహదారి 3 మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది.

పంజాబ్

అత్తారి, అమృత్‌సర్, జలంధర్, హోషియార్‌పూర్ - హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు (178.44 కి.మీ.). [4]

హిమాచల్ ప్రదేశ్

పంజాబ్ సరిహద్దు - గాగ్రెట్, అంబ్, నదౌన్, హమీర్ పూర్, తౌని దేవి, ఆవా దేవి, సర్కాఘాట్, కోట్లి, మండి, కులు, మనాలి, గ్రామ్‌ఫూ, కైలాంగ్ - జమ్మూ కాశ్మీర్ సరిహద్దు (208) కి.మీ.). [5] [6]

లడఖ్

హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు - లేహ్ (170 కి.మీ.). [6]

నిర్మాణం, నవీకరణ

మార్చు

కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎన్‌హెచ్‌ఏఐ వారు జలంధర్ నుండి హోషియార్‌పూర్ వరకు ఉన్న ముక్కను నాలుగు వరుసలకు ఉన్నతీకరించడం ప్రారంభించారు. 58 కి.మీ.ల ఈ ముక్కలో అదంపూర్, రామ మండి వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.[7] ఇందులో 39.4 కి.మీ. పంజాబ్ పబ్లిక్ వర్క్స్ విభాగానికి కేటాయించారు.[8]

జంక్షన్ల జాబితా

మార్చు
 
కులు జిల్లా కోఠి సమీపంలో ఎన్‌హెచ్ 3
వాఘా భారతదేశం/పాకిస్తాన్ సరిహద్దు వద్ద ముగింపు
  ఎన్‌హెచ్ 54 - అమృత్‌సర్ దగ్గర
  ఎన్‌హెచ్ 354 - అమృత్‌సర్ దగ్గర
  ఎన్‌హెచ్ 503A - అమృత్‌సర్ దగ్గర
  ఎన్‌హెచ్ 44 - జలంధర్ సమీపంలో
  ఎన్‌హెచ్ 703 - జలంధర్ సమీపంలో
  ఎన్‌హెచ్ 703A - జలంధర్ సమీపంలో
  ఎన్‌హెచ్ 344B - హోషియార్‌పూర్ సమీపంలో
  ఎన్‌హెచ్ 503A - హోషియార్‌పూర్ సమీపంలో
  ఎన్‌హెచ్ 503 - ముబారక్‌పూర్ సమీపంలో
  ఎన్‌హెచ్ 303 - నాదౌన్ సమీపంలో
  ఎన్‌హెచ్ 103 - హమీర్పూర్ సమీపంలో
  ఎన్‌హెచ్ 305 - Aut సమీపంలో.
  ఎన్‌హెచ్ 505 - గ్రామ్‌పూ సమీపంలో
  ఎన్‌హెచ్ 1 - లేహ్ సమీపంలోని ముగింపు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 5 July 2018.
  2. "Route substitution notification for national highways 3 and 503" (PDF). The Gazette of India. Retrieved 5 July 2018.
  3. "Manali - Leh - Srinagar - 12 Mountain Passes". Retrieved 22 Nov 2018.
  4. "National highways in Punjab". Public Works Department - Government of Punjab. Retrieved 10 Sep 2018.
  5. "National highways in H.P. as on 31.8.2015" (PDF). Public Works Department - Government of Himachal Pradesh. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2018. Retrieved 10 Sep 2018.
  6. 6.0 6.1 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 5 July 2018.
  7. "NHAI starts process for widening of 58 km stretch of Jalandhar-Hoshiarpur road". The Tribune India. 9 Jan 2015. Archived from the original on 11 సెప్టెంబరు 2018. Retrieved 11 Sep 2018.
  8. "Work on Doaba four-laning projects set to gather pace". Hindustan Times. 16 Jan 2018. Retrieved 11 Sep 2018.