ప్రధాన మెనూను తెరువు

జాన్ బోర్గ్ (Björn Rune Borg) 1956, జూన్ 6న స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలో జన్మించాడు. ఇతడు స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమమైన ఆటగాళ్ళలో జాన్ బోర్గ్ ఒకడు. [1][2][3].

9 సంవత్సరాల పాటు 27 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్ళ కోసం పోటీపడి 41% విజయ శాతంతో 11 టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. మొత్తం 141 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో 89.8% విజయ శాతంతో 141 మ్యాచ్‌లు గెలుపొందినాడు. బోర్గ్ ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్య కేవలం 16 మాత్రమే. అందులో 5 సార్లు ఫైనల్ దశకు చేరుకొని ఫైనల్లో అమెరికాకు చెందిన జిమ్మీ కానర్(2), జాన్ మెకెన్రో (3) ల చేతిలో పరాజయం పొందినాడు.

జాన్ బోర్గ్ సాధించిన గ్రాండ్‌స్లామ్ విజయాలు (11)సవరించు

జాన్ బోర్గ్ మొత్తం 16 సార్లు గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ పైనల్‌లోకి ప్రవేశించి 11 టైటిళ్ళను గెలిచి ఆరింటిలో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పైనల్‌లో ఓడిన ప్రతీసారి జిమ్మీకానర్ లేదా జాన్ మెకెన్రో చేతిలోనే ఓడిపోవుట విశేషం. జాన్ బోర్గ్ ప్రెంచ్ ఓపెన్‌ను 6 సార్లు గెలవగా, వింబుల్డన్‌ను 5 సార్లు సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో 4 సార్లు పైనల్‌లోకి వచ్చిననూ జిమ్మీ కానర్స్ మరియు జాన్ మెకెన్రో్‌ల వల్ల ఆ టైటిల్ అతడికి కలగానే మిగిలిపోయింది.

సంవత్సరం చాంపియన్‌షిప్ పైనల్‌లో ప్రత్యర్థి పైనల్‌లో స్కోరు
1974 ప్రెంచ్ ఓపెన్   మాన్యువెల్ ఒరాంటిస్ 2-6, 6-7, 6-0, 6-1, 6-1
1975 ప్రెంచ్ ఓపెన్(2)   గిలెర్మో విలాస్ 6-2, 6-3, 6-4
1976 వింబుల్డన్ ఓపెన్   ఇలీ నస్టాజ్ 6-4, 6-2, 9-7
1977 వింబుల్డన్ ఓపెన్ (2)   జిమ్మీ కానర్స్ 3-6, 6-2, 6-1, 5-7, 6-4
1978 ప్రెంచ్ ఓపెన్(3)   గిలెర్మో విలాస్ 6-1, 6-1, 6-3
1978 వింబుల్డన్ ఓపెన్ (3)   జిమ్మీ కానర్స్ 6-2, 6-2, 6-3
1979 ప్రెంచ్ ఓపెన్(4)   విక్టర్ పెస్సీ 6-3, 6-1, 6-7, 6-4
1979 వింబుల్డన్ ఓపెన్ (4)   రోస్క్యూ టాన్నర్ 6-7, 6-1, 3-6, 6-3, 6-4
1980 ప్రెంచ్ ఓపెన్(5)   విటాస్ గెరులాటిస్ 6-4, 6-1, 6-2
1980 వింబుల్డన్ ఓపెన్ (5)   జాన్ మెకెన్రో 1-6, 7-5, 6-3, 6-7(16), 8-6
1981 ప్రెంచ్ ఓపెన్(6)   ఇవాన్ లెండిల్ 6-1, 4-6, 6-2, 3-6, 6-1

రెండో స్థానంలో నిలిచిన గ్రాండ్‌స్లామ్‌లు(5)సవరించు

సంవత్సరం చాంపియన్‌షిప్ పైనల్‌లో ప్రత్యర్థి పైనల్‌లో స్కోరు
1976 అమెరికన్ ఓపెన్   జిమ్మీ కానర్స్ 6-4, 3-6, 7-6, 6-4
1978 అమెరికన్ ఓపెన్   జిమ్మీ కానర్స్ 6-4, 6-2, 6-2
1980 అమెరికన్ ఓపెన్   జాన్ మెకెన్రో 7-6, 6-1, 6-7, 5-7, 6-4
1981 వింబుల్డన్   జాన్ మెకెన్రో 4-6, 7-6, 7-6, 6-4
1981 అమెరికన్ ఓపెన్   జాన్ మెకెన్రో 4-6, 6-2, 6-4, 6-3

గ్రాండ్‌స్లాం సింగిల్స్ టోర్నమెంట్ల విశ్లేషణసవరించు

టోర్నమెంట్ 1973 1974 1975 1976 1977 1978 1979 1980 1981 కెరీర్ విజయ నిష్పత్తి కెరీర్ విజయాలు-ఓటములు
గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ A 3R A A A A A A A 0 / 1 1-1
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 4R W W QF A W W W W 6 / 8 49-2
వింబుల్డన్ టెన్నిస్ QF 3R QF W W W W W F 5 / 9 51-4
అమెరికన్ ఓపెన్ టెన్నిస్ 4R 2R SF F 4R F QF F F 0 / 9 40-9
విజయ నిష్పత్తి 0 / 3 1 / 4 1 / 3 1 / 3 1 / 2 2 / 3 2 / 3 2 / 3 1 / 3 11 / 27 N/A
విజయాలు-ఓటమిలు 10-3 12-3 16-2 17-2 10-1 20-1 18-1 20-1 19-2 N/A 141-16

జాన్ బోర్గ్ రికార్డులుసవరించు

  • ప్రెంచ్ ఓపెన్(పురుషుల విభాగం)లో అత్యధిక టైటిళ్ళను (6) గెల్చిన టెన్నిస్ ఆతగాడిగా రికార్డు సృష్టించాడు.
  • వరుసగా 4 ప్రెంచ్ ఓపెన్ టైటిళ్ళను సాధించి (1978 నుంచి 1981 వరకు) రికార్డు సృష్టించాడు.
  • బోర్గ్ 16 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల పైనల్‌లోకి ప్రవేశించి ఇవాన్ లెండిల్ (19), పీట్ సంప్రాస్ (18), రాడ్ లీవర్ (17) ల తర్వాత స్థానంలో నిల్చినాడు.
  • 1972లో తన 15 వ ఏట డేవిస్ కప్ గెలిచి ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు