గోపరాజు సమరం

వైద్యుడు, రచయిత
(జి.సమరం నుండి దారిమార్పు చెందింది)

డా. గోపరాజు సమరం వైద్యుడు, సంఘ సేవకుడు, రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. సమరం నాస్తికవాది అయిన గోరా, సరస్వతి గోరాల కుమారుడు. వృత్తి రీత్యా వైద్యుడైన సమరం వివిధ రంగాలలో కృషి సలిపాడు. సమరం 1939 జూలై 30లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు.

గోపరాజు సమరం
జననంజూలై 30, 1939
మచిలీపట్నం, కృష్ణా జిల్లా
విద్యఎం. బి. బి. ఎస్
విద్యాసంస్థరంగరాయ వైద్య కళాశాల, కాకినాడ
వృత్తివైద్యుడు, రచయిత, సంఘ సేవకుడు
తల్లిదండ్రులు

కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుండి ఎం.బీ.బీ.ఎస్. పట్టా పొంది సమరం 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. వందలాది ఉచిత వైద్యశిబిరాలు, టీకావైద్యం క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్రా శిబిరాలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్‌.ఐ.వీ. రక్తపరీక్షా శిబిరాలు నిర్వహించటంలో ప్రధానపాత్ర పోషించాడు. సమాజంలోని అన్నివర్గాల ప్రజాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించటంలో విశేషకృషి చేశాడు. సమరం స్వేచ్ఛాగోరా నేత్రనిధి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు. బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను రూపుమాపడానికి సమరం వీటి సమస్య హెచ్చుగా ఉన్న మెదక్, నిజామాబాదు, అదిలాబాదు, నల్గొండ జిల్లాలో అనేక బృందాలతో పర్యటించాడు. జిల్లా అధికారులు, పోలీసు సూపరిండెంటు ఆహ్వానముపై బాణామతిపై అవగాహన పెంచడానికి వైద్యులు, శాస్త్రజ్ఞులు, మంత్రజాలికులు, మిమిక్రీ కళాకారులు, స్వచ్ఛంద కార్యకర్తలతో కూడిన బృందాలకు నాయకత్వం వహించాడు. సమరం విజయవాడలోని పోలీసు వైద్య కేంద్రము యొక్క గౌరవ నిర్దేశకుడు.

డా. సమరం భారతీయ వైద్య సంఘ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక ఉన్నత పదవులను చేపట్టాడు. 1980-81 సంవత్సరానికి గాను భారతీయ వైద్య సంస్థలో సంఘపు ఉత్తమ రాష్ట్రాధ్యక్షునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. 1996-97లో భారతీయ వైద్య సంఘము (Indian Medical Association) యొక్క ఉపాధ్యక్షునిగా పనిచేశాడు.ఈయన భార్య డా. రష్మీ కూడా వీరి కృషిలో పాలుపంచుకుంటున్నారు.

రచనలు

మార్చు
  1. సైన్సు-నాస్తికత్వం1981
  2. సైన్సు-మనస్సు 1982
  3. ముప్పుతెచ్చేమూఢనమ్మకాలు 1993
  4. కుటుంబ నియంత్రణ పద్ధతులు-డా.జి.సమరం (ఆర్కీవ్.ఆర్గ్ లో ప్రతి)
  5. ఆధునిక ఆరోగ్య రక్షణ గ్రంథావళి (హార్ట్ ఎటాక్)
  6. ఆధునిక ఆరోగ్యరక్షణ గ్రంథావళి (వ్యాధులు-భయాలు)