జాతీయ రహదారి 5
జాతీయ రహదారి 5 (ఎన్‌హెచ్5) భారతదేశంలోని ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది పశ్చిమం నుండి తూర్పుగా వెళ్తూ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ని షిప్కి లా వద్ద చైనా - భారత సరిహద్దుకు కలుపుతుంది. ఈ రహదారి మోగా, జాగ్రోన్, లూథియానా, మొహాలి, చండీగఢ్, పంచకుల, కల్కా, సోలన్, సిమ్లా, థియోగ్, నరకంద, కుమార్‌సైన్, రాంపూర్ బుషహర్ గుండా వెళుతుంది. టిబెట్ సరిహద్దు దగ్గర ఉన్న టెర్మినస్ వరకు సట్లెజ్ నది వెంట కొనసాగుతుంది.[1]
National Highway 5 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
నిర్వహిస్తున్న సంస్థ NHAI | ||||
పొడవు | 660.2 కి.మీ. (410.2 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | ఫిరోజ్‌పూర్ | |||
తూర్పు చివర | భారత చైనా సరిహద్దు వద్ద షిప్కి లా | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పంజాబ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | మోగా, జాగ్రోవ్, లూఢియానా, మొహాలి, చండీగఢ్, పంచ్‌కులా, కల్కా, సోలన్, సిమ్లా, థియోగ్, నర్కండా, కుమార్‌సైన్, రాంపూర్, చీనీ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుఎన్హెచ్5 భారతదేశంలోని పంజాబ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ల గుండా వెళ్తుంది.[2][3]
పంజాబ్
మార్చుఫిరోజ్పూర్, మోగా, జాగ్రావ్, లూథియానా, ఖరార్, మొరిండా, మొహాలి - చండీగఢ్ సరిహద్దు
చండీగఢ్
మార్చుమొహాలి వద్ద పంజాబ్ సరిహద్దు, పంజాబ్‌లోని జిరాక్‌పూర్ వద్ద రాష్ట్రాన్ని వీడుతుంది.
పంజాబ్
మార్చుజిరాక్పూర్ - హర్యానా సరిహద్దు
హర్యానా
మార్చుపంజాబ్ సరిహద్దు - పంచకుల, సూరజ్‌పూర్, పింజోర్, కల్కా బైపాస్ - హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు
హిమాచల్ ప్రదేశ్
మార్చుహర్యానా సరిహద్దు - పర్వానూ, సోలన్, సిమ్లా, థియోగ్, నరకంద, కుమార్‌సైన్, రాంపూర్ బుషహర్, చిని, షిప్కి లా
ఈ విభాగంలో హిమాలయన్ ఎక్స్‌ప్రెస్ వే ఉంది, 2023లో వరదలు వచ్చి కొండచరియలు విరిగిపడటంతో ఈ రహదారి దెబ్బతిన్నది. రహదారి నిర్మాణం వలన కొండ వాలులు కదిలిపోయాయని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందనీ భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.[4]
కూడళ్ళు
మార్చు- ఊల ఎన్‌హెచ్ 354 ఫిరోజ్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 354B ఫిరోజ్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 54 తల్వాండీ భాయ్ వద్ద
- ఎన్‌హెచ్ 105B మోగా వద్ద
- ఎన్‌హెచ్ 703 మోగా వద్ద
- ఎన్‌హెచ్ 44 దొరాహా వద్ద
- ఎన్‌హెచ్ 205 ఖరార్ వద్ద
- ఎన్‌హెచ్ 205A ఖరార్ వద్ద
- ఎన్‌హెచ్ 152 జిరాక్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 7 జిరాక్‌పూర్ నుండి
- ఎన్‌హెచ్ 105 పింజోర్ వద్ద
- ఎన్‌హెచ్ 907A కుమార్‌హట్టి వద్ద
- ఎన్‌హెచ్ 205 సిమ్లా వద్ద
- ఎన్‌హెచ్ 705 థియోగ్ వద్ద
- ఎన్‌హెచ్ 305 సైంజ్ వద్ద
- ఎన్‌హెచ్ 505A near Powari
- ఎన్‌హెచ్ 505 ఖాబ్ వద్ద
ఇవి కూడా చూడండి
మార్చు- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- రాష్ట్రాల వారీగా భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
మార్చు- ↑ "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 2 September 2019.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 2 September 2019.
- ↑ "Kalka-Shimla road: many questions on highway construction". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-17. Retrieved 2023-08-17.