జైనేంద్ర జైన్

గుజరాత్ కి చెందిన బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత

జైనేంద్ర జైన్ (2009, అక్టోబరు 4 - 2007, డిసెంబరు 23) గుజరాత్ కి చెందిన బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.

జైనేంద్ర జైన్
జననం
జైనేంద్ర కుమార్ జైన్

2009, అక్టోబరు 4
మరణం2007 డిసెంబరు 23(2007-12-23) (వయసు 68)
వృత్తిదర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత

జైనేంద్ర జైన్ 2009, అక్టోబరు 4న గుజరాత్ లోని సూరత్ లో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, అక్కడ ఒక దశాబ్దానికి పైగా పనిచేశాడు. 1973లో విడుదలైన బాబీ సినిమాతో రచయితగా హిందీ సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఇది 1970లలో రెండవ అత్యధిక వసూళ్ళు సాధించిన హిట్‌ సినిమాగా నిలిచింది. ఇది డింపుల్ కపాడియాకు మొదటి సినిమాగ కాగా, రిషి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా.

ఆ తరువాత రాజ్ కపూర్,[1] బాపు, కె. విశ్వనాథ్, సుభాష్ ఘై, సతీష్ కౌశిక్, రాజ్ కన్వర్ వంటి దర్శకుల సినిమాలకు రచనలు చేసాడు.[2][3]

జుదాయి (1997), కాళీచరణ్ (1976), దాగ్: ది ఫైర్ (1999), తేరే నామ్ (2003) వంటి అనేక ఇతర విజయవంతమైన సినిమాలను రాశాడు.[4][5] ఇతడు రాసిన అందాజ్ సినిమా ద్వారా లారా దత్తా, ప్రియాంక చోప్రాలు సినిమారంగంలోకి వచ్చారు. సుభాష్ ఘాయ్, కె. విశ్వనాథ్‌ల దర్శకత్వం వహించిన మొదటి సినిమాలు, రాకేష్ రోషన్ నిర్మాతగా మొదటి సినిమా, జయప్రద, ఖుష్బూ, పద్మిని కొల్హాపురే, అనిల్ కపూర్‌లకు ప్రధాన పాత్రల మొదటి సినిమాలు ఇతడు రాసినవే కావడం గమనార్హం.

సినిమాలు

మార్చు

రచయిత

మార్చు
  • తేరీ సాంగ్: ఎ కిడల్ట్ లవ్ స్టోరీ (2009)
  • తేరే నామ్ (2003)
  • అందాజ్ (2003)
  • ధై అక్షర్ ప్రేమ్ కే (2000)
  • హమారా దిల్ ఆప్కే పాస్ హై (2000)
  • దాగ్ (1999)
  • హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై (1999)
  • జుదాయి (1997)
  • ప్రేమ్ గ్రంథ్ (1996)
  • రాధా కా సంగం (1992)
  • జాన్ సే ప్యారా (1992)
  • సంగీత్ (1992)
  • హెన్నా (1991)
  • ప్రేమ్ ప్రతిగ్యా (1989)
  • ఛోటా ఆద్మీ (1986)
  • భవానీ జంక్షన్ (1985)
  • జానూ (1985)
  • సంజోగ్ (1985)
  • మేరా ఘర్ మేరే బచ్చే (1985)
  • రామ్ తేరే కిత్నే నామ్ (1985)
  • వో సాత్ దిన్ (1983)
  • ప్రేమ్ రోగ్ (1982)
  • కామ్‌చోర్ (1982)
  • సర్గం (1979)
  • చక్రవ్యూహ (1978)
  • పరమాత్మ (1978)
  • సత్యం శివం సుందరం (1978)
  • కాళీచరణ్ (1976)
  • ఖాన్ దోస్త్ (1976)
  • బాబీ (1973)

దర్శకుడు

మార్చు
  • జానూ (1985)

నిర్మాత

మార్చు
  • జానూ (1985)

ఇతడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా 2007, డిసెంబరు 23న ముంబైలో మరణించాడు. ఇతనికి భార్య, కుమార్తెలు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. "Anil Kapoor is autistic in Yuvvraaj | Subhash Ghai |Latest Celebrity news". Bollywood Hungama. 2008-11-13. Archived from the original on 2 April 2015. Retrieved 2023-07-15.
  2. Bose, Derek (2006). "Everybody Wants a Hit: 10 Mantras of Success in Bollywood Cinema", p. 71. Jaico Publishing House, India. ISBN 8179925587
  3. "Jainendra Jain on". Moviebuff.com. Retrieved 2023-07-15.
  4. "Jainendra Jain Films | Films". Bollywood Hungama. Archived from the original on 2 April 2015. Retrieved 2023-07-15.
  5. Karanjia, B. K. (2000) "Counting My Blessings", p. 194. Penguin India. ISBN 0670058491

బయటి లింకులు

మార్చు