జోరు 2014, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్, రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి భీమస్ సెసిరోలె సంగీతం అందించాడు.[1]

జోరు
జోరు సినిమా పోస్టర్
దర్శకత్వంకుమార్ నాగేంద్ర
రచనకుమార్ నాగేంద్ర
నిర్మాతఅశోక్, నాగార్జున్
తారాగణంసందీప్ కిషన్, రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్
ఛాయాగ్రహణంఎం.ఆర్. పలని కుమార్
కూర్పుఎస్.ఆర్. శేఖర్
సంగీతంభీమస్ సెసిరోలె
నిర్మాణ
సంస్థ
శ్రీ కీర్తి ఫిల్మ్మ్
విడుదల తేదీ
నవంబరు 7, 2014
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

విశాఖపట్నం ఎమ్మెల్యే సదాశివం (సాయాజీ షిండే). అతని కుమార్తె (రాశీ ఖన్నా) అమెరికా నుంచి వస్తుంది. ఆమె కిడ్నాప్‌కు గురయ్యే టైంలో సందీప్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. తన వెంట తీసుకువెళతాడు. ఆ క్రమంలో ఆమె తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ స్థానంలో మరొకర్ని ప్రవేశపెట్టి, హీరో ఆడిన నాటకమేంటి? అదెలా ముగిసిందన్నది సినిమా.[2]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • రచన, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
  • నిర్మాత: అశోక్, నాగార్జున్
  • సంగీతం: భీమస్ సెసిరోలె
  • ఛాయాగ్రహణం: ఎం.ఆర్. పలని కుమార్
  • కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
  • నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి ఫిల్మ్మ్

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, వనమాలి, భీమ్స్ సిసిరోలియో రాయగా, భీమస్ సెసిరోలె సంగీతం అందించాడు. 2014, అక్టోబరు 6న హైదరాబాదులో పాటలు విడుదల అయ్యాయి.[3][4]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మనసా"  సునీల్ కశ్యప్ 3:53
2. "పువ్వులకు రంగెయ్యాల"  శ్రేయ ఘోషాల్ 4:26
3. "హవ్వాయి తవ్వాయి"  హేమచంద్ర 4:10
4. "కోడంటే కోడి"  భీమస్ సెసిరోలె,భార్గవి పిళ్ళై 3:45
5. "జోరు"  రాశీ ఖన్నా 2:48
19:02

మూలాలు మార్చు

  1. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
  2. సాక్షి, సినిమా (8 November 2014). "సినిమా రివ్యూ: జోరు". రెంటాల జయదేవ. Archived from the original on 17 March 2015. Retrieved 20 June 2019.
  3. "Joru Movie Audio Launch Full Programme". Youtube. 3 January 2017.
  4. "Gulte". 3 January 2017.

ఇతర లంకెలు మార్చు