జ్ఞానోదయం
ఏదైనా ఒక విషయం మీద పూర్తి జ్ఞానం కలగటానిని' జ్ఞానోదయం' అంటారు. ఇది ముఖ్యంగా బౌద్ధ ధర్మ విషయాలను తెలియచెప్పడానికి ఉపయోగిస్తారు. ఇందులో బోధి, కేంషో, సతోరి ముఖ్యమైనవి. భారతదేశ, ఆసియా ఖండపు మతాలలో దీనికి సంబంధించిన పదాలు మోక్షం, ముక్తి (హిందూ ధర్మం), కేవల జ్ఞానం (జైన మతం), ఉష్త (జొరాస్ట్రియన్ మతం).
నిత్యతత్వ వాదులు, సార్వత్రికవాదులు జ్ఞానోదయాన్ని మార్మిక వాదాన్ని ఒకే కోణంలో చూస్తారు. ఇవి రెండూ మతపరమైన, ఆధ్యాత్మిక అంతర్దృష్టిని పెంపొందించదానికి సమానమైన భావనలుగా చూస్తారు.
భారత దేశం, ఆసియా
మార్చుబౌద్ధ మతం
మార్చుబోధి తీర్వాద పదం. దీనర్థం అవగతం కావడం లేదా మేలుకొలుపు పొందటం. మేలుకొలుపు పొందిన వ్యక్తి మనసు యొక్క నాలుగు పరమ సత్యాలు తెలుసుకున్నవాడు. మనసు మనల్ని కోరికల, బాధల, జన్మల ఊబిలో పడేస్తుంది అదేకాకుండా మేలుకొలుపు పొందిన వ్యక్తి మోక్షానికి, ముక్తికి దారిని కూడా చూపిస్తుంది.
ప్రజ్ఞ మహాయాన పదం. ఇది మనసు నిజ స్వరూపానికి దారి చూపిస్తుంది. ఇది మధ్యమకుని ప్రకారం దీనర్థం వ్యక్తిగత భావం లేకపోవడం. అంటే నిజంగా వ్యక్తిగత స్వార్థం, అహం లేని ఒక స్థితి (నేను అనే భావన లేకపోవడం). ఇది బుద్ధ తత్వాన్ని కుడా సూచిస్తుంది.జెన్ బౌద్ధ మతంలో కెన్షో అంటే అర్థం మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం[1] సతోరి అనే పదం కుడా వాడతారు దీనికి. కానీ సతోరి అంటే కెన్షో అనుభవం.[1]
పూర్తి మేలుకొలుపుని పొందడానిని బుద్ధతత్త్వం అంటారు.బుద్ధ తత్త్వం పొందిన వారిని ఎవరినైనా బుద్ధుడు (బుద్ధులు) అంటారు. గౌతమ బుద్ధుడు దీనికి ఉదాహరణ. టిబెట్ తుబ్తేన్ ఎషె ప్రకారం జ్ఞానోదయం అంటే "బౌద్ధ పరిచారకుల యొక్క అంతిమ గమ్యం మనసు యొక్క అన్ని పరిముతలను తెలగించి, దాని మంచి శక్తులను పూర్తి స్థాయిలో నెలకొల్పడం, అదే జ్ఞానోదయం. ఇది కరుణ, జ్ఞానం, నైపుణ్యాల యొక్క సమ్మేళన స్థితి."
హిందూ ధర్మం
మార్చుభారతదేశ మతాలలో, మోక్షం లేదా ముక్తి అనేది సంసార జీవితం ఆత్మకు విముక్తి కలిగించడం. ఇది సంసార జీవితపు బాధలను అంతమొందిస్తుంది. జీవుడుని జన్మల మరుజన్మ లేకుండా చేస్తుంది.
అద్వైత సిద్ధాంతం
మార్చుఅద్వైత మతం ఒక తత్వ శాస్త్ర సిద్ధాంతం. ఈ మతం వారు ఆత్మను పరమాత్మ ఒక్కటే అని అనుభవం ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం ద్వారా ముక్తిని పొందుతారు. ఇది పూర్తి చేయడానికి ఒక గురువు వద్ద వీరు చాలా శిక్షణ పొందుతారు. దీనికి వీరు గ్రంథాలు చదవడం, లోక సంబంధ విషయాలను వదిలి వేయడం, అనుభవ పూర్వకంగా ఏకత్వాన్ని పొందటానికి కృషి చేస్తారు. సా.శ. 788 లో భారతదేశంలో పుట్టిన ఈ సిద్ధాంతం అతి ప్రాచుర్యం కలిగిన వేదాంత పద్ధతి.[2] ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు వేదాంత సిద్ధాంతాలకు మరికొన్ని ఉదాహరణలు.[3]
అద్వైతం అనగా రెండు కాదు ఒకటి అని అర్థం. అంటే ఆత్మ పరమాత్మ ఒకటే, రెండు కాదు అని.[note 1] దీన్ని అనుభవ పూర్వకంగా తెలుస్కోవడమే ముక్తి పొందటం. దీనికి ఒక గురువు కింద చాలా కసరత్తు, కృషి చేయాల్సి ఉంటుంది.
ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు (ప్రస్థానత్రయం) అద్వైత వేదాంతానికి మూల గ్రంథాలు. అద్వైత వేదాంత నియమాలను మొదటి సారిగా శంకర భగవద్పాదంలో చెప్పబడింది. చారిత్రకంగా గౌడపాదాచార్యులు మొట్ట మొదట సరిగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
తత్వ వ్యవస్థ
మార్చుఆది శంకరాచార్యులు పూర్వీకుల అద్వైత సిద్ధాంతాన్ని ఒక క్రమ పధ్ధతిలోనికి తీసుకువచ్చారు. ఆయన దీనికి అధిభౌతిక పండిత వ్యాఖ్యానాన్ని (ఆంగ్ల భాష: Metaphysical Scholarly Exegesis) జోడించారు. ఈ పద్ధతినే తర్వాతి వేదాంతులు అనుసరించారు.
తన ప్రకరణ గ్రంథాలలో ఒకటైన బ్రహ్మ జ్ఞానావలీ మాల 20 వ శ్లోకంలో ఆయన ఈ విధంగా అన్నారు.
- (శ్లోకం) బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః
- అనేన వేద్యం సఛ్ఛాస్త్రం ఇతి వేదాంత డిండిమః [4][5][6]
(అర్థం) పరమాత్మ (పరబ్రహ్మ) ఒక్కటే నిజం,
మిగతాదంతా మాయ (దానికి విడిగా అస్తిత్వం లేదు)
జీవాత్మ (జీవుడు) పరమాత్మ ఒక్కటే
కోట్లాది గ్రంథాల సారం ఇదే
(ఇక్కడ పరబ్రహ్మ, బ్రాహ్మణ్, పరమాత్మ అనే పదాలు వాడబడతాయి. దీనిని సరాసరి దేవునిగా వ్యవహరించబడే బ్రహ్మ దేవునిగా అర్థం చేసుకోరాదు)
సత్సంగ ఉద్యమం
మార్చు19వ శతాబ్దంలో వివేకానందుడు, హిందూ పునరుత్థానంలో సింహ భాగం పోషించారు.[7] అద్వైత వేదాంతాన్ని రామకృష్ణ మఠము ద్వారా పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యం గావించారు. అద్వైత వేదాంతం పై వివేకానందుని వ్యాఖ్యానాన్ని ఆధునిక వేదాంతం (సత్సంగం) అంటారు.[8] 1896 లో, వివేకానందుడు లండను లో ఒక ప్రసంగాన్ని ఇచ్చారు. దీని పేరు "ది ఆబ్సల్యుట్ అండ్ మ్యానిఫెస్టేషన్" (అంటే "అసలు, దాని రూపాలు", అసలు అనగా ఇక్కడ అసలైన నిజం, పరమాత్మ). ఈ ప్రసంగంలో అయన ఇలా అన్నారు.
"నేను ఇలా చెప్పడం అతిశయోక్తి గా ఉండవచ్చును గాక. కానీ బౌతిక, నీతి పంథాలు రెంటిలోను నూతన పరిశోధకులతో ఏకీభవించే మతం అద్వైతం మాత్రమే. అందువల్లే ఇది నూతన శాస్త్రవేత్తలకు బాగా నప్పుతుంది. వారికి పాత ద్వంద్వ సిద్ధాంతాలు సరిపోవు, వారి అవసరాలను సంతృప్తి పరచవు. ఒక మనిషికి నమ్మకం ఒకటి వుంటే సరిపోదు, శాస్త్రీయ జిజ్ఞాస కూడా వుండాలి".[web 1]
ముక్తిని పొందటానికి సమాధి స్థితి ముఖ్యమైనదని ఆయన నొక్కి వక్కాణించారు.[9] కానీ, ఉపనిషత్తులలోనూ, శంకరాచార్యుల సిద్ధాంతాలలోను ఇది అంతగా కనపడదు. [10] శంకరాచార్యులు ధ్యానం, నిర్వికల్ప సమాధులను ఆత్మకు, పరమాత్మకు గల ఏకత్వాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికి దారులుగా భావించారే కానీ వాటినే చివరి గమ్యాలుగా చెప్పలేదు.[9]
యోగా అనేది మనము వ్యక్తి పరమైన గుర్తింపు కాకుండా ఈ విశ్వంతో గుర్తింపు పొందే ఒక ధ్యాన వ్యాయామ ప్రక్రియ. ఇది వ్యక్తి ఆలోచనలను ఈ విశ్వం యొక్క ఆలోచనలుగా గుర్తించడమే. దీని పేరే చేతన(చైతన్యం). ఈ ఆలోచనావిధానం సంప్రదాయక యోగా విధానమైన ఆలోచనలను నిలిపివేసుకొనే పద్ధతి కంటే భిన్నమైనది.[9]
వివేకానందుడి అధునీకరణ విమర్శలకు కూడా లోనైంది:[8][11]
అద్వైత సిద్ధాంతం పై ఏ ఒక్క తత్త్వవేత్త యొక్క అవగాహనను ప్రశ్నించకుండా[...]పాశ్చాత్యీకరణ అద్వైత సిద్ధాంతపు ఆంతర్యాన్ని మసగబార్చింది. సన్యాసానికి, పరమానందానికి సహసంబంధం కాస్తా అభిజ్ఞాన, వాస్తవిక నిర్మాణాన్ని చిన్నబుచ్చేందుకు జరిగిన ప్రయత్నాల క్రమంలో కొట్టుకుపోయింది. కానీ శంకరాచార్యుల ప్రకారం రెండూ మాయలోని భాగమే.[8]
ఆధునిక అద్వైతం:
మార్చుఆధునిక అద్వైతం లేదా నియా-అద్వైత (ఆంగ్లం: Neo-Advaita) అనేది అద్వైతం పైన ఆధునిక పాశ్చాత్య ఉద్దేశాల మీద ఆధారపడిన ఒక కొత్త మత ఉద్యమం.[12] ఇది చాలా విమర్శలకు లోనవుతూ ఉంది.[13][note 2][15][note 3][note 4]. సాంప్రదాయక గ్రంథాల జ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తించక పోవడం, జ్ఞాన-యోగ మార్గానికి సన్యాసం యొక్క అవసరాన్ని గుర్తించకపోవడం దీనికి కారణాలు.[16][17] హెచ్.డబ్లుఎల్.పూంజ[18][12], ఆయన శిష్యులు గంగాజీ[19], ఆండ్రూ కోహెన్, [note 5], మధుకర్[21], ఎకార్ట్ టోలే[12]లు చెప్పుకోదగ్గ ఆధునిక అద్వైత వాదులలో కొందరు.
యోగా
మార్చుయోగా అనేది పురాతన భారతదేశంలో పుట్టిన, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శాస్త్రాలకు చెందిన సుపరిచితమైన పదం.[22][23] యోగా హిందూ తత్వ శాస్త్రం లోని ఆరు ఆస్తికవాదానికి సంబంధించిన ఆరు సాధనలలో ఒకటి. ఇది పంతంజలి యోగ సూత్రాల ఆధారపడింది. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలలో అనేక రకాలైన యోగా సంప్రదాయాలు ఉన్నాయి.[24][25][note 6]
క్రీ.పూ సహస్రాబ్ది ముందు విభిన్నమైన ఆచారాలు సా.శ. 1 ప్రాంతంలో ఒక క్రమ పద్ధతిలో పంతంజలి యోగ సుత్రలలో క్రోడీకరించబడ్డాయి.[27] సా.శ. 1000 కి వచ్చేసరికి హఠయోగ ఒక ముఖ్యమైన, పంతంజలి యోగా సూత్రాలకు భిన్నమైన సంప్రదాయంగా పరిణతి చెందింది. పంతంజలి యోగా సూత్రాలు ఎక్కువగా మనస్సు యొక్క క్రమశిక్షణపై శ్రద్ధ చూపగా, హఠయోగ శరీరం యొక్క ఆరోగ్యం మీద, స్వచ్ఛత మీద శ్రద్ధ చూపిస్తుంది.[28]
19వ శతాబ్దం నుండి స్వామి వివేకానందుడు మొదలుకొని హిందూ తత్త్వ వేత్తలు యోగాను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చారు. 1980లలో పాశ్చాత్య దేశాలలో, యోగా శారీరక ఆరోగ్య సంబంధిత వ్యాయామాల పధ్ధతిగా పేరు పెంపొందింది. కేన్సర్, స్కిజోఫ్రీనియా, ఉబ్బసము, హృద్రోగాలను నివారించడానికి ఒక సహ ప్రక్రియగా (అంటే వైద్యంతో పాటు) యోగా ఎంత వరకు ఉపయోగ పడుతుంది అనే దానిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఒక సర్వేలో, అమెరికా దేశపు యోగా సాధకులు మానసిక, కండర సంబంధిత లక్షణాలు మెరుగు పడినట్లుగా తెలిపారు.[29]
జ్ఞాన యోగా
మార్చుసంప్రదాయక అద్వైత వేదాంతం జ్ఞాన యోగపు దారి ముఖ్యమైనది. అనగా మోక్షాన్ని సాధించడానికి చేసే సాధన, అధ్యయనం. ఇందులో నాలుగు అంచెలు ఉన్నాయి.[30][web 7]
- సమన్యాసాలు (సంపత్తులు, [31] "చతుస్తయ సాధన", ఈ నాల్గు లక్షణాలను పెంపొందించుకోవడం:[30][web 8]
- నిత్యానిత్య వస్తు వివేకం – నిత్యానికి (పరమాత్మ లేదా బ్రాహ్మణ్), అనిత్యానికి మధ్య బేధం తెలుసుకోవడం.
- ఇహముత్రార్థ ఫల భోగ విరాగం – భూలోక పరలోకాలలో సుఖ భోగాలను పరిత్యజించడం.
- శమాది షట్క సంపత్తి – ఆరు లక్షణాలు
- శామ (అంతఃకరణ నియంత్రణ)
- దామ (పంచేంద్రియాల నియంత్రణ)
- ఉపారతి
- తితీక్ష
- శ్రద్ధ
- సమాధానం
- ముముక్షుత్వం
- శ్రవణం: ఉపనిషత్తులు, అద్వైత వేదాంతం మీద ఋషుల యొక్క వ్యాఖ్యానాలు వినడం, బ్రహ్మ సూత్రాల వంటి వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయడం. ఈ దశలో విద్యార్థి బ్రాహ్మణ్ (పరమాత్మ) గురించి, ఆత్మ గురించి తెలుసుకుంటాడు.
- మననం: బోధనల సారాంశాన్ని అర్థం చేసుకోవదానికి ప్రయత్నించే దశ.
- ధ్యానం: "అంతా ఒక్కటే" అనే అంశంపై ధ్యానం చేసే దశ.
భక్తి యోగా
మార్చుభక్తి యోగం, కర్మ యోగాలు అనుబంధాలు.
భక్తి యోగంలో సాధన ఏదైనా నామంలో దేవుడిని కొలవడం పై చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆది శంకరాచార్యులు ఆయనకాయనే భక్తి యోగం యొక్క సిద్ధాంతకర్త. కానీ వేద బలులు, పూజలు జ్ఞానానికి దారి చూపించగలిగినా, అవి సరాసరి మోక్షానికి దారి తీయవని ఆయన చెప్పారు. కొద్దిలో కొద్ది, శుక్ల గతి ద్వారా మోక్షాన్ని సాధించడానికి ఉపయోగపడవచ్చు.[ఆధారం చూపాలి]
కర్మ యోగం
మార్చుకర్మ యోగం అనేది లాభ నష్టాలకు అతీతంగా మన బాధ్యతలు మనం నిర్వర్తించే ఒక పద్ధతి. స్వామి శివానంద ప్రకారం,
కర్మ యోగం అనగా మన కర్మల ఫలితాలను దేవునికి అంకితం చేయటం. కర్మ యోగం అనగా పరమాత్మతో ఏకమై, బంధాలకు లోబడకుండా, జాయాపజయాలతో సంబంధం లేకుండా మన బాధ్యతలు నిర్వర్తించడం.
కర్మ యోగం మనవ సమాజానికి స్వార్థ రహిత సేవ. కర్మ యోగం కార్య యోగం, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన అంతఃకరణ శుద్ధిని పెంచుతుంది. బంధాలకు లోనవకుండా, అహానికి అతీతంగా మనవ సమాజానికి సేవ చేయడము ఇందులో ముఖ్యాంశం.
జైనమతం
మార్చుజైనమతం అన్ని జీవుల పట్ల అహింసను ప్రబోధించే భారతదేశపు మతం. దీని తత్వశాస్త్రం ఆత్మను ముక్తి వైపు సాగించడానికి స్వయంకృషి ముఖ్యమైనదని చెబుతుంది. తన లోపల శత్రువులను జయించిన ఏ ఆత్మ అయినా "జీనా" (విజేత) అనే మహోన్నత స్థితిని చేరుకుంటుంది. ఈ ఆత్మల పరిపూర్ణ స్థితిని సిద్ధ అంటారు. ప్రాచీన గ్రంథాలు జైన మతాన్ని శ్రమణ ధర్మం (స్వాధికరత) గా వ్యవహరిస్తాయి. వీటిని "దిగంబరుల దారి" అని కూడా అంటారు.
మహోన్నతమైన పరిశుద్ధ జ్ఞానాన్ని జైన మతంలో కైవల్య జ్ఞానం అంటారు. అంటే "అసలైన లేదా కచ్చితమైన" జ్ఞానం. సన్యాసం ద్వారా చెడు కర్మను వదిలించుకోవడం ద్వారా, మరణం, పునర్జన్మలనుండి విముక్తి లభించడం ద్వారా పొందిన జీవాజీవ విచక్షణా జ్ఞానాన్ని కైవల్యం అంటారు. గతీయ కర్మలను నిర్మూలించడం తర్వాత వచ్చిన ఆత్మానాత్మల జ్ఞానమే కైవల్య జ్ఞానం. ఈ దశకు చేరిన ఆత్మ ఈ జీవితం తర్వాత మోక్షాన్ని (ముక్తిని) పొందుతుంది.
సూచనలు
మార్చు- ↑ "Brahman" is not to be confused with Brahma, the Creator and one third of the Trimurti along with Shiva, the Destroyer and Vishnu, the Preserver.
- ↑ Marek: "Wobei der Begriff Neo-Advaita darauf hinweist, dass sich die traditionelle Advaita von dieser Strömung zunehmend distanziert, da sie die Bedeutung der übenden Vorbereitung nach wie vor als unumgänglich ansieht. (The term Neo-Advaita indicating that the traditional Advaita increasingly distances itself from this movement, as they regard preparational practicing still as inevitable)[14]
- ↑ Alan Jacobs: Many firm devotees of Sri Ramana Maharshi now rightly term this western phenomenon as 'Neo-Advaita'. The term is carefully selected because 'neo' means 'a new or revived form'. And this new form is not the Classical Advaita which we understand to have been taught by both of the Great Self Realised Sages, Adi Shankara and Ramana Maharshi. It can even be termed 'pseudo' because, by presenting the teaching in a highly attenuated form, it might be described as purporting to be Advaita, but not in effect actually being so, in the fullest sense of the word. In this watering down of the essential truths in a palatable style made acceptable and attractive to the contemporary western mind, their teaching is misleading.[15]
- ↑ See for other examples Conway [web 2] and Swartz [web 3]
- ↑ Presently cohen has distanced himself from Poonja, and calls his teachings "Evolutionary Enlightenment".[20] What Is Enlightenment, the magazine published by Choen's organisation, has been critical of neo-Advaita several times, as early as 2001. See.[web 4][web 5][web 6]
- ↑ Tattvarthasutra [6.1][26]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Kapleau 1989.
- ↑ Indich 1995.
- ↑ Zelliot 1980.
- ↑ http://www.telugubhakti.com/telugupages/Sankara/Pdfs/Prakaranas/BrahmaJnana.pdf
- ↑ https://sanskritdocuments.org/sites/snsastri/brahmajnaanaavalimaalaa.pdf
- ↑ http://www.telugubhakti.com/telugupages/Sankara/Sankara.htm
- ↑ Dense 1999, p. 191.
- ↑ 8.0 8.1 8.2 Mukerji 1983.
- ↑ 9.0 9.1 9.2 Comans 1993.
- ↑ Comans 2000, p. 307.
- ↑ Rambachan 1994.
- ↑ 12.0 12.1 12.2 Lucas 2011.
- ↑ Marek 2008, p. 10, note 6.
- ↑ Marek 2008, p. 10 note 6.
- ↑ 15.0 15.1 Jacobs 2004, p. 82.
- ↑ Davis 2010, p. 48.
- ↑ Yogani 2011, p. 805.
- ↑ Caplan 2009, p. 16-17.
- ↑ Lucas 2011, p. 102-105.
- ↑ Gleig 2011, p. 10.
- ↑ Madhukar: “The Simplest Way”, Editions India, 2nd edition, USA & India 2006 p.1-16. (Interview with Sri H.W.L. Poonja by Madhukar)
- ↑ Baptiste 2011.
- ↑ Yogani 2011.
- ↑ Lardner Carmody 1996, p. 68.
- ↑ Sarbacker 2005, p. 1–2.
- ↑ Doshi 2007.
- ↑ Whicher 1998, p. 38–39.
- ↑ Larson 2008, p. 139–140.
- ↑ Birdee 2008.
- ↑ 30.0 30.1 puligandla 1997, p. 251-254.
- ↑ Adi Shankara, Tattva bodha (1.2)
వెబ్ మూలాలు
మార్చు- ↑ "The Complete Works of Swami Vivekananda/Volume 2/Jnana-Yoga/The Absolute and Manifestation - Wikisource". En.wikisource.org. 2008-04-05. Archived from the original on 28 June 2011. Retrieved 2011-06-10.
- ↑ Timothy Conway, Neo-Advaita or Pseudo-Advaita and Real Advaita-Nonduality
- ↑ James Swartz, What is Neo-Advaita?
- ↑ What is Enlightenment? September 1, 2006 Archived ఏప్రిల్ 14, 2013 at Archive.today
- ↑ What is Enlightenment? December 31, 2001 Archived మార్చి 10, 2013 at the Wayback Machine
- ↑ What is Enlightenment? December 1, 2005 Archived ఏప్రిల్ 14, 2013 at Archive.today
- ↑ Shankara, Adi. "The Crest Jewel of Wisdom". Charles Johnston (Trans.). pp. Ch. 1. Retrieved 2008-04-28.
- ↑ "Advaita Yoga Ashrama, ''Jnana Yoga. Introduction''". Yoga108.org. Archived from the original on 2013-01-13. Retrieved 2012-09-10.
- ↑ Sri Swami Sivananda, Karma Yoga