జాతీయ రహదారి 7
జాతీయ రహదారి 7 (ఎన్‌హెచ్ 7), పంజాబ్ లోని ఫాజిల్కా నుండి ఉత్తరాఖండ్ లోని మానా వరకు నడిచే జాతీయ రహదారి. ఇది పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[1]
National Highway 7 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 845 కి.మీ. (525 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | ఫాజిల్కా | |||
తూర్పు చివర | మానా కనుమ, ఉత్తరాఖండ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | ఫాజిల్కా, అబోహర్, మాలౌట్, గిద్దర్బాహా , భటిండా, రాంపూరా ఫుల్, సంగ్రూర్, పాటియాలా, రాజ్‌పురా, బనూర్, జిరాక్‌పూర్, పంచకుల, నరాయాణ్‌గఢ్, పవోంటా సాహిబ్, హెర్బర్ట్‌పూర్, డెహ్రాడూన్, రిషికేశ్, దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, చమోలి, బద్రీనాథ్, మానా కనుమ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
ఎన్‌హెచ్-7 (పాత ఎన్‌హెచ్-58) రిషికేశ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, చమోలి, జోషిమత్, బద్రీనాథ్‌లోని హిందూ పుణ్యక్షేత్రాలను డెహ్రాడూన్, చండీగఢ్‌లతో కలుపుతుంది. శ్రీ హేమకుంట్ సాహిబ్‌కు వెళ్లే యాత్రికులు జోషిమఠ్, బద్రీనాథ్ ల మధ్య ఎన్‌హెచ్-7 పై ఉన్న గోవింద్‌ఘాట్ వద్ద మళ్లింపు తీసుకుంటారు.
జాతీయ రహదారి 7 హిమాలయాల గుండా వెళ్తుంది. మంచు కురిసే ఎగువ ప్రాంతాలలో దీన్ని డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో మూసివేస్తారు. ఈ రహదారి భారత-టిబెట్ సరిహద్దు సమీపంలోని మానా కనుమ వరకు వెళుతుంది.
మార్గం
మార్చుజాతీయ రహదారి 7 పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[2] ఈ జాతీయ రహదారి దాదాపు 845 కి.మీ. (525 మై.).[3]
పంజాబ్
మార్చుఎన్హెచ్ 7 భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు నుండి ప్రారంభమవుతుంది, ఫజిల్కా, అబోహర్, మలౌట్, గిద్దర్బాహా, బటిండా, రాంపూరా ఫుల్, బర్నాలా, సంగ్రూర్, పాటియాలా, రాజ్‌పురా, బనూర్, జిరాక్‌పూర్ వద్ద హర్యానా సరిహద్దు వరకు కలుపుతుంది.[4]
హర్యానా
మార్చుఎన్హెచ్7 జిరాక్‌పూర్ సమీపంలోని పంచకులాను హర్యానా రాష్ట్రంలోని షాజాద్‌పూర్, నారాయణ్‌గఢ్‌తో కలుపుతుంది.
హిమాచల్ ప్రదేశ్
మార్చుఎన్హెచ్7 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాంటా సాహిబ్‌తో కాలా అంబ్‌ను కలుపుతుంది.[5]
ఉత్తరాఖండ్
మార్చుఎన్హెచ్ 7 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఇండో/టిబెట్ సరిహద్దు వద్ద ఉన్న మానాను, డెహ్రాడూన్, రిషికేశ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, చమోలి, బద్రీనాథ్ లతో కలుపుతుంది.[6]
కూడళ్ళు
మార్చు- పంజాబ్
- ఎన్‌హెచ్ 62 - అబోహర్ సమీపంలో . [3]
- ఎన్‌హెచ్ 9 - మలౌట్ సమీపంలో
- ఎన్‌హెచ్ 354 - మలౌట్ సమీపంలో
- ఎన్‌హెచ్ 754 - భటిండా సమీపంలో
- ఎన్‌హెచ్ 54 - భటిండా సమీపంలో
- ఎన్‌హెచ్ 254 - రాంపుర ఫుల్ సమీపంలో
- ఎన్‌హెచ్ 703 - బర్నాలా సమీపంలో
- ఎన్‌హెచ్ 52 - సంగ్రూర్ సమీపంలో
- ఎన్‌హెచ్ 44 - రాజ్‌పురా సమీపంలో
- ఎన్‌హెచ్ 205A - బానూర్ సమీపంలో
- ఎన్‌హెచ్ 152 - జిరాక్‌పూర్ సమీపంలో
- హర్యానా
- ఎన్‌హెచ్ 5 - పంచకుల సమీపంలో
- ఎన్‌హెచ్ 344 - షాజాద్‌పూర్ సమీపంలో
- హిమాచల్ ప్రదేశ్
- ఎన్‌హెచ్ 907A - నహాన్ సమీపంలో
- ఎన్‌హెచ్ 907 - పాంటా సాహిబ్ సమీపంలో
- ఎన్‌హెచ్ 707 - పాంటా సాహిబ్ దగ్గర
- ఉత్తరాఖండ్
- ఎన్‌హెచ్ 507 - హెర్బర్ట్‌పూర్ సమీపంలో
- ఎన్‌హెచ్ 307 - డెహ్రాడూన్ సమీపంలో
- ఎన్‌హెచ్ 34 - రిషికేశ్ సమీపంలో
- ఎన్‌హెచ్ 707A - మలేత సమీపంలో
- ఎన్‌హెచ్ 309 - శ్రీనగర్ సమీపంలో
- ఎన్‌హెచ్ 107 - రుద్రప్రయాగ్ దగ్గర
- ఎన్‌హెచ్ 109 - కర్ణప్రయాగ్ దగ్గర
- ఎన్‌హెచ్ 107A - చమోలి సమీపంలో . [3]
3200 మీటర్ల ఎత్తులో మానా గ్రామానికి సమీపంలో ఇది ముగుస్తుంది.
మూలాలు
మార్చు- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 23 June 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 23 June 2019.
- ↑ 3.0 3.1 3.2 "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 18 March 2020.
- ↑ "National Highways in Punjab, India". Public Works Department, Punjab. Retrieved 23 June 2019.
- ↑ "National Highways in Himachal Pradesh" (PDF). Public Works Department, Himachal Pradesh. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2018. Retrieved 23 June 2019.
- ↑ "National Highways in Uttarakhand" (PDF). Public Works Department, Uttarakhand. Retrieved 23 June 2019.